E-Paper
Advertisement

ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

Stunning Vande Bharat Train Routes: వందే భారత్ రైళ్లు కేవలం వేగంగా గమ్యస్థానానికి చేర్చే రైళ్లు మాత్రమే కాదు. అద్భుతమైన అనుభూతికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. కిటికీ బయట అందంగా కనిపించే పర్వతాలు, సముద్ర తీరాలు, పచ్చని అడవులు, కనువిందు చేసే ప్రకృతి అందాలు క్రేజీ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తాయి. కత్రా పర్వత ప్రాంతాల నుంచి గోవా బీచ్‌ల వరకు, మంగళూరు తీర ప్రాంతాల నుంచి మైసూరు సాంస్కృతిక అందాల వరకు అద్భుతంగా ఆకట్టుకునే 6 వందే భారత్ రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పర్వత ప్రాంతాల గుండా కత్రా ప్రయాణం

కత్రా వైపు వెళ్లే వందే భారత్ ప్రయాణం పర్వత ప్రాంతాల అందాల నడుమ అద్భుతంగా కొనసాగుతుంది. జమ్మూలోని  ప్రకృతి దృశ్యాలు, కొండల మధ్య ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వైష్ణోదేవి దర్శనానికి వెళ్లే భక్తులు ఈ మార్గంలో ఎంతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేస్తారు.

అలరించే గోవా బీచ్‌లు  

Advertisement

గోవా అంటేనే బీచ్‌లు, సముద్రం, ప్రశాంతమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. వందే భారత్‌లో గోవాకు వెళ్లే ప్రయాణం కూడా కొత్త అనుభూతిని అందిస్తుంది.  పచ్చని ప్రాంతాలు, కొండలు, కోస్తా తీర దృశ్యాలు ప్రయాణికులను కట్టిపడేస్తాయి. గోవా చేరుకున్న తర్వాత బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, లోకల్ ఫుడ్ ఆహా అనిపిస్తాయి.

మంగళూరు తీర అందాలు

మంగళూరు మార్గంలో ప్రయాణిస్తే పశ్చిమ కనుమలు, పచ్చని ప్రకృతి, తీర ప్రాంతాల అందాలు ఆకట్టుకుంటాయి.  ఈ ప్రాంతంలో కొండలు, నదులు, సముద్రం కలిసి కనిపించే దృశ్యాలు ప్రయాణికులకు జీవితంలో మర్చిపోలేని ఎక్స్ పీరియెన్స్ అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఈ రైలు ప్రయాణం ఎంతగానో నచ్చుతుంది.

మైసూరు సంస్కృతి, చరిత్ర

Advertisement

మైసూరు దేశంలోని అందమైన చారిత్రక నగరాల్లో ఒకటి. మైసూరు ప్యాలెస్, కనువిందు చేసే ఉద్యానవనాలు, సాంస్కృతిక వారసత్వం ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. వందే భారత్ ద్వారా ఈ నగరానికి చేరుకోవడం వేగవంతంగానే కాకుండా సౌకర్యవంతంగానూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు ఈ నగరం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ప్రకృతి అందాల నడుమ కేరళ ప్రయాణం

కొన్ని వందే భారత్ మార్గాలు కేరళలోని పచ్చని ప్రకృతిని కూడా దగ్గరగా చూపిస్తాయి. కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, నదులు, బ్యాక్‌వాటర్లు కనిపించే ప్రాంతాల్లో రైలు ప్రయాణం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ప్రయాణమే ఒక చిన్న టూర్‌లా అనిపించే మార్గాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.

ప్రయాణమే ఓ టూర్ లా..

ఈ 6 వందే భారత్ ప్రయాణాలు ఎంతో అందంగా ఉంటాయి. కత్రా పర్వతాలు, గోవా బీచ్‌లు, మంగళూరు తీరం, మైసూరు అందాలు లాంటి ప్రాంతాలకు వెళ్లే సమయంలో రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తే ట్రిప్ మరింత అద్భుతంగా ఉంటుంది. వేగం, సౌకర్యం, ప్రకృతి అందాలు కలిసిన ఈ వందేభారత్ ప్రయాణాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి.

Read Also: కాశ్మీర్ ఆపిల్స్ కోసం ప్రత్యేక రైళ్లు, ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ తినేయండి బాస్!

Tags

Related News

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

Big Stories

Advertisement
×