E-Paper
Advertisement

Tirupati Parakamani : పరకామణి చోరీ కేసులో ట్విస్టులు

Tirupati Parakamani : పరకామణి చోరీ కేసులో ట్విస్టులు

Tirupati Parakamani:  పరకామణిలో చోరీ కేసులో చిక్కుముడులు పడుతున్నాయి.. గుట్టు వీడిపోతుందని భావిస్తున్న తరుణంలోలో కేసులో కీలక వ్యక్తి అయిన మాజీ ఎవిఎస్ఓ మృతి ఇప్పుడు కేసు మొదటికి వచ్చినట్లైంది. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తున్న సిఐడికి ఇది ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్య తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడము కూడా కొంత దర్యాప్తకు ఇబ్బందిగా మారిందంటున్నారు.. ఆ క్రమంలో సతీష్ హత్య తర్వాత జరగనున్న పరిణామలేంటి?.. నెక్ట్స్ దర్యాప్తు ఎలా సాగబోతుంది?

కలియుగ ప్రత్యక్ష దైవం

పరకామణి అంటే కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరుని ఖజానా లాంటిది. స్వామి వారి దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తుడు తృణమూ పణమో స్వామి వారికి చెల్లించుకుంటాడు. ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా హుండీ వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్ ఉండదు ఒక్క తిరుమలలో తప్ప. స్వామి వారి ఆదాయంలో మెజార్టీ భాగం హుండీ నుంచి వస్తుంది. హుండీలో పడ్డ సొమ్ములను లెక్కించడాన్నే పరకామణి అంటారు. పరకామణిలో లెక్కింపు చాల ఖచ్చితంగా జరుగుతుంది.

స్వామివారి సొమ్ము కాజేసి కోటీశ్వరుడైన రవికుమార్

లెక్కించడానికి వెళ్ళే వారితో పాటు ఉద్యోగులను అణువణువు తనిఖీ చేస్తారు. ఎలాంటి మినహాయింపులు ఉండవని అంటారు కాని 1985 నుంచి ఓ ఉద్యోగి కి మినహాయింపు దొరికింది. పెద్దజియ్యంగార్ మఠానికి చెందిన గుమస్తా రవికూమార్ ఈ మినహాయింపు బాగా వాడుకుని కోటీశ్వరుడు అయ్యాడు. తెలివిగా విదేశీ కరెన్సీతో పాటు విలువైన నగలు తీసుకు వచ్చాడని అంటున్నారు. స్వామివారి సొమ్ము కాజేసి దిగువ మధ్యతరగతి వాడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. వందకోట్ల పైగా అస్తులను సంపాదించాడంట..

2023 ఏప్రిల్ 29 న రవికూమార్ పరకామణి లెక్కింపు పర్వవేక్షణకు జియ్యంగార్ మఠం తరపున హాజరు అయ్యాడు. ఈ సందర్భంగా అతని పాపం పండింది. డాలర్ల కరెన్సీ కట్టను పంచెలోకి దోపుకుంటుండగా సిసి పుటేజ్ లో రికార్డు అయ్యింది. తర్వాత అతన్ని తనిఖీ చేయడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయితే కరెన్సీ కట్ట స్థానంలో కేవలం 9 నోట్లు పట్టుబడినట్లు తిరుమల వన్ టౌన్ లో ఎవిఎస్ ఓ సతీష్ చేత ఫిర్యాదు ఇప్పించారు టీటీడీ ఉన్నతాధికారులు.

తిరుపతి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు

ఈ కేసు నమోదు అయిన తర్వాత తిరుపతి కోర్టులో సైతం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే సెప్టెంబర్ నెలలో కేసులో నిందితుడు, పిర్యాదు దారుడు రాజీ అయ్యారు. దీంతో పాటు టీటీడీకి రవికూమార్ నాలుగు నెలల మధ్య కాలంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 14 కోట్ల విలువైన అస్తులను రాసిచ్చాడు. తర్వాత రవికూమార్ అజ్ణాతంలోకి పోయాడు. మరో వైపు ఫిర్యాదు దారుడు అయిన సతీష్‌ను తిరుమల సెక్టార్ నుంచి తిరుపతిలోని పద్మావతి అమ్మవారి ఆలయానికి బదిలీ చేసారు.

వైసీపీ హయాంలో బయటపడిన భాగోతం

రవికూమార్ చోరీ వ్యవహారం బయటపడటంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అది వైసీపీ హయాంలో బయటపడిన భాగోతం కావడంతో ఏకంగా రవికూమార్‌కు సంబంధించిన వందల కోట్ల రూపాయల అస్తులను ఆ పార్టీ నేతలు తమ బినామిల పేర్ల రాయించుకున్నారని అరోపణలు వచ్చాయి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాంటి విచారణ జరగలేదు. కూటమి నాయకులు ఎన్నికలలో పరకామణీ దోపిడి అంటు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.

టీటీడీ అక్రమాలపై విచారణ

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ పోర్స్ మెంటు విచారణ చేయించారు. ఇందులో పరకామణీ ఇష్యూ కూడా ఉంది. విజిలెన్స్ సైతం పరకామణిలో జరిగిన చోరీ వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని రిపోర్టు ఇచ్చిందంట. అయితే కూటమి పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దానికితోడు అప్పటి ఈఓ శ్యామలరావు ఏమాత్రం స్పందించలేదు. ఆ క్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పెద్ద ఎత్తున దీనిపై పోరాటం చేశారు. పలుమార్లు సీఎం, డీజీపీలని కలసి విచారణ చేయాలని కోరారు. ఓ దశలో టిడిపి యువనేత నారాలోకేష్ దీనిపై సిట్ వేస్తామని ఓ ప్రకటన చేశారు. అయితే తర్వాత ఏమి మార్పులు జరగలేదు…

పరకామణి చోరీ వ్యవహారం పై హై కోర్టులో ఓపెల్ దాఖలు

పరకామణి చోరీ వ్యవహారంపై తిరుపతికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసులు హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేసారు. దీనిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించి విచారణకు అదేశించింది. ఓ దశలో టీటీడీ న్యాయవాది అయితే హైకోర్టులో శ్రీనివాసులు క్యారెక్టర్ గురించి కూడా వ్యంగంగా మాట్లాడారు. అయితే కోర్టు టీటీడీ పాలకమండలితో పాటు పోలీస్ శాఖకు అక్షింతలు కూడా వేసింది. తర్వా త సిఐడి విచారణకు అదేశించి డిసెంబర్ 2న తమకు నివేదిక ఇవ్వాలని అదేశాలు జారీ చేసింది. ఇక్కడ అవినీతి జరిగి ఉంటే ఎసిబి కూడా ఎంటర్ కావాలని అదేశాలు జారీ చేసింది.

20 మంది బృందంతో తిరుపతి లో మకాం వేసిన సిఐడి

సిఐడి చీప్ రవిశంకర్ అయ్యన్నార్ 20 మంది బృందంతో తిరుపతి వచ్చి మకాం వేసారు. వీరిలో లీగల్ టీమ్, పోరెన్సిక్ టీమ్ తో పాటు సిఐడి అధికారులు ఉన్నారు. స్థానిక సిఐడి వారిని ఈ కేసు విషయంలో ఇన్వాల్ కానియ్యలేదు. మరో వైపు పరకామణితో పాటు న్యాయస్థానం, తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తిరుపతి, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంటలలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో వివరాలు తెలుసుకున్నారు. 2023 ఏప్రిల్ 29 నుంచి అక్టోబర్ వరకు జరిగిన రవికూమార్ కుటుంబసభ్యులు జరిపిన లావాదేవీలు తెలుసుకున్నారు.

సిఐడి విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. మొదటి రోజు ఎవీఎస్ఓ సతీష్‌తో పాటు హైకోర్టులో పిల్ వేసిన శ్రీనివాసులను విచారించింది. తర్వాత తిరుమలలో పనిచేసిన కీలక పోలీసు అధికారులు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మిరెడ్డి, విజివోలు గిరిధర్, బాలిరెడ్డిలను విచారించింది. ఇక నిందితుడు రవికూమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, తిరుపతి జేఈఓ వీర బ్రహ్మం, టీటీడీ పైనాన్స్ అధికారి బాలాజీతో పాటు పరామణి సీసీ కెమెరా అపరేటర్ చంద్ర, అదే రోజులో విధుల్లో ఉన్న వారిని విచారించింది..

సతీస్ కేసు విషయంలో రాజీ అయ్యాడని విజిలెన్స్ నివేదిక

సీఐడీ విచారణలో చోరీ చేసిన కరెన్సీ నోట్లు ఎందుకు తగ్గించి కేసు నమోదు చేసారు.. గిఫ్ట్ డీడ్ తీసుకునే ముందు ఎందుకు పబ్లిక్ నోటీసు ఇవ్వలేదు..స్టాంప్ ఫీజు ఎవరు కట్టారు.. రవికూమార్ అస్తులు రాయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..పాలక మండలి అత్యవసర సమావేశం జరిపిందా.. రవికూమార్ అస్తులను జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎందుకు రాయించుకున్నాడు.. ఎవ్వరు ఇతను అని విచారించారు. పైఅధికారుల వత్తిడి వల్లే కేసులో సతీష్ కేసు విషయంలో రాజీ అయ్యాడని విజిలెన్స్ నివేదికలో ఉంది.

సతీష్‌పై వత్తిడి తెచ్చిన పై అధికారులు

సతీష్‌పై వత్తిడి తెచ్చిన పై అధికారులు ఎవరు .. అప్పటి సీవీ అండ్ ఎస్వోనా లేక ఎస్పీనా అప్పటి ఇఓ, పాలక మండలా.. లేక తిరుమల పోలీసుల అధికారులా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. రవికుమార్ పేరిట తిరుపతిలోని అస్తులే కాకుండా తమిళనాడులోని అస్తులను కూడా రాయించారు.. ఇంకా ఎన్ని అస్తులు అతని పేరిటి ఉన్నాయి..ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రవికూమార్ చోరీలకు పాల్పడ్డాడా అన్న కోణంలో సీఐడీ ప్రశ్నలను సంధించినట్లు సమాచారం..

ఆ క్రమంలో మరోసారి విచారణకు హాజరు కమ్మని మాజీ ఏవీఎస్ఓ సతీష్‌కు నోటీసులు పంపింది సీఐడీ .. ప్రస్తుతం సతీష్ హైకోర్టు విచారణ ప్రారంభం తర్వాత వీఆర్లో ఉన్నారు.. టిటిడి నుంచి రైల్వే కు వెళ్ళిన సతీష్ గుంతకల్లులో పనిచేసేవాడు.. శుక్రవారం జరిగే సిఐడి విచారణకు వస్తు తాడిపత్రి , రాయలచెర్వు మద్యలో ఉన్న కొమలి స్టేషన్ సమీపంలో ప్రాణాలు కొల్పోయాడు.. రైలు పట్టాలకు కొంత దూరంలో అతని మృతదేహం పడి ఉంది.. రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే శవం పట్టాల పక్కనే ఉంటుంది.. కాని 10 మీటర్ల దూరంలో మృతదేహం ఉంది.. అదే విధంగా తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి.. ముందు వైపు స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయి.. దీంతో పోలీసులు దీనిని హత్యగా భావిస్తున్నారు ..పోస్టు మార్టం ప్రాథమిక నివేదికలో సైతం హత్యగానే నిర్ధారించినట్లు సమాచారం..సిఐడితో పాటు అనంతపురం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.. హత్య జరిగి ఉంటే హత్య ఎవ్వరు చేశారు? తమ పేర్లు బయటకు వస్తాయని పెద్ద తలకాయలు చేయించాయా లేక సతీష్‌కు వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? అన్న కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

హైకోర్టు ఇచ్చిన గడువుకు పూర్తి చేస్తామంటున్న అధికారులు

సతీష్ మృతితో పరకామణి కేసు విచారణ అగిపోదని అంటున్నారు. ఇప్పటికే సతీష్ కీలకమైన సమాచారం సీఐడీకి ఇచ్చాడంట. దీంతో పాటు రవికూమార్ సైతం కీలక సమాచారం అందించాడని తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని హైకోర్టు ఇచ్చిన గడువుకు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారంట. ముఖ్యంగా సతీష్ మరణం తర్వాత కేసులో సాక్షులకు భయం పట్టుకుందని అంటున్నారు. దీంతో ఇప్పటికే కేసును బయటకు తేవడానికి కృషి చేసిన భానుప్రకాష్‌రెడ్డికి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది.

మరో వైపు రాజకీయ కోణంలో అధికార ప్రతిపక్షాలకు మంచి అస్త్రం దొరికింది. సతీష్ మరణ వార్త తెలియగానే వైసీసీ సోషల్ మీడియాలో ప్రభుత్వం వత్తిడి వల్ల పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేసారు. దీంతో పాటు సీనియర్ నాయకుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పోలీసులు, సిఐడిపై విరుచుకు పడ్డారు. సతీష్ ఆత్మహత్యకు కారణం సిఐడి అధికారులు బూతులు తిట్టారంటు అగ్రహం వక్తం చేసారు. తన మీద చెప్పమని బెదిరించారని ఆరోపించారు.

చర్చనీయాంశంగా మారిన సతీష్ హత్య

మొత్తం వ్యవహారంలో ముందుగానే వైసీపీ స్పందించింది. అయితే సతీష్‌ది హత్యగా నిర్ధారించిన పోలీసులు తర్వాత సైలెంట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కూటమి నేతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో గతంలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తున్నారు. దేవ దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీనివాసుడు తన సొమ్ములు తిన్నవారిని వదిలిపెట్టడని అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు పరకామణి కేసు పోలీసులకు ,ప్రభుత్వానికి మరింత ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పవచ్చు..

Story by Apparao, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×