E-Paper
Advertisement

అమ్మబాబోయ్.. రూ.200 లోపు ఇన్ని మంచి ప్లాన్స్ ఆ.. BSNL‌కు సెల్యూట్ చేయాల్సిందే!

అమ్మబాబోయ్.. రూ.200 లోపు ఇన్ని మంచి ప్లాన్స్ ఆ.. BSNL‌కు సెల్యూట్ చేయాల్సిందే!
Advertisement

BSNL Recharge Plans: ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు చౌకైన ప్లాన్లను అందిస్తూ ఉంటుంది. తక్కువ ధరలో ఫ్రీ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ప్రాధాన్యతలను బట్టి రూ.200 లోపు కొన్ని అద్భుతమైన ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. వాటిలో టాప్ – 5 రీఛార్జ్ ప్లాన్లను ఈ కథనం అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

రూ. 99 ప్లాన్

డేటాతో పెద్దగా పనిలేకుండా వాయిస్ కాల్స్ మాత్రమే కోరుకునేవారి కోసం స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) కింద ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. దీని ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇందులో 50MB డేటా మాత్రమే యూజర్లకు లభించనుంది. డేటా పరిమితి దాటిపోతే.. ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి తగ్గనుంది.

రూ. 107 ప్లాన్

Advertisement

పరిమిత వ్యాలిడిటీతో డేటా, ఫ్రీ కాల్స్ కోరుకునేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 20 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ లో 200 నిమిషాల టాక్ టైమ్ తో పాటు ప్లాన్ మెుత్తం వ్యవధికి 3GB డేటా లభించనుంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే రోజుకు 5.35 మాత్రమే ఖర్చు కానుంది.

రూ. 147 ప్లాన్

అపరిమిత కాలింగ్ కోరుకునే వారికి రూ.147 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. 24 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. దీంతో పాటు మొత్తం 5GB డేటా ఉచితంగా లభిస్తుంది.

రూ. 153 ప్లాన్

Advertisement

24 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ యూజర్ కు 1GB డేటా లభిస్తుంది. అంటే ప్లాన్ ముగిసే సరికి మొత్తం 24GB డేటా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు ప్రతిరోజూ 100 SMSలు, ఉచితంగా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

Also Read: పెళ్లి దుస్తుల్లో వైద్యం చేసిన వధువు.. కాసేపు పెళ్లి వేడుకలు వాయిదా, వీడియో వైరల్

రూ. 197 ప్లాన్

సిమ్ ను ఎక్కువ రోజులు యాక్టివ్ గా ఉంచాలని భావించేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. ఇందులో 300 నిమిషాల టాక్ టైమ్ ను అందిస్తారు.అలాగే 100 ఎస్ఎంఎస్ లు, 5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. డేటా పరిమితి ముగిస్తే ఇంటర్నెట్ వేగం 40Kbps కు తగ్గిపోనుంది.

Also Read: దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×