E-Paper
Advertisement

ట్రంప్ పంతం.. ఇరాన్ పట్టుదల.. గల్ఫ్ యుద్ధ మేఘాల మధ్య నలుగుతున్న ప్రపంచం!

ట్రంప్ పంతం.. ఇరాన్ పట్టుదల.. గల్ఫ్ యుద్ధ మేఘాల మధ్య నలుగుతున్న ప్రపంచం!
Advertisement

US-Iran: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా? ఇప్పుడిది ఓ పెద్ద భేతాళ ప్రశ్నగా మారింది. ఎందుకంటే చాలా విషయాల్లో అటు అమెరికా, ఇటు ఇరాన్ తగ్గేదేలే అంటోంది. నిజానికి ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఒంటెద్దు పోకడలను తలపిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్‌ శాంతి ఒప్పందం, చర్చలు, హర్మూజ్‌ మూసివేత, తెరవడం.. వీటన్నింటిపై ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ అన్నీ ఉట్టి మాటలే అని తేల్చేస్తోంది ఇరాన్. దీంతో ఆయన పరువు అంతర్జాతీయంగా పోతున్నా.. తన మాటలకు విలువ తగ్గిపోతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరింత రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు.

గంటల్లోనే సీన్ రివర్స్

ఫర్ ఎగ్జాంపుల్.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే పాక్ వేదికగా చర్చలు జరుగుతాయన్నారు. ఈ సారి తానే చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఉందన్నారు. తాము పెట్టిన అన్ని కండిషన్స్‌కు ఇరాన్ అంగీకరించిందని ప్రకటించారు. ట్రంప్‌ స్టేట్‌మెంట్‌ ఇలా వచ్చిన కొన్ని గంటల్లోనే సీన్ రీవర్సైంది. ఇరాన్‌ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో శాంతి ఒప్పందం కుదిరేలా లేదని తేల్చేశారు. చర్చల్లో కాస్త పురోగతి ఉన్నా.. తుది ఒప్పందం మాత్రం ఇప్పట్లో కుదిరేలా లేదని ఆయన చెబుతున్న మాట. అంతేకాదు అమెరికాపై క్షేత్రస్థాయిలో తాము పైచేయి సాధించామని.. తమ డిమాండ్లకు అంగీకరించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించామన్నారు ఆయన.

ట్రంప్ ప్లాన్ రివర్స్

Advertisement

యాక్చువల్‌గా ఈ యుద్ధం మొదలైనదే ఇరాన్ అణు కార్యక్రమాలకు చెక్ పెట్టడానికి. ఇరాన్‌ అగ్రనాయకులను హతం చేసి.. ప్రభుత్వాన్ని మార్చేసి ఈ కార్యక్రమాలకు పూర్తిగా ఎండ్ కార్డ్ పెట్టాలనేది అమెరికా ఆలోచన. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో చర్చల్లో ఇప్పుడు ఇదే టాపిక్‌ను హైలేట్ చేస్తోంది అమెరికా. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయాలంటోంది. ఇప్పుడు డీల్ కుదరకపోవడానికి ప్రధాన అడ్డంకి ఇదే నిబంధన. ఓవైపు ట్రంప్‌ ఇదిగో డీల్.. అదిగో ఒప్పందం.. అంటుండగానే.. ఇరాన్ ఈ విషయంపై మరోసారి తేల్చి చెప్పంది. అసలు తమ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి అమెరికా ఎవరు అని ఎదరు ప్రశ్నిస్తున్నారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.

తగ్గేదేలే అంటున్న ఇరాన్

అంతేకాదు అసలు ఈ యుద్ధం చేస్తున్నది తమ ఆత్మరక్షణ కోసం మాత్రమే తప్ప మరే కారణం లేదంటున్నారు ఇరాన్ అధ్యక్షుడు. అసలు తమ అణు కార్యక్రమాలను అడ్డుకోవడానికి అమెరికా వద్ద సరైన కారణం లేదని.. ఇది తమ హక్కు అంటున్నారు ఆయన. సో.. అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్ తగ్గేదేలే అంటోంది.

ఇరాన్ నౌకలను అడ్డుకుంటున్న అమెరికా

Advertisement

సో.. అణుకార్యక్రమం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనిపిస్తోంది ఆ దేశ నాయకుల మాటలను చూస్తుంటే. మరి ఇప్పుడు ఒప్పందం కుదిరేది ఎలా? అనేది ఓ పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. ఇరాన్‌ను కాళ్ల బేరానికి తీసుకొచ్చేందుకు అమెరికా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇందుకు అనేక మార్గాలను ఉపయోగిస్తోంది. ఇప్పటికే ఆ దేశంపై దాడులు చేసినా ఫలితం లేకపోవడంతో కొత్త మార్గాన్ని అనుసరించింది. అదే ఇరాన్‌ పోర్టులకు వెళ్లి వచ్చే నౌకలను అడ్డుకోవడం. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తోందనేది అమెరికా నమ్మకం. అందుకే ఇప్పటికే అమెరికన్ నేవీ షిప్స్‌ ఇప్పుడు వ్యూహాత్మక ప్రాంతాల్లో తిష్ట వేసి ఇరాన్‌ నౌకలను అడ్డుకుంటున్నాయి.

ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ఇరాన్

కానీ ఈ వ్యూహంపై చాలా ఆచితూచి స్పందిస్తోంది ఇరాన్. అంతేకాదు అమెరికా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి లెటెస్ట్‌ ఎగ్జాంపుల్.. హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌ తీసుకున్న నిర్ణయాలు. నిజానికి అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు విరమణ కుదరగానే హర్మూజ్‌ తెరుచుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సేనల దాడులు ఆగే వరకు హర్మూజ్ మూసే ఉంటుందని తేల్చేసింది ఇరాన్. తీరా ఇజ్రాయెల్, లెబనాన్‌ మధ్య డీల్ కుదరగానే.. హర్మూజ్‌ను తెరిచినట్టే తెరిచింది. ఇంతలో ఇదంతా తమ క్రెడిట్ అని అమెరికా ప్రకటించేసుకుంది. గంటల్లోనే చమురు ధరలు రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. ఈ పరిణామాలన్ని ఎంత వేగంగా జరిగాయో.. మళ్లీ అంతే వేగంగా హర్మూజ్‌ను మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది.

డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

అయితే ఇరాన్ ప్రకటన వెనక ఓ రీజన్‌ ఉంది. ఇరాన్‌ హర్మూజ్‌ను తెరిచినా కానీ తమ యుద్ధ నౌకలు ఇరాన్‌కు వెళ్లే నౌకలను అడ్డుకుంటాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఒప్పందం కుదరే వరకు ఇది కొనసాగుతోందని చెప్పారు. దీంతో ఇరాన్‌ తన మనసు మార్చుకొని ఒప్పందం కుదిరే వరకు హర్మూజ్‌ను మూసే ఉంచుతామని తేల్చి చెప్పింది. అంతేకాదు ఈ విషయంలో తాము ఎంత సీరియస్‌గా ఉన్నామో చెప్పడానికి హర్మూజ్‌ను దాటే పలు నౌకలపై కాల్పులు జరిపింది. ఇందులో భారత్, యూకేతో పాటు ఇంకా కొన్ని దేశాల నౌకలు ఉన్నట్టు తెలుస్తోంది. సో… హర్మూజ్ విషయంలో తాము ఎంత సీరయస్‌గా ఉన్నామో ఈ ఘటనతో చెప్పింది ఇరాన్.

డొంట్ కేర్ అంటున్న ఇరాన్

మరి దీనికి ఇరాన్‌ మూల్యం చెల్లించుకోదా.. అంటే అదంతా డొంట్ కేర్ అంటోంది ఇరాన్. ఇది ఇన్‌డైరెక్ట్‌గా అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో భాగమే అని చెప్పాలి. నిజానికి ఇలా చేయడం వల్ల అమెరికాకు నేరుగా ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే హర్మూజ్‌ నుంచి అమెరికాకు వెళ్లే చమురు చాలా తక్కువ. ఇప్పటికే ప్రత్యామ్నాయాలను సెట్ చేసి పెట్టుకొంది. ఇప్పుడు ఇబ్బంది అంతా ఆసియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలకే. కానీ మీరు మీరు కొట్టుకొని.. తమను ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన ఇప్పటికే అన్నీ దేశాల్లో వచ్చేసింది. దీనంతటికి కారణం అమెరికానే అనే ఆలోచన అన్ని దేశాల్లో రావాలనేదే ఇరాన్ ఆలోచన. ఇప్పుడీ విషయంలో కాస్త సక్సెస్ అవుతోంది.

శాంతి దూత పాత్ర పోషిస్తున్న పాకిస్థాన్

కానీ ఈ ఎత్తులకు పైఎత్తులు, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఇప్పుడు సమస్యను పరిష్కరించే పరిస్థితి అయితే లేదు. అంతేకాదు ఇరు దేశాల మధ్య డీల్ కుదరకపోవడానికి ఇప్పుడు ఓ పెద్ద మనిషి అంటూ సరికొత్త చర్చ నడుస్తోంది. పాకిస్థాన్.. ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య శాంతిదూత పాత్ర పోషిస్తున్నది. ముఖ్యంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ కంటే.. ఎక్కువగా క్రెడిట్‌ కోసం తహతహలాడుతున్నారు పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్. కానీ అతని అత్యుత్సాహంపై ఇప్పుడు అమెరికాకు అనుమానాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కొన్ని నివేదికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇరాన్-పాక్ కనెక్షన్.. మునీర్ పాత్రపై చర్చ

ఆసీమ్‌ మునీర్‌కు ఎప్పటి నుంచో ఇరాన్‌లోని ఐఆర్‌జీసీతో బలమైన సంబంధాలున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు యూఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇరాన్ ఖుద్స్‌ ఫోర్స్‌ నేత ఖాసీం సులేమానీ, ఐఆర్‌జీసీ కమాండర్‌ హోస్సెన్‌ సలామీతో మునీర్‌కు సంబంధాలున్నాయి. దీంతోపాటు ఇరాన్‌ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులతో కూడా మునీర్‌కు పరిచయాలున్నాయి. ఇదే ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోవడానికి ఒక కారణం అని భావిస్తున్నారు. ఇరాన్‌తో ప్రత్యేక బంధం కారణంగా మునీర్‌ దౌత్యంలో వ్యూహాత్మక ఇబ్బందులున్నట్లు తెలుస్తోంది. అమెరికా చెప్పాలనుకున్నవి.. చేయాలనుకున్నవి..మునీర్‌ చేయలేకపోతున్నారనేది అమెరికా అనుమానం.

మునీర్‌పై అమెరికా గుసగుసలు

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఫేవరేట్ ఫీల్డ్‌ మార్షల్ ఆసీమ్ మునీర్. తాను చెప్పినట్టు ఆడుతాడని ట్రంప్‌కు చాలా అభిమానం మునీర్ అంటే. కానీ ఇప్పుడు అమెరికా ఉద్దేశాలకు అనుగుణంగా పని చేయకపోవడంతో అమెరికన్ పాలకులు కాస్త గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. అమెరికా గడ్డపై నుంచి ఇలాంటి వార్త కథనాలు వస్తున్నాయంటే.. మునీర్‌కు మూడినట్టే అని చెప్పాలి. లేదంటే మునీర్‌పై నమ్మకం పోయిందని ఓ వార్నింగ్ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఓ రకంగా మునీర్‌పై ఇన్‌డైరెక్ట్‌గా అమెరికా ఒత్తిడి పెంచుతోంది.

అమెరికా ప్లాన్‌కు బ్రేక్?

నిజానికి మునీర్‌ ఒత్తిడి తెచ్చినంత మాత్రానా ఇప్పుడు వినే పోజిషన్‌లో లేదు ఇరాన్. ఎందుకంటే ఇరాన్‌ను వెనకుండి నడిపిస్తున్నది రష్యా, చైనా అనే చర్చ జరుగుతోంది. ఆ దేశాలు చెబితేనే నష్టమైనా ఇరాన్‌ వింటుంది. నిజానికి ఇరాన్ పోర్టులను దిగ్బంధించడం వెనక కూడా అమెరికా వ్యూహం చైనాను ఇబ్బంది పెట్టడమే. ఎందుకంటే ఇరాన్‌లో ఉత్పత్తి అయ్యే 80 శాతం చమురును కొనుగోలు చేసేది చైనానే. అంటే ఇన్‌డైరెక్ట్‌గా చైనాకు చెక్ పెడుతూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది అమెరికా. కానీ చైనా కూడా తగ్గేదేలే అంటోంది.

యూఎస్ ఒత్తిడికి బ్రేక్

ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఎవరి వ్యూహాలు వారికి కనిపిస్తున్నాయి. ఎవరి కారణాలు వారికి కనిపిస్తున్నాయి. అన్ని దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టి.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచాలనేది అమెరికా ఆలోచన. హర్మూజ్‌ను మూసేసి అన్ని దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచాలనేది ఇరాన్ వ్యూహం. రణతంత్రం ప్రకారం చూస్తే ఈ రెండు సమర్థవంతమైన వ్యూహాలే. నిజానికి అమెరికాకు ఉన్న ఆర్థిక, సైనికబలాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈపాటికే ఇరాన్‌ తలవంచాలి. కానీ ఈ క్యాలిక్యులేషన్‌ను మార్చేశాయి రష్యా, చైనాలు. రష్యా సైనిక పరంగా.. చైనా ఆర్థికపరంగా ఇరాన్‌కు అండగా ఉంటున్నాయి. నిజానికి పాకిస్థాన్‌ను శాంతిదూతగా ముందు పెట్టి వెనక ఇరాన్‌ను చర్చలకు ఒప్పించింది కూడా చైనానే అనేది ఒక వాదన.

ఇరాన్‌తో డీల్‌కు కొత్త ఫార్ములా

మనం ముందుగా చెప్పుకున్నట్టు అమెరికా బెదిరిస్తేనో.. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తేనో ఈ ఒప్పందం కుదరదు. ఇది మాత్రం పక్కా. ఈ ఒప్పందం కుదరాలంటే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా పట్టువీడాలి.. అదే సమయంలో ఈ ఇరు దేశాలు ఇరాన్‌ను ఒప్పించాలి. అప్పుడే ఈ శాంతి ఒప్పందం కుదురుతుంది. అప్పటి వరకు ఇలా ఎవరి వ్యూహాలు వారి రచిస్తూనే ఉంటారు.. అమలు చేస్తూనే ఉంటారు. మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతూనే ఉంటాయి.

Also Read: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. భారత్‌కు సైతం ముప్పు?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×