Big Stories

Different Weather in World : మాడుపగిలే ఎండలు.. వెంటనే వర్షాలు, ఎడాది దేశాల్లో వరదలు.. ప్రకృతి పగబట్టిందా ?

Different Weather in World : ఓ ప్రాంతంలో భరించలేని ఎండలు. మరో ప్రాంతంలో తట్టుకోలేనంత చలి. ఇంకో ప్రాంతంలో ముంచెస్తున్న వరదలు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పరిస్థితి. మొత్తానికి ప్రకృతి మనుషులతో ఓ ఆట ఆడుకుంటోంది. ఆట కూడా అనకూడదేమో.. తాండవం.. విలయతాండవం ఆడుతుంది. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది ? ఈ విచిత్ర, విపరీత ప్రకృతి వైపరీత్యానికి కారణమేంటి ?

- Advertisement -

ఈ దేశం ఆ దేశం అని లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు, దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న పవిత్ర హజ్ యాత్రలో ఉన్న 577 మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. కారణం దారుణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మక్కాలో ఏకంగా 51 డిగ్రీలను మించి నమోదవుతుంది ఉష్ణోగ్రత. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇక్కడ ప్రకృతే ప్రజల ప్రాణాలు తీస్తుంది. ఒక్క మక్కాలోనే కాదు.. ఇప్పుడు అనేక దేశాల్లో టెంపరేచర్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి.

- Advertisement -

మన దేశాన్నే తీసుకోండి. మాములుగా ఉత్తర భారతంలో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక ఈ టైమ్‌కు అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మెయిన్‌గా ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు వీస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అయితే నార్మల్‌ కంటే ఏకంగా ఆరు డిగ్రీ సెంటిగ్రెడ్‌లు ఎక్కువ టెంపరేచర్‌ నమోదవుతుంది. ఒక్క బిహార్‌లోనే 24 గంటల్లో 22 మంది చనిపోయారు. రెడ్ అలర్ట్‌లు జారీ అవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా ఉక్కపోత, ఎండలు మాత్రం తగ్గడం లేదు. హిల్ టౌన్స్‌ అయిన పౌరీ, నైనిటీల్‌లో కూడా వేడి గాలులు వీస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు.

ఇది ఇండియా బాధ. ఈస్ట్ దేశాలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 50 డిగ్రీల టెంపరేచర్‌ నమోదవడం కామన్‌గా మారింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే జడుసుకునే పరిస్థితి ఉంది. దీనికి బెస్ట్‌ ఉదాహరణే హజ్ యాత్ర. గతంలో ఎప్పుడూ లేనంతగా మక్కాకు వచ్చే ముస్లిం భక్తులు చనిపోతున్నారు.

Also Read : హజ్ యాత్రలో విషాదం.. 550 మంది యాత్రికులు మృతి

ఇక మరో విచిత్ర పరిస్థితి ఏంటంటే.. ఎక్కడైతే ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో.. అదే మిడిల్ ఈస్ట్‌ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్‌గా మారిపోయింది.

కొన్ని దేశాలు ఇలా ఎండలు, వానలతో కిందా, మీదా పడుతుంటే.. మంగోలియా పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడి ప్రజలు. ఇక చలి దెబ్బకు చనిపోతున్న జంతువుల సంఖ్యకైతే అసలు లెక్కేలేదు. ఇక్కడ జడ్‌.. అంటే తీవ్ర అనావృష్టి తరువాత వాతావరణం ఉన్నట్టుండి అతి శీతల చలికాలం రావడం. ఇప్పుడీ జడ్‌ మంగోలియాను షేక్ చేస్తుంది. ఇప్పుడీ జడ్ కారణంగా అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఈ ఇయర్‌లో జడ్ కారణంగా 71 లక్షల పశువులు మృతి చెందాయి. ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. జడ్ కారణంగా కోటి 49 లక్షల పశువులు చనిపోతాయని అంచనాలు ఉన్నాయి. నిజానికి మంగోలియాలో పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలను జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం గుర్తించింది. మంగోలియా ఎక్స్‌పోర్ట్స్‌లో మాంసానిది సెకండ్ ప్లేస్. ఇప్పుడు జెడ్‌ కారణంగా మంగోలియా ఎక్స్‌పోర్ట్స్‌కు దెబ్బ పడినట్టే. నిజానికి జెడ్‌ పదేళ్లకు ఒకసారి వచ్చేది ఈ జడ్‌. కానీ గడచిన పదేళ్లలో ఇప్పుడు వచ్చిన జడ్.. ఆరోది. అంటే ప్రకృతిలో ఎంత మార్పు వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ముందే చెప్పుకున్నాం కదా.. ఓ చోట ఎండ.. మరో చోట వరద.. మరో చోట చలి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం ఏదో రకమైన ప్రకృతి వైపరిత్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంది. మరి దీనికి రీజన్ ఏంటో తెలుసా ? రోజురోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్. రోజురోజుకు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్ రిలీజ్‌ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఇవన్నీ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజానికి ప్రతి ఏడాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఆసియా నుంచి అంటార్కిటికా దాకా.. అత్యంత పేద దేశం నుంచి ధనిక దేశం దాకా.. ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుంది. అనేక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అమలు విషయానికి వస్తే అంతంత మాత్రమే. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉంటాయి. మంచు కరుగుతూనే ఉంటుంది. సముద్రాలు పెరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంటుంది. మరి ఇంకెప్పుడు మారుతారో చూడాలి. ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుందని వార్నింగ్ ఇస్తున్నారు వాతావరణ నిపుణులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News