BigTV English

T20 World cup 2024 West indies vs England: వెస్టిండీస్ భారీ స్కోర్, ఇంగ్లాండ్ టార్గెట్ 181 పరుగులు

T20 World cup 2024 West indies vs England: వెస్టిండీస్ భారీ స్కోర్, ఇంగ్లాండ్ టార్గెట్ 181 పరుగులు

T20 World cup 2024 West indies vs England: టీ 20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్‌ల్లో చిన్న జట్లు ఉన్నా, పెద్ద టీమ్‌ల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. తాజాగా గురువారం సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ ముందు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది విండీస్.


తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్- జాన్సన్ బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. గాయం కారణంగా బ్రాండన్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మైదానం వీడాడు. తర్వాత వచ్చిన పూరన్.. జాన్సన్‌కు జత కలిశాడు.

వీరిద్దరూ మైదానం నలువైపులా యథేచ్చగా షాట్స్ కొడుతూ స్కోరు బోర్డు ముందుకు పరుగులెత్తించారు. 11.1 ఓవర్లకి జట్టు స్కోర్ 94 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉంది. ఈ క్రమంలో జాన్సన్ అవుటయ్యా డు. ఈలోగా వచ్చిన కెప్టెన్ పావెల్ వీరవిహారం చేశాడు. 17 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అందులో ఐదు సిక్స్‌లు బాదాడు. చివరకు అనుకోకుండా ఔటయ్యాడు. రూథర్‌ఫోర్డ్ కూడా దూకుడుగా ఆడడంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.


ALSO READ: తొలి సూపర్ 8 మ్యాచ్ : చచ్చీ చెడి గెలిచిన సౌతాఫ్రికా

జాన్సన్, పోరన్, పావెల్ దూకుడుగా ఆడడంతో ఈ స్కోర్ చేసింది వెస్టిండీస్. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఆర్చర్, రషీద్, మొయిన్అలీ, లివింగ్ స్టోన్ తలా ఒకొక్క వికెట్ తీశారు. అనంతరం 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగారు ఇంగ్లీష్ ఆటగాళ్లు.

Tags

Related News

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Watch Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు… బౌలింగ్ వేస్తూ మూతి పగలగొట్టాడు.. వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Ganesh Idol : RCB ట్రోఫీతో బొజ్జ గణేష్… మళ్లీ తొక్కి సలాట జరగడం గ్యారంటీ అంటూ ట్రోలింగ్ !

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

Big Stories

×