BigTV English

IVF and Fertility Centre: IVF, సరోగసీ పేరుతో జరిగే మోసలేంటి? అధికారులు ఏమంటున్నారు?

IVF and Fertility Centre: IVF, సరోగసీ పేరుతో జరిగే మోసలేంటి? అధికారులు ఏమంటున్నారు?

IVF and Fertility Centre: సృష్టి సరోగసీ వ్యవహారం కారణంగా.. ప్రస్తుతం ఫర్టిలిటీ, ఐవీఎఫ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐవీఎఫ్ టోటల్ ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉంటాయా? అందుకే సరోగసీ అనే అడ్డదారుల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉంటే సృష్టి బాధితుల గోడు ఏంటి? ఈ విషయంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత వాదనలు ఎలాంటివి? అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు చూద్దాం.


ఐవీఎఫ్ 90 శాతం ఫెయిల్యూర్సే ఎక్కువ

ఓవరాల్‌గా ఐవీఎఫ్ 90 శాతం ఫెయిల్ కావడమే ఎక్కువ. కారణమేంటంటే ఇందులో అధిక శాతం.. కేసుల్లో పిల్లల కోసం ఎదురు చూసి చూసి 35 ఏళ్ల వయసు దాటాక.. ఇలాంటి ఫర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తారు. వీరిలో మరో కేటగిరి వారు ఉంటారు. వీరు ఎంపిక చేసుకున్న వృత్తి తదితర అంశాల కారణంగా సంతానోత్పత్తికి టైం ఎక్కువ తీసుకుంటారు. ఈ టైమింగే అతి పెద్ద మిస్టేక్. తర్వాతి కాలంలో వీరు ఈ సెంటర్లుకు రాగానే రెండు మూడు సిట్టింగుల తర్వాత వచ్చే మెయిన్ కామెంట్ .. అండాల నాణ్యత లేదని అంటారు డాక్టర్లు.


IVF గర్భదారణ సక్సెస్ రేటు 40 శాతం మాత్రమే

ఇప్పటి వరకూ ఉన్న గణాంకాలను అనుసరించి చెబితే.. ఐవీఎఫ్ క్లినికల్ గర్భదారణల సక్సెస్ రేటు 40 శాతం మాత్రమే. ఇక ప్రత్యక్ష జననాల రేటు 33 శాతానికి మించి లేదు. ఎప్పుడైతే.. ఇది సాధ్యం కాదని తెలుస్తుందో.. సరోగసికి వెళ్లడం ప్లాన్ B గా చెబుతారు. బేసిగ్గా ప్లాన్ A ఇదే కానీ.. ఇక్కడొక టెక్నిక్ వాడతారు. వారి వీక్నెస్ ని క్యాష్ చేసుకోడానికి పెద్ద ఎత్తున ట్రై చేస్తారు. ఇందుకంటూ భారీ ఎత్తున ఖర్చవుతుందని చెప్పడం. అక్కడ ఎలాంటి ఖర్చు లేకున్నా.. వీరు దాన్ని అతి పెద్ద విషయంగా భూతద్దంలో పెట్టి చూపించడం జరుగుతుంది. విజయవాడలో ఒక బాధితురాలికి.. ఆమె పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నా.. డబ్బు కోసం ఆమెకంటూ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి డబ్బు గుంజినట్టు తెలుస్తోంది.

రాజస్థాన్ దంపతుల నుంచి రూ.34 లక్షలు వసూలు

ఇదిలా ఉంటే.. కమర్షియల్ సరోగసీ.. అతి పెద్ద తప్పిదం. నేరం కిందకు వస్తుంది. కాబట్టి గర్భాన్నిచ్చేవారు ఒప్పుకోరని మొదలు పెడతారు. ఇక్కడి నుంచి అసలు మోసం మొదలవుతుంది. వీరిని ఒప్పించానికే పది పదిహేను లక్షల ఖర్చవుతుందని అంటారు. నిజానికైతే అంత సీనుండదు. ఇందుకోసం మరో ప్లాన్ వేస్తారు. ప్రస్తుతం సృష్టి కేసు వ్యవహారమే తీసుకుంటే.. రాజస్థాన్ దంపతుల నుంచి వీరు వసూలు చేసిన మొత్తం అక్షరాలా 34 లక్షల రూపాయలు. అయితే గర్భాన్నిచ్చిన సరోగసీ మదర్ కి ఇచ్చింది 90 వేలు. అంటే సుమారు 33 లక్షల మేర నొక్కేసినట్టు తెలుస్తోంది. ఏడాదికి ఒక పది మంది ఇలాంటి వారొస్తే చాలు.. కోటాను కోట్ల రూపాయల కనకవర్షం కురిసినట్టే.

గ్రామ స్థాయిలో ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణ

డబ్బు చేతిలో బాగా ఆడుతుండటంతో.. గ్రామ స్థాయిలో ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా డాటా సేకరణ. ఆపై వారిలో కొందరిని గుర్తించి.. సరోగసీకి ఒప్పుకునేలా చేస్తుంటారు. అలా ఒక కారిడార్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఇక వీర్య సేకరణలో అసలు వీరి స్టైలే వేరు. ఆరోగ్యకరమైన విధానాల ద్వారా.. ఈ వీర్య సేకరణ విధానమే ఉండదు. వీర్య సేకరణకంటూ కొన్ని నియమాలుంటాయి. టెస్టులుంటాయి. అలాక్కాకుండా నేరుగా బోర్డులు పెట్టి మరీ ఎవరి నుంచి అంటే వారి నుంచి వీర్య సేకరణ చేస్తుంటారు. దీంతో ఇదొక అనారోగ్య కరమైన వాతావరణానికి ఆస్కారమేర్పడుతుంది.

అబార్షన్ కోసం వచ్చిన అసోం జంట ట్రాప్

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీసెంటర్ ప్రస్తుత కేసులో ఎలాంటి మోసానికి పాల్పడ్డారో చూస్తే.. అబార్షన్ కోసం వచ్చిన అసోంకు చెందిన జంటను ట్రాప్ చేసి వారి బిడ్డను రాజస్థాన్ జంటకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. 2016 లోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన మెడికల్ కౌన్సిల్- సృష్టి సరోగసి ఆసుపత్రి లైసెన్సును ఐదేళ్లపాటు రద్దు చేసింది. డాక్టర్ నమ్రత దీన్ని పునరుద్ధరించాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆశ్రయించారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. సాధ్యం కాదని తెగేసి చెప్పింది కౌన్సిల్. సరోగసీ మహిళకు సిజేరియన్ చేయాలని.. భర్త మరో రెండున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని.. రాజస్థాన్ జంట నుండి మరో రెండున్నర లక్షలు అదనంగా తీసుకున్నారు. ఇలా 34 లక్షల రూపాయల వరకూ వసూలు చేసినట్టు గుర్తించారు అధికారులు.

20 వేల ప్రొఫైల్స్ గుర్తించిన పోలీసులు

2020లో విశాఖపట్నంలోనూ ఇదే తరహాలో నమ్రత అరెస్ట్‌ అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకునే నమ్రత అబార్షన్ కోసం వచ్చే జంటలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే సికింద్రాబాద్, కొండాపూర్, కూకట్‌పల్లిలో ఉన్న సృష్టి సెంటర్లలో సోదాలు చేసిన పోలీసులు దాదాపు 20 వేల మందికి సంబంధించిన ప్రొఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా ఎంత చాటు మాటుగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారో. ఇదొక మాఫియా కింద తయారు చేసి.. కావల్సినంత వెనకేయడం.. కేసులైనా సరే ఎలాగోలా బయట పడి తిరిగి తమ దందా కొనసాగించడం. ఇలా నమ్రతపై ఇప్పటికే పలు కేసులున్నట్టు సమాచారం. పిల్లలు కావాలన్న ఆలోచన సమంజసమే. కాదనడం లేదు. అదృష్టమో దురదృష్టమో ఒక్కోసారి పిల్లలు పుట్టరు. దీంతో ఇలాంటి కేంద్రాల ద్వారా తమ చిరకాల కోరిక తీర్చుకోవాలన్న ఆలోచన చేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడే అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆనందం కావల్సిందే.. కానీ ఎంత మూల్యానికి? అన్నదిప్పుడు అతి పెద్ద చర్చగా మారింది.

Also Read: చైనా లేకుంటే.. ఇండియా పరిస్థితి అంతేనా?

బేసిగ్గా ఈ కేసు కూడా బయట పడి ఉండేది కాదు. ఆ బేబీకి క్యాన్సర్ అన్న ఫాక్టర్ లేక పోయి ఉంటే వారు తమ బేబీనా కాదా అని చూసేవారు కాదు. అసలీ గొడవే ఉండేది కాదు. అంత టాక్టీస్ నమ్రత అండ్ కో మెయిన్ టైన్ చేసేదని అంటారు. ఇప్పటి వరకూ తమపై ఎన్ని కేసులున్నా.. వారికి తెలీకుండా వీరిని వీరికి తెలీకుండా వారిని.. ఏమార్చి ఏమార్చి ఎంతో టెక్నిక్స్ వాడ్డంలో నమ్రత టీం ఆరితేరినట్టుగా చెబుతారు పోలీసులు. తాజాగా విజయవాడలో ఒక బాధితురాలు బిగ్ టీవీతో తన గోడు వెళ్లబోసుకుంది. తన చిన్నకుమారుడు చని పోయిన తర్వాత.. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నట్లు తాను భావించాననీ.. ఇదే తనకు చేటు తెచ్చినట్టు చెప్పారామె. తాము భారీ ఎత్తున ఖర్చు చేసిన తర్వాత… బిడ్డను పుట్టించలేక చేతులెత్తాశారని కన్నీళ్లు పెట్టుకుంటోందీమె.

ఒకటికి రెండు సార్లు ఆరా తీసి ముందుకెళ్ళాలి

ఇలాంటి ఎన్నో ట్రిక్కులు వాడుతోన్న నమ్రత తన అక్రమ సృష్టిని కొనసాగిస్తూనే పోతున్నారు. ఇన్ని కేసులు నమోదవుతున్నా.. ఆమె మాత్రం తన కు ఈ రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉంది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగానే చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఒక్క కంప్లయింట్ లేదని చెబుతూనే.. నేరం జరిగింది ఏపీలో అయితే తెలంగాణలో ఎలా అరెస్ట్ చేస్తారంటూ లాజిక్ లాగుతున్నారు. దీనంతటికీ కారణం అధికారుల్లోని సమన్వయ లోపం. దీన్ని ఆసరాగా చేసుకుని నమ్రత ఇన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. మీరు కావాలంటే చూడండి.. విజయవాడలో ఆస్పత్రికి అన్ని అనుమతులున్నాయని ఇక్కడి సిబ్బంది చెబుతుంటే.. అసలు అలాంటి దొకటి ఉన్నట్టుగానే తమకు తెలీదని అంటారు అధికారులు. ఇదెక్కడి విడ్డూరమో అర్ధం కావడం లేదంటారు బాధితులు. చూశారుగా పరిస్థితి ఎలా ఉందో. ఈ లూప్స్ అండ్ గ్యాప్స్ అడ్డు పెట్టుకుని నమ్రత తన అక్రమ సృష్టి నాన్ స్టాప్ గా కొనసాగిస్తూ పోతున్నట్టు గుర్తించారు పోలీసులు.ఒక వేళ పిల్లలు కావాలనుకున్న వారు గుర్తించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే.. ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్ల గురించి ఒకటికి రెండు సార్లు ఆరా తీసి మరీ ముందుకెళ్లడం. ఆపై కమర్షియల్ సరోగసీ నేరం కాబట్టి ఈ దిశగా ముందుకెళ్లకుండా ఆగిపోవడం. పిల్లలు పుట్టలేదంటే వెంటనే వారు చెప్పే అక్రమ మార్గంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అలా జరగలేదంటే.. తర్వాత పెద్ద ఎత్తున సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ప్రస్తుత రాజస్థాన్ దంపతుల విషయమే తీసుకుంటే.. వీరికిపుడు డబ్బుకు డబ్బు ఖర్చు- ఆపై బిడ్డ చేతికొచ్చిందా అంటే అదీ లేదు. దీంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిన దుస్థితి.

పిల్లల్ని చోరీ చేసే ముఠా నయం 2,3 లక్షలకు అమ్ముతారు

ఇంత ఖర్చు పెట్టడానికి బదులు ఏ అనాథ పిల్లల్నో దత్తత తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. బేసిగ్గా ఇలాంటి వారికోసం పిల్లలను చోరీ చేసే ముఠా మరొకటి ఉంటుంది. వీరు రెండు మూడు లక్షల వరకూ మాత్రమే వసూలు చేస్తారు. అదే పెద్ద పెద్ద చదువులు చదువుకునన నమ్రత లాంటి వారి పరిస్థితి చూస్తే.. ఏకంగా 30 నలభై లక్షల మేర వసూలు చేసి నిలువుదోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్. ఈ రాజస్థాన్ జంట ద్వారా మిగిలిన పిల్లలు లేని జంటలు ఆచీ తుచి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు నిపుణులు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరికలు అందుతున్నాయ్.

పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు గుర్తింపు

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు ఏంటని చూస్తే సృష్టిలో అసలు సరోగసీ వ్యవస్థ లేదని చెబుతున్నారు పోలీసులు. అయితే ఈ పేరు మీద పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు డాక్టర్ నమ్రత.అస్సాం, మేఘాలయాకు చెందిన ఆదివాసీ పిల్లల్ని తీస్కొచ్చి.. పిల్లలు లేని జంటల నుంచి పెద్ద మొత్తం వసూలు చేసినట్టుగా గు్తించారు. హైదరాబాద్ లో సెటిలైన ఆదివాసీ పిల్లల్ని గత కొంత కాలంగా ఆమె కొంటున్నట్టు కనుగొన్నారు. ఒక్కో జంట నుంచి 30 నుంచి యాభై లక్షల రూపాయల మేర వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఆదివాసుల దంపతులకు లక్ష లోపు డబ్బులు ఇచ్చి వారి నుంచి పిల్లల్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పురిట్లో ఉన్న బిడ్డలను తీస్కొచ్చి సరోగసీ పేరిట అప్పగిస్తున్నట్టు తమ ఎంక్వయిరీలో తేల్చారు అధికారులు. ఒక్క హైదరాబాద్ సెంటర్లోనే 30 సరోగసీ కేసులు ఆమె అధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తోంది. వీరందరినీ పోలీసులు కలిసే యత్నం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే వీరికిచ్చిన పిల్లలు ఎవరు? వారు ఎక్కడి వారు? ఈ విషయంలో ఎంత మేర అక్రమాలు జరిగాయో గుర్తించే యత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లలో సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.

Story By Adinarayana, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×