ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్
క్షణ క్షణం.. టెన్షన్ టెన్షన్. అవును.. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. బాంబులు, మిస్సైళ్ల దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లోని ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇరాన్ అణు, మిలటరీ స్థావరాలు లక్ష్యంగా..
ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఇరాన్ లోని అణు, మిలటరీ స్థావరాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తోంది. ప్రధానంగా ఈసారి ఇస్ఫహాన్ అణుస్థావరాన్ని నేలమట్టం చేసే దిశగా ఇజ్రాయెల్ ఆర్మీ నిప్పులు కురిపించింది. ఇరాన్ రాజధాని టెహరాన్ తోపాటు మొత్తం 200 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ అటాక్స్‌లో అణు కార్యక్రమాలు జరుగుతున్న ఇస్ఫహాన్ ప్రాంతం చాలా వరకు దెబ్బతింది.
ఇరాన్ నాయకత్వంపై తిరుగుబాటుకు..
ఇజ్రాయెల్ దాడులకు గట్టిగానే బదులిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సహా ఇతర ముఖ్య పట్టణాలు టార్గెట్‌గా డ్రోన్లు, మిస్సైళ్లతో రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రజలు పెద్ద ఎత్తున గాయపడ్డారు. అయితే.. ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్‌కు చెందిన క్షిపణులు, డ్రోన్లను తాము పెద్ద ఎత్తున కూల్చేశామని చెబుతోంది.
పిలుపునిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అందుకు ఇదే సరైన సమయం అని సూచించారాయన. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తే.. ఇజ్రాయెల్ అంతా మీకు అండగా నిలుస్తుందని హామీనిచ్చారు ప్రధాని నెతన్యాహు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ దాడి ఎందుకంత ప్రమాదకరం?
తమ అణు ప్రయోగం కేవలం పౌర ప్రయోజనాల కోసమని అంటుంది ఇరాన్. అయితే ఈమాట ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. అణు నిఘా సంస్థ కూడా నమ్మడం లేదు. మరి ఇరాన్ అసలు ఉద్దేశమేంటి? ఈ అంశంపై ఇతర దేశాల స్పందన ఎలాంటిది? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ దాడి ఎందుకంత ప్రమాదకరం?
రష్యా- ఉక్రెయిన్ 3 ఏళ్లకు పైగా యుద్ధం
ఇరాన్ ఆరుగురు అణు సైంటిస్టులతో పాటు పిల్లలు, పౌరులూ మృతిప్రస్తుతం ప్రపంచ వాతావరణం ఏమంత సరిగా లేదు. ఇటు చూస్తే రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ మధ్య ఈ రెండు దేశాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకున్న పరిస్థితులు. సరిగ్గా శాంతి చర్చలకు ముందు ఉక్రెయిన్ రష్యన్ వైమానిక దళాలపై దాడి చేయడం తెలిసిందే. దీనికి రష్యా ప్రతీకార దాడులు చేసిందీ విధితమే.
మేలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు
మేలో భారత్- పాక్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతల సంగతి సరే సరే. సరిగ్గా ఈ యుద్ధంలోనూ ఇదే అణు వ్యవహారం. భారత్ పాక్ అణు నిల్వలను దాచి ఉంచే కిరానా కొండలపై చేసిన దాడికి అమెరికా గుండెల్లో అణుబాంబులు మోగాయి. ప్రస్తుతం చైనా నుంచి తీసుకొచ్చిన బోరాన్ నిల్వలతో ఇక్కడి అణు ధార్మికతను పాక్ కంట్రోల్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. అంతే కాదు భారత్ దాడి చేసిన వైమానిక స్థావరాలను పాక్ మూసివేసినట్టుగానూ వార్తలొస్తున్నాయి. భారత్ దెబ్బ తట్టుకోలేక.. టార్పలిన్‌లతో పాక్ మేకప్ చేసినట్టు తెలిసేలా కొన్ని ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి.
సిరియా యెమన్లపై అమెరికా తరచూ దాడులు
ఇక సిరియా, యెమన్లపై అమెరికా తరచూ చేసే దాడులది మరో యుద్ధ గాథ. ఇక హమాస్ తో ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచమంతా తెలుసు. అమెరికా, బ్రిటన్, తదితర దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించిన హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొంత కాలంగా దాడుల పరంపర కొనసాగుతోంది. హమాస్ కి ఇజ్రాయెల్ కి గొడవేంటని చూస్తే.. హమాస్ 1987లో ముస్లిం బ్రదర్‌హుడ్‌లో ఒక శాఖగా ప్రారంభమైంది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్- ఇదీ ఈ సంస్థ ప్రధానోద్దేశం. పాలస్తీనా భూమి పై ఇజ్రాయెల్ ఉనికినిది వ్యతిరేకిస్తుంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా అంతటా ఇస్లాం రాజ్యం ఉండాలని కోరుతుంది హమాస్. 2007 నుంచి గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలన నడుస్తోంది. 2025 జనవరిలో వీరి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఇజ్రాయెల్- పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి ఒక ఒప్పందం జరిగింది కూడా.
1980ల నాటి నుంచి ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య గొడవలు
ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవకీ ఈ హమాస్ కి ఒక లింకుంది. 1980ల కాలం నుంచీ.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పరోక్ష వివాదం కొనసాగుతోంది. 1979 వరకూ ఇరాన్ ఇజ్రాయెల్ కి మంచి సంబంధాలే ఉండేవి. ఈ సమయంలో ఇస్లామిక్ విప్లవం మొదలయ్యాక.. ఇరాన్ ఇజ్రాయెలీ సంబంధాలు దెబ్బ తిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేసినపుడు- లెబనాన్ కి చెందిన హిజ్బుల్లాకు.. ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో.. షియా మిలీషియాకి మద్ధతునిచ్చేది ఇరాన్. ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్థీనాకు మద్ధతు ఇచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ తో సంబంధాలు ఏర్పరుచుకుంది ఇరాన్. 2006లో ఇరానీ మద్ధతుగల హిజ్బుల్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. గాజా స్ట్రీప్ దాని చుట్టుపక్కల గల పాలస్థానీలయులతో ఇజ్రాయెల్ అనక దాడులు చేసింది.
అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ- ఇజ్రాయెల్ సపోర్ట్
ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే, ఇజ్రాయెల్.. అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ సైన్యాల నుంచి మద్ధతు పొందేది. ఇజ్రాయెల్- సిరియాలో.. ఇరానియన్ మిత్ర దేశాలపై కూడా వైమానిక దాడులు చేసింది. అంతేనా ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను హత్య చేసినట్టుగానూ ఆరోపణలున్నాయి. 2018లో ఇజ్రాయెల్ దళాలు సిరియాలో ఇరాన్ దళాలపై నేరుగానే యుద్ధం చేసిన పరిస్థితులున్నాయి.
పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెలీ బాధితులుగా ఇరాన్ భావన
ప్రస్తుత పరిస్థితికి వస్తే.. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఉన్న గొడవ పాలస్తీనాయే ప్రధాన కారణం. ఇరానియన్ ఇస్లామిస్టులు బేసిగ్గా ఏమనుకుంటారంటే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెలీ బాధితులుగా భావిస్తారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా బేధాభిప్రాయాలు. ఒక సమయంలో ఇజ్రాయెల్- ఇరాన్ తమ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తుంది. ఇరాన్ తమ జాతికే ప్రమాదకరమైన ధోరణి కనబరుస్తున్నట్టుగ ఈ దేశం అంచనా వేస్తుంది. దీంతో ఇరాన్ అణ్వాయుధాల సేకరణ చేయకుండా తీవ్రంగా కట్టడి చేస్తుంది. అందులో భాగంగానే ఈ దాడులు చేసినట్టు చెబుతున్నారు నెతన్యాహూ.
అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాలకే- ఇరాన్
అయితే తమ అణు కార్యక్రమం కేవలం పౌర ప్రయోజనాల కోసం అంటుంది ఇరాన్. అయితే ఈ విషయం యూఎస్ తదితర దేశాలతో పాటు అణు నిఘా సంస్థ, IAEA సైతం నమ్మడం లేదు. వారం క్రితం న్యూక్లియర్ వాచ్ డాగ్- బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇరవై ఏళ్లలో మొదటి సారిగా ఇరాన్ దాని అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక బాధ్యతలు ఉల్లంఘించినట్టు ప్రకటించిది. ఇరాన్ తన యురేనియం నిల్వలపై సరైన వివరాలను అందించ లేక పోయిందని వివరించింది. ఈ పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్- ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు తెగబడింది.
ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడుకుంటాం- ఇరాన్
అయితే ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది ఇరాన్. శుక్రవారం ఉదయం ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 డ్రోన్లను ప్రయోగించినట్టు చెబుతున్నాయి ఇజ్రాయెల్ రక్షణ దళాలు. వాటన్నిటినీ తాము అడ్డగించినట్టుగా చెబుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అయితే ఇజ్రాయెల్ దూకుడు వెనక అమెరికా సైతం బాద్యత వహించాల్సి ఉందని అంటోంది ఇరాన్ విదేశాంగ శాఖ. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఈ దాడులకు తమకూ సంబంధం లేదని ప్రకటించారు. తాము ఇజ్రాయెల్ కి ఎలాంటి సాయం అందించలేదని అన్నారాయన. అయితే ఈ ప్రాంతంలో తమ సేనలను కాపాడుకోవడం తమ బాధ్యతగా భావిస్తామంటోంది అమెరికా.
ఇరాన్ ఆరుగురు అణు సైంటిస్టులతో పాటు పిల్లలు, పౌరులూ మృతి
ఇక్కడ అమెరికా ప్రమేయం ఉన్నా లేకున్నా తమ జాగ్రత్తలు తమవని అంటోంది ఇజ్రాయెల్. తమపై ఇరాన్ ఎప్పటి నుంచే ఒక కన్నేసి ఉండటం చేత తమ రక్షణలో తాము ఉన్నామని ప్రకటిస్తోంది ఇజ్రాయెల్. ఇదిలా ఉంటే ఈ దాడులు ఆందోళన కలిగించేవిగా భావిస్తోంది యూకే. ఈ దిశగా ఇంగ్లండ్ ప్రధాని కీర్ స్మార్టర్ అన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాట్డుతూ ఈ దాడులు అస్తిరతకు కారణమయ్యే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇండోనేసియా, సౌదీ సైతం దాడులను ఖండించాయి. తాము సైతం దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్టు ప్రకటించింది చైనా. ఐ్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీయకుండా సంయమనం పాటించాలని ఇరు పక్షాలను కోరారు.