Samsung Galaxy S25 Edge Discount| సామ్‌సంగ్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.1,09,999గా ఉంది. అయితే, వివిధ ఆఫర్‌లతో దీన్ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ.8,000 తక్షణ డిస్కౌంట్, రూ.3,299 క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్ అత్యంత ఆకర్షణీయం. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.55,000 వరకు ఆదా చేయవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తం పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
కెమెరా ప్రియులకు ఈ ఫోన్ అద్భుతమైన ఎంపిక. గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 200MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సామ్‌సంగ్ అల్ట్రా వేరియంట్‌తో సమానమైన పనితీరును అందిస్తుంది. 12MP ఫ్రంట్ కెమెరా అధిక నాణ్యత గల సెల్ఫీలు, వీడియో కాల్‌లను అందిస్తుంది. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇష్టపడేవారికి ఈ ఫోన్ సరైన ఎంపిక.
ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది తన సెగ్మెంట్‌లో అత్యంత సన్నని ఫోన్ అని సామ్‌సంగ్ చెబుతోంది. గ్లాస్ బ్యాక్ ప్యానెల్, టైటానియం ఫ్రేమ్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. IP68 రేటింగ్‌తో.. ఈ ఫోన్ లో దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల ఏ వాతావరణంలోనైనా సులభంగా ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2తో ప్రొటెక్షన్ ఉంది. ఇది అదనపు దృఢత్వాన్ని అందిస్తుంది.
పనితీరు విషయంలో, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో శక్తివంతంగా ఉంది. 12GB RAM మరియు 512GB స్టోరేజ్‌తో, ఈ ఫోన్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ లేదా హెవీ అప్లికేషన్‌లను ఉపయోగించినా, ఈ ఫోన్ ఎలాంటి లాగ్ లేకుండా పనిచేస్తుంది.
Also Read: ఈ యాప్‌లను వెంటనే ఫోన్ నుంచి తొలగించండి.. గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక
ఈ ఫోన్‌లో 3900mAh బ్యాటరీ ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించేందుకు సరిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ విషయంలో రాజీపడకుండా అధిక పనితీరు కోరుకునే వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక.
అద్భుతమైన కెమెరా నాణ్యత, ఫ్లాగ్‌షిప్ పనితీరు, స్టైలిష్ డిజైన్ కలిగిన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి గెలాక్సీ S25 ఎడ్జ్ ఒక స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్. రూ.65,000 వరకు ఆదా చేసే ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ ఆఫర్‌తో, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు.