BigTV English

IND Vs PAK: POKలో హమాస్ ఉగ్రవాదులు.? కాశ్మీర్‌కు తిరిగి కొత్త కళ ఎప్పుడంటే.?

IND Vs PAK: POKలో హమాస్ ఉగ్రవాదులు.? కాశ్మీర్‌కు తిరిగి కొత్త కళ ఎప్పుడంటే.?

IND Vs PAK: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం నశించాలంటే POKని స్వాధీనం చేసుకోవడం ఒక్కటే మార్గమా? ముజఫరా బాద్‌లో అసలేం జరుగుతోంది? ఇంతకీ ఈ పీవోకేని POJK అని ఎందుకనాలి.. ఈ విషయంలో పాక్‌ కుట్రలేంటి.. అసలేంటీ POK.. తెలియాలంటే మీరీ స్టోరీ చూడాల్సిందే.


జమ్మూ సంస్కృతికి దగ్గరగా ఉండే POJK ప్రాంతం..

సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రభావమూ పడే అవకాశంPOKని POJK అని ఎందుకు పిలుస్తారని చూస్తే.. ఈ ప్రాంత జనాభా సుమారు 46 లక్షలుండగా.. వీరిలో అత్యధికులు ముస్లిములే. అయితే వీరు కశ్మీరీలకంటే సాంస్కృతికంగా ఎంతో భిన్నంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జమ్మూ సంస్కృతికి అత్యంత దగ్గరగా ఉంటారు. ఇందువల్లే పీవోకేని, POJK అని పిలవాల్సి ఉంటుందని అంటారు. కారణం ఈ ప్రాంతం జమ్మూకి దగ్గరగా పడమట దిక్కులో ఉంటుంది.


స్వయం పాలితమే అయినా పాక్ ఆధీనంలో ఉండే POJK

ఇక POJK కశ్మీర్ సమస్యను రూపుమాపడానికి ఎందుకంత కీలకం అని చూస్తే.. ఇదొక స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. అందుకే దీన్ని పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ గా పిలుస్తారు. ఇక ఈ ప్రాంతం.. 1947 నుంచి భారత్- పాక్ మధ్య వివాదాస్పదంగా ఉంటోంది.

POJK నుంచి సాగే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే ఈ ప్రాంతం నుంచే పాక్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీఓకేలో పర్యటించారని చెబుతాయి మీడియా వార్తలు. భారత్ వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడి నుంచే కుట్ర చేస్తుంటారని అంటాయి నివేదికలు.. పహెల్గాం దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అటుంచితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి అత్యంత కీలకం.. ఈ ప్రాంతమే.

ఉగ్రవాదం అంతం కావాలంటే..

కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. గతంలో ఇదే పీవోకేలోని టెర్రర్ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే. అయినా సరే, వీరు ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ ప్రాంతమే గనక భారత్ స్వాధీనమైతే.. ఇక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి దాదాపు చెక్ పెట్టవచ్చన్నది ఒక అంచనా. అందుకే అందరూ.. పీఓజేకే స్వాధీనం చేసుకోవాలని నినదిస్తుంటారు.

POK కాదు.. POJK గా పిలవాలంటూ కేంద్రం పిలుపు

కేవలం మీడియా, సోషల్ మీడియా మాత్రమే కాదు.. ఐక్యరాజ్య సమితి నుంచి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ల వరకూ దీన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటారు కానీ, దీన్ని పాక్ ఆక్రమిత జమ్మూ- కశ్మీర్ అనాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సుమారు 13 వేల 297 చదరపు కిలోమీటర్లు గల ఈ ప్రాంత స్వాధీనం సమస్త ఉగ్ర సమస్యలకు పరిష్కార మార్గంగా భావిస్తుంటారు.

1994, ఫిబ్రవరి 22న.. నాటి ప్రభుత్వం తీర్మానం

నాటి పీవీ నరసింహరావు ప్రభుత్వం 1994, ఫిబ్రవరి 22న ఒక తీర్మానం ఆమోదించింది. దీని ప్రకారం చూస్తే జమ్మూ- కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి వేరు చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే.. తీవ్రంగా పరతిఘటిస్తాం. సరిగ్గా అదే సమయంలో.. భారత దేశ ఐక్యత, సార్వభౌమాధికారం, సమగ్రతలకు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలకు పాల్పడితే.. దృఢంగా ఎదుర్కుంటాం. భారత్ లో భాగమైన జమ్మూ- కశ్మీర్ లో పాక్ ఆక్రమించిన ప్రాంతాలను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలి. ఈ ప్రాంతాలను పాక్ దురాక్రమణ చేసింది. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరు జోక్యం చేసుకోడానికి ప్రయత్నించినా.. వార్ని ధీటుగా తిప్పి కొడతామంటూ.. భారత ప్రభుత్వం ఈ తీర్మానం ద్వారా తేల్చి చెప్పింది.

ఈ తీర్మానం ఆమోదించి పాతికేళ్లు

1994లో పార్లమెంట్ ఈ తీర్మానం ఆమోదించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా POJKని తిరిగి స్వాధీనం చేసుకోవల్సిందే… ఇప్పుడు కాక మరెప్పుడంటూ.. పలువురు నేతలు అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన జమ్మూ కాశ్మీర్, ఉదంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్.. POJK ఎప్పుడు భారతదేశంలో భాగమవుతుందో చెప్పలేం కానీ.. మోడీ ఉండగా అది ఎప్పటికైనా సాధ్యమేనన్నారాయన. అదే ఇప్పుడు సాధ్యం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోందంటారు నిపుణులు.

POJKలో గత కొంత కాలంగా ఉద్యమం

ఇప్పుడు పహెల్గామ్ దాడులు జరిగాయని పీవోజేకే ఇందుకు కేంద్రంగా మారిందని కాదు కానీ. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో.. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూనే ఉంది. భారత్ లో తాము భాగం కాక పోవడం వల్ల.. వారు ఏమి కోల్పోయారో.. గ్రహించినట్టు బయట ప్రపంచానికి ఎంతో స్పష్టంగా వినిపిస్తోంది. భారత్ లో భాగమైనందుకు జమ్మూ కాశ్మీర్ లో ఎయిమ్స్ ప్రారంభమవుతోంది. అంతే కాదు, పెద్ద పెద్ద హోటళ్లు తెరుచుకుంటున్నాయ్. మిలియన్ల కొద్దీ పర్యాటకులు పోటెత్తడం వల్ల జమ్మూ కాశ్మీర్ తిరిగి కొత్త కళ సంతరించుకుంటోంది. దీంతో పీవోజేకే ప్రాంత వాసులకు భారత్ లో అంతర్భాగం కావడమే ఉత్తమంగా అనిపిస్తోంది. నేడు కాశ్మీరీలు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకించడం కూడా POJK ప్రాంత వాసులను ఆలోచింప చేస్తోంది.

పాక్ ఆక్రమిత.. జమ్మూ-కాశ్మీర్‌లో 35 శాతం నిరుద్యోగులు

దానికి తోడు POJKలోని యువత ఉద్యోగాల కోసం వలస వెళ్లాల్సి వస్తోంది. సుమారు 35 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో కొందరు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. కాబట్టి పాక్ ఆక్రమిత ప్రాంతంగా ఉండటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది వీరి ఆలోచనగా తెలుస్తోంది.

సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రభావమూ పడే అవకాశం

ఈ ప్రాంత వాసుల్లో అధిక శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. సింధూ జలాల ఒప్పందం రద్దయితే.. పాకిస్థాన్ మొత్తం ఎడారి అయిపోతుంది. ఆహార సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఆ దేశ సమస్య కూడా POJK పై ప్రభావం చూపుతుంది. దీంతో ఈ దిశగా కూడా పీవోజేకే భారత్ లో కలవడమే ఉత్తమంగా వీరు ఒక అంచనాకు వస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి వేదికగా ఉంటూ.. ఆ దేశ సమస్యలన్నిటినీ తమవిగా చేసుకుంటూ.. ఎంతకాలం? ఈ దిశగా ఇప్పటికే ఇక్కడి వారిలో ఒక మార్పు వచ్చినట్టు చెబుతారు. అందుకే వీరిని ఈ చెర నుంచి విముక్తి చేయాలంటే భారత్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ఉత్తమంగా చెబుతున్నారు.

స్వాధీనానికి దారేది?

ఉగ్రవాదానికి వేదికగా నిలుస్తోన్న పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోడానికి గల దగ్గర దారులేంటి? భారత్ వ్యూహాలేంటి? POJK స్వాధీనం చేసుకునే మార్గమేది? ఒక్క ప్రాంతం చేజిక్కించుకుంటే అది ప్రపంచ శాంతికి ఏ విధంగా దారి తీస్తుంది? ఈ విషయంలో భారత్ వ్యూహాలేంటి? అంతర్జాతీయంగా లభించనున్న మద్ధతు ఎలాంటిది?

POJK లో పార్లమెంటరీ ప్రభుత్వం

POJK మన పరమైతే… అది మరో ప్రపంచ శాంతికి మార్గంPOJK ప్రాంత రాజధాని ముజఫరా బాద్. ఇక్కడ సహజంగా పార్లమెంటరీ ప్రభుత్వం నడుస్తుంది. అధ్యక్షుడు రాజ్యాంగ బద్ధమైన దేశాధినేత కాగా.. ప్రధాని ఇతర మంత్రులు కార్యనిర్వాహకులుగా వ్యవహరిస్తారు. ఈ భూభాగానికి ప్రధాని, రాష్ట్రపతితో పాటు.. సుప్రీంకోర్టు, హైకోర్టులు సైతం ఉన్నాయి. అయితే పాక్ ప్రభుత్వానికీ POJKకి వారధిగా ఉంటోంది కశ్మీర్ గిల్గిత్- బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. అలాగని POJKకి పాకిస్థాన్ పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఈ లింకును తెగ్గొడితే.. మొత్తం వ్యవహారం కంట్రోల్ లోకి వస్తుంది. అదే ఎలాగన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆయువు పట్టు POJK

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆయువు పట్టు పీవోజేకే. ఈ ప్రాంతంపై పట్టు సాధించడానికి.. ఇటు జాతీయ స్థాయిలో మాత్రమే కాక, అటు అంతర్జాతీయ స్థాయిలోనూ వ్యూహరచన చేస్తోంది భారత్. రష్యా- ఉక్రేయన్ గొడవలో కూడా సరిగ్గా ఇలాంటి వ్యవహారమే ఒకటుంది. క్రిమియాను తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఉక్రేయన్ పై ఒత్తిడి తెస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సరిగ్గా ఇలాంటి ప్రతిపాదన చేయాల్సి ఉంది భారత్. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకురావల్సి ఉంది.

మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. ఇటు అమెరికా సైతం మద్ధతిచ్చే ఛాన్స్

ఇక రెండో ప్రయత్నమేంటని చూస్తే.. గతంలో చేసినట్టు పీవోజేకే పై మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. ఇటు అమెరికా సైతం మద్ధతుగా నిలిచే అవకాశముంది. ఇలాక్కూడా పీవోజేకేని స్వాధీనం చేసుకునే ఛాన్సుంది.

ఆక్సాయ్ చిన్ తో పాటు POJK సైతం భారత్‌లో భాగమే- అమిత్ షా

చైనా ఆధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ సైతం భారత్ లో భాగమేనంటారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్లో ఈ దిశగా ప్రకటించారు.. కూడా.

POJKపై పట్టుకోల్పోడానికి ఇష్టపడని పాక్

అయితే పీవోజేకేను పాకిస్థాన్ అంత తేలిగ్గా వదులుకోదు. దాన్ని నామరూపాల్లేకుండా చేసినా సహిస్తుంది కానీ.. ఈ భూభాగంపై తమ పట్టుకోల్పోడానికి ఎంతకీ సహించదీ పాపిష్టి దేశం. కారణం భారత్ పక్కలో బల్లెంగా తమ ఉగ్రమూకలను ఉసిగొల్పాలంటే.. పీఓజేకే అత్యంత కీలకం. దీంతో ఈ ప్రాంతాన్ని ఒదులుకోడానికి ససేమిరా అంటుంది. అలా జరగాలంటే మన సేనలు ఈ ఆక్రమిత ప్రాంతంలోకి చొచ్చుకుని పోయి.. అక్కడ తిష్టవేయక తప్పదు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోక తప్పదు.

ప్రస్తుతం ప్రపంచం ముందు దోషిగా నిలుచున్న పాక్..

ఇన్నాళ్ల పాటు ఇందుకోసమే ఎదురు చూస్తూ వచ్చిన భారత్ కు ఇంతకన్నా మించిన అవకాశం లేదని భావిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు. కేవలం పీవోజేకే ఆక్రమణ కోసమే మనం దాడి చేస్తే.. ఆ అపవాదు మన మీద పడుతుంది. ప్రస్తుతం పహెల్గామ్ దాడి తో పాకిస్థాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడి ఉంది. పలు ప్రపంచ దేశాలు భారత్ కే మద్ధతుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూఎస్ అయితే భారత్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం తుదముట్టించడానికి ఏం చేసినా తమ సహాయ సహకారాలుంటాయని స్పష్టం చేస్తోంది.

ఖవాజా అసీఫ్, పాక్ రక్షణ మంత్రి ప్రకటన

దానికి తోడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసీఫ్ సైతం తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవమేనంటూ సెల్ఫ్ గోల్ వేసుకోవడం కూడా భారత్ కు కలసి వచ్చే అంశమే. సోవియట్ యూనియన్ వ్యతిరేక యుద్ధంలో చేరక పోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పిన పాక్ రక్షణ మంత్రి.. మరో ముఖ్యమైన విషయం కూడా అన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్ తో కొన్ని సంబంధాలున్న మాట నిజమేనని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ లష్కరే తోయిబా అనుబంధసంస్థ రెసిస్టెంట్ ఫ్రంట్ కి చెందిన షాడో గ్రూపే.. పహెల్గామ్ ఉగ్రదాడులకు బాధ్యత వహిస్తోంది. కాబట్టి.. ఇటు నుంచి నరుక్కు రావడం మంచిదిగా తెలుస్తోంది.

పాక్ మిలటరీ, ISI, ఉగ్రవాదం.. ఇదొక టెర్రర్ కారిడర్

పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఉగ్రవాదంతో విసిగి వేసారిపోయింది. పాక్ మిలిటరీ, ISI, ఉగ్రవాదం.. ఇదొక టెర్రర్ కారిడార్. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం సైతం ఏమీ చేయలేని దుస్థితి. ఈ మొత్తం ఉగ్ర వ్యవహారాలు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసీఫ్.. అధ్వర్యంలో సాగుతున్నట్టు అంచనా వేస్తోంది అంతర్జాతీయ సమాజం. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీ లాడెన్ కి పెద్ద తేడా లేదన్న భావనలో ఉంది అమెరికా.

పాకిస్థాన్‌కి మిగిలిన ఒకే ఒక్క మద్ధతు చైనా మాత్రమే

పీవోజేకే విషయంలో పాకిస్థాన్ ని అంతర్జాతీయంగా ఏకాకిని చేయాల్సి ఉంది. ఈ కోణంలోంచి చూస్తే.. పాకిస్థాన్ కి మిగిలిన ఒకే ఒక్క మద్ధతు చైనా మాత్రమే. చైనా ప్రస్తుతం యూఎస్ నుంచి ఎదుర్కుంటున్న సుంకాల దృష్ట్యా చూస్తే భారత్ మార్కెట్ అత్యంత కీలకం. ఇటు యూఎస్ మార్కెట్ ని కోల్పోయి, అటు భారత్ మార్కెట్ సైతం కోల్పోతే చైనాకు మిగిలేది గుండు సున్నాయే.

Also Read: బీఆర్ఎస్‌లోకి దానం? కారు ఎక్కడానికి స్కెచ్చా?

తమ ప్రభుత్వ మద్ధతూ కోల్పోయి ఒంటరిగా మిగిలిన పాక్ ఆర్మీ

వచ్చే రోజుల్లో భారత్ సింధూ నదీ జలాలు నిలిపేస్తే ఆ దేశంలో కరవు విలయతాండవం చేస్తుంది. ఇలాంటి బలహీన మార్కెట్లను నమ్మి చైనా సాధించేది ఏదీ లేదు. కాబట్టి చైనా మద్ధతు కూడా పాకిస్థాన్ కోల్పోయినట్టే లెక్క. ఇక అంతర్గతంగా చూస్తే.. పహెల్గామ్ వంటి దాడులతో తమ ప్రభుత్వ మద్ధతు కూడా కోల్పోయింది పాక్ ఆర్మీ. దీంతో పాక్ సైన్యం ఒంటరి పోరు చేయాల్సిన దుస్థితిలో పడింది. కాబట్టి, POJKని స్వాధీనం చేసుకోడానికి.. ఇదే సరైన సమయం అన్నది నిపుణుల మాట.

POJK మన పరమైతే.. అది మరో ప్రపంచ శాంతికి మార్గం సుగమం

దేశ విభజన కాలం నాటి నుంచి సరిహద్దులను ఉద్రిక్త పరుస్తోన్న ఈ ఉగ్రవాదం ఊసే లేకుండా పోవాలంటే.. పాక్ ఆక్రమిత జమ్మూ- కాశ్మీర్ ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవడం అత్యవసరం. అదే జరిగితే ఇదో చారిత్రక ఘట్టమే అవుతుంది. ఇది కేవలం భారత్ కి మాత్రమే కాదు.. ఇక్కడి నుంచి తయారవుతూ.. ఇతర దేశాలను కూడా గజగజలాడిస్తోన్న ఉగ్రవాద వేదిక POJK మన పరమైతే… అది మరో ప్రపంచ శాంతికి మార్గం సుగమం అవుతుందన్న మాట వినిపిస్తోంది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×