Intinti Ramayanam Today Episode April 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. సంతోషంగా సాగుతున్న అవని జీవితాన్ని పల్లవి మళ్లీ తల క్రిందులు చేస్తుంది. మరో కొత్త క్యారక్టర్ ఎంట్రీ తో అందరికి దిమ్మతిరిగి పోతుంది. ప్రణతి నన్ను ప్రేమించి మోసం చేశారని చెప్పాను కదా వదిన ప్రశాంతని చెప్పానుగా వీడే ఆ ప్రశాంత్ అని అంటుంది. ప్రణతిని వీడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఆపేసి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆస్తిని కొట్టేయాలని చూసావని వీడు చెప్తున్నాడు అది నిజమేనా అని అక్షయ్ అడుగుతాడు.. ఏం మాట్లాడుతున్నారండి మీరు.. వీడు ఎవడో కూడా నాకు తెలియదు అంటే ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నారు అని అవని షాక్ అవుతుంది. అవని నాకు తెలియదు అన్నమాట చెప్పడంతో కమల్ రెచ్చిపోయి వాడ్ని దారుణంగా కొడతాడు. అవని కూడా వాడిని కొడుతుంది.. నేను నిన్ను పిలిచి పారిపొమ్మని ఎందుకు చెప్తాను రా అని అవని వాడిని కొడుతుంది.. వాడు ఎంత కొట్టినా పల్లవి చెప్పినట్లు నిజాన్ని బయట పెట్టడు.. మొత్తానికి అవని మెడ చుట్టు ఉచ్చు బిగించుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అవని ఎంత చెప్తున్నా వినకుండా ఆ ప్రశాంత్ మాటలను నమ్మి అందరూ అవనిని ఛీ కొట్టి వెళ్ళిపోతారు. అవని ఇలాంటి మోసం చేస్తుందని అసలు ఊహించలేదంటూ అందరూ బాధపడుతూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ కు శ్రియా అవినీ అక్క ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు మామయ్య అంటూ తన మనసులోని కక్షను బయట పెట్టేస్తుంది. ఇక భానుమతి కూడా అవని దరిద్రం పోయిందనుకుంటే బయటి ఉండి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంటూ రాజేంద్రప్రసాద్ ని నువ్వేం బాధపడకురా ఎంతవరకు వెళుతుందో అంతవరకు వెళ్ళని మన చేతుల్లో ఏమీ లేదు కదా అనేసి అంటుంది. కూతురికి ఇంత జరిగితే మావయ్య గారు బాధపడుతున్నారు ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందని శ్రీయా అంటుంది. భానుమతి కూడా అవనీని ఇంట్లోంచి పంపించిన తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నాము. కానీ ఇన్ని కష్టాలు పెడుతుందని అసలు ఊహించలేదని అంటుంది.
అవినీ దగ్గరికి వెళ్లిన పార్వతీ అక్షయ్ కమల్ పల్లవిలు ఇంటికి తిరిగి వస్తారు.. శ్రియ ప్రణతి రాలేదేంటి రానని చెప్పిందా లేక హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకురావాలని మీరే బయట పెట్టారని అడుగుతుంది. ప్రణతి రానని చెప్పింది అని అక్షయ్ అంటాడు. అవని ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రణతి జీవితం ఏమైనా పర్వాలేదు తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూసింది తన తమ్ముడికి ప్రణతి నుంచి పెళ్లి చేయాలని చూస్తుందని పార్వతి బాధపడుతుంది.
అక్షయ్ కూడా ఆ ప్రశాంత చెప్పిన మాటలు నమ్మి ఆవలి పై ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆవని ఎంత మోసం చేయాలని చూసినా కూడా ప్రణతి అవనిని గుడ్డిగా నమ్మేస్తుంది. మనం ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేదు. ప్రతిరోజు పోతే తనే అర్థం చేసుకొని రియలైజ్ అవుతుంది అప్పుడు వెళ్లి తీసుకు వస్తాను నాన్న అని అక్షయ్ అంటాడు. అవని చేసింది దానికి నన్ను క్షమించండి నాన్న అని అక్షయ్ అనగానే రాజేంద్రప్రసాద్ మీరంతా ఆ ప్రశాంత్ మాటలు నమ్ముతున్నారా అని అడుగుతాడు. వాడు చూపించిన ఆధారాలు అలా ఉన్నాయి మావయ్య అవని అక్క ఇదంతా చేసిందని అక్కడ తెలిసిపోయింది అని పల్లవి అంటుంది.
మీరు ఎన్ని చెప్పినా వాడు చెప్పేది అబద్ధమని నేను అంటున్నానని రాజేంద్రప్రసాద్ అందరికీ షాక్ ఇస్తాడు. అవని ఎలాంటిదో నాకు తెలుసు ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించానని చాలా బాధపడ్డాను. మన అమ్మాయిని మోసం చేసి వెళ్లిపోయిన వాడి మాటలు మీరు నమ్ముతున్నారు తప్ప మన ఇంట్లో ఇన్నేళ్లు ఉన్న అవని నేను ఎందుకు నమ్మట్లేదని అందరికీ క్లాస్ పీకుతాడు. అవని నిజంగానే తప్పు చేసింది నాన్న మీకు అర్థం కావట్లేదు అని అక్షయ్ కూడా అంటాడు. అసలు నిజా నిజాలు ఏంటో తెలుసుకోకుండా నేను ఒకరిపై నిందలు వేయను అని రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అవని రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తుంది. అప్పటికే పల్లవి ఆరాధ్యకు అన్నం తినిపించడానికి వచ్చి ఉంటుంది. ఆరాధ్య పల్లవి అన్నం పెడుతుంటే నాకు వద్దు నేను తినను అని అంటుంది. ఆరాధ్య పై పల్లవి సీరియస్ అవుతుంది. అక్కడికి వచ్చిన ఆవని నా కూతురికి అన్నం తినిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు నువ్వు పెడితే నా కూతురు అన్నం తింటుందా అని ఆరాధ్య ను దగ్గరికి తీసుకుంటుంది. నా కూతురికి నువ్వు అన్నం తినిపించేరా అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని పల్లవిని అవని అడగ్గానే అప్పుడు అక్కడికి వచ్చి అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు.
ఆరాధ్య బాధ్యతలని పిన్నిగా పల్లవి చూసుకుంటుంది నేనే ఆదికారాన్ని ఇచ్చాను నీలాంటి మోసగేత్తులు ఇలా నా కూతురు జీవితంతో ఆడుకుంటే అస్సలు సహించను అని అవనికి వార్నింగ్ ఇస్తాడు.. ఎవరిని చెప్పినా మీరు గుడ్డిగా నమ్మేస్తారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అవని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..