BigTV English

Mira Murati : ఎవరీ మురాటీ?

Mira Murati : ఎవరీ మురాటీ?

mira murati : టెక్ వర్గాలను విస్మయానికి గురి చేస్తూ ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో, బోర్డు మెంబర్లలో ఒకరిని ఫైర్ చేసింది. శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించి ఆ బాధ్యతలను తాత్కాలికంగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (సీటీవో) మిరా మురాటీకి అప్పగించింది. ఇంతకీ ఎవరీ మురాటీ? ఆల్బేనియాకు చెందిన ఆమె 1988లో వ్లోరాలో జన్మించింది.


16వ ఏట కెనడాకు మకాం మారింది. దీంతో అక్కడి పియర్సన్ కాలేజీ పీడబ్ల్యూసీ‌లో 2007లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2012లో డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకుంది. ఇంటర్న్‌గా కెరీర్ ఆరంభించి.. జోడియాక్ ఏరోస్సేస్‌లో 2013 వరకు పనిచేసింది.

అదే ఏడాది టెస్లాలో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ ఎక్స్ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టింది. మూడేళ్ల అనంతరం టెస్లాకు గుడ్‌బై చెప్పేసి లీప్ మోషన్ కంపెనీలో చేరింది. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీలో మోషన్ సెన్సింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేది ఆ స్టార్టప్ సంస్థ.


2018లో మురాటీ ఓపెన్ ఏఐలో అప్లైడ్ ఏఐ అండ్ పార్టర్న్‌షిప్స్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టింది. 2022లో సీటీవో‌గా పదోన్నతి లభించింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ చాట్ జీపీటీ రూపకల్పనలో ఆమె కూడా కీలక పాత్ర వహించింది. అలాగే టెక్ట్స్ టూ ఇమేజ్ ఏఐ టూల్ డాల్-ఈ, కోడ్-జనరేటింగ్ సిస్టమ్ కోడెక్స్‌‌ను అభివృద్ధి చేయడంలో మురాటీ భాగస్వామ్యం ఉంది.

ఓపెన్ ఏఐలో ఉన్నత స్థానాన్ని అధిష్ఠించిన తొలి మహిళ, తొలి ఆల్బేనియన్ మురాటీయే. ఈ పదవి దక్కడం ఎంతో గౌరవప్రదంగా భావిస్తున్నానని ఆమె వెల్లడించింది. అత్యంత కీలక తరుణంలో మురాటీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. ఇది ఆమెకు సవాల్ లాంటిదే.

Related News

Giddalur Politics: గిద్దలూరు వైసీపీలో అయోమయం.. నాగార్జున ఫ్యూచర్ ఏంటి?

Pakistan Army: పాక్ పరేషాన్ ఫోర్స్..! చైనా సపోర్ట్‌‌తో మునీర్ కొత్త ప్లాన్..?

Congress: భయపెడుతున్నాడా! పార్టీ మారుతాడా! రాజగోపాల్ లెక్కేంటి?

AP Politics: బిగ్‌బాస్ జగనే! బీజేపీ దూకుడుకు రీజనేంటి?

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Big Stories

×