BigTV English

AP Elections Result 2024: ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. గెలిచేదెవరు? ఓడేదెవరు?

AP Elections Result 2024: ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. గెలిచేదెవరు? ఓడేదెవరు?

Who Will Win Andhra Pradesh Assembly Election 2024: ఏపీలో గెలిచేదెవరు? ఓడేదెవరు? ఇప్పుడిదే.. హాట్ హాట్ డిస్కషన్ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే ఉంది. ఏ పార్టీ గెలుస్తోందన్న ఆసక్తి ప్రజల్లో సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా ఏపీలో ఈ సారి ఎన్నికల ఫలితాల పట్ల దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. ఈక్రమంలో కౌంటింగ్‌కు కౌండ్‌డౌన్ మొదలైంది.


ఇక.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్‌లో ఉంది. కూటమి గెలుపు కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారన్నారు చంద్రబాబు. పూర్తి స్థాయి ఫలితాలొచ్చే వరకు అశ్రద్ధ వద్దని చంద్రబాబు సూచించారు. ఇక.. ఎగ్జిట్ పోల్స్ తర్వాత వైసీపీలో ఆందోళన మొదలైంది. ఏ ఒక్క వైసీపీ నేత ఎగ్జిట్ పోల్స్‌పై మాట్లాడేందుకు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ వివాదంలోనూ ఎదురుదెబ్బ తగలడంతో మరింత అయోమయంలో పడింది వైసీపీ. కౌంటింగ్ హాల్‌కి ఏజెంట్లకు తెచ్చేందుకు వైసీపీ అష్టకష్టాలు పడుతోంది.

జూన్ 9న వైజాక్ లో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. ఎవరెన్ని చెప్పిన ఎన్ని సర్వేలు చేసిన సీఎం అయ్యేది ఒకరే.. ఇప్పడు ఆ ఒక్కరు ఎవరనేది ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మై యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే ఈ జాబితాలోకి చేరింది. టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం వరిస్తుందని, మిత్రపక్షం జనసేన పార్టీ..16 నుంచి 18 స్థానాలు.. బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక… అధికార వైసీపీ పార్టీ మాత్రం 55 నుంచి 77 స్థానాలకే సర్వేలో వెల్లడైంది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ సర్వే వెల్లడించింది.

Also Read: తెలంగాణ అవతరణ వేడుకల వేళ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మరోవైపు..ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగా..వైసీపీకి 55 నుంచి 77, కాంగ్రెస్‌కు సున్నా నుంచి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సర్వే వెల్లడించింది. పార్టీల వారీగా ఓటు షేర్‌ చూస్తే.. తెలుగుదేశానికి 42శాతం, వైసీపీకి 44 శాతం, జనసేనకు 7 శాతం ఓటింగ్ ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ చెరో 2 2 శాతం, ఇతరులు 3శాతం ఓట్లను షేర్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది.. లోక్‌సభకు సంబంధించి టీడీపీ 13 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. జనసేన 2, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో ప్రకటించింది. అధికార వైసీపీ 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం మాత్రమే తాజా సర్వేలో నివేదించబడింది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×