BigTV English

AP Politics: వర్మకి ఎమ్మెల్సీ? మంత్రిగా నాగబాబు..

AP Politics: వర్మకి ఎమ్మెల్సీ? మంత్రిగా నాగబాబు..

AP Politics: జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబుకు ఈ ఏడాది ఉగాది నాటికే మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. దాదాపు నాలుగైదు నెలల క్రితమే దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అప్పటికి నాగబాబు ఎమ్మెల్సీ కూడా కాదు. ఇటీవలే ఆయనకు ఆ పదవి లభించింది. దానితో ఉగాదికి క్యాబినెట్ విస్తరణ ఉంటుంది దానిలో భాగంగా నాగబాబు మంత్రి పదవి లభిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రక్రియకు చిన్న బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.


ఉగాది నాడు నాగబాబుకి మంత్రి పదవి వస్తుందని ప్రచారం

ఉగాది రోజు మెగా బ్రదర్ , ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకి మంత్రి పదవి లభిస్తుంది అని అందరూ భావించారు. జనసేన జన సైనికులు సంబరాలకు కూడా రెడీ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిస్థాత్మకంగా ప్రకటించిన P-4 కార్యక్రమం ఉగాది రోజునే ప్రారంభం అయింది . దానికోసం ఏపీ ప్రభుత్వం కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పేదరిక నిర్మూలన అనే కాన్సెప్ట్ తో పబ్లిక్, ప్రైవేట్ దాతల భాగస్వామ్యంతో జీరో పావర్టీ కార్యక్రమం ఉగాది రోజున నిర్వహించారు. దానికి వీలైనంత ప్రచారం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేసింది.


దసరాకి నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ కార్యక్రమం రోజున మంత్రివర్గ విస్తరణ చేపడితే ప్రజల ఫోకస్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, దాన్ని మరికొద్ది రోజులపాటు వేయడానికి ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్టు సమాచారం. కాబట్టి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి మరి కొంత సమయం పడుతోందని, దసరాకి ఆయనకు క్యాబినెట్ బెర్త్ దక్కవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో మరొక్క మినిస్టర్ ని తీసుకోవడానికి చోటుంది. ఆ ఒక్క ప్లేస్ ని జనసేనకి కేటాయిస్తారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నాగబాబుని మంత్రిగా తీసుకుని క్యాబినెట్‌ని పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారని చెప్తున్నారు.

కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి

అయితే మరోవైపున కొంతమంది మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తిగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల పనితీరుపై ప్రోగస్ రిపోర్టులో లాస్ట్ రావడంతో పాటు చంద్రబాబుతో ఇప్పటికే చివాట్లు తిన్న మంత్రులు ఉన్నారు. తన వేగాన్ని అందుకోలేకపోతున్నారంటూ, అలాంటి వారిపై సీఎం స్వయంగా అసంతృప్తి వెళ్ళగక్కిన సందర్భాలున్నాయి. అలాంటి ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వాళ్లను తీసుకోవడమూ, లేక వాళ్ళ శాఖలను మార్చడమో వంటి కార్యక్రమం కూడా జరగడానికి చాన్స్ లేకపోలేదు అనేది ప్రస్తుతం టిడిపిలో జరుగుతున్న చర్చ.

క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను మొగ్గు చూపే అవకాశం

అదే గనక జరిగితే క్యాబినెట్ విస్తరణ బదులు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టడానికే చంద్రబాబు మొగ్గు చూపుతారు అంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి మొదటి కోటాలోనే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. పది నెలలు గడిచినా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ క్రమంలో పిఠాపురంలో టిడిపి, జనసేనల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంతో పిఠాపురం తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వాలంటీర్ల పై గుడివాడ సెటైర్లు

నాగబాబుకి ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం తమ్ముళ్ల అసహనం

వర్మ ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఆ క్రమంలో నాగబాబుకి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు తప్పవని టీడీపీ అధిష్టానం భావిస్తోందంట. ఇటీవల కాలంలో జనసేన నిర్వహించిన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. వర్మ త్యాగాన్ని చులకన చేస్తున్నట్లు వ్యాఖ్యానించిన నాగబాబు వ్యవహార శైలిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టినట్టు సమాచారం. ఆ లెక్కలతోనే వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చే వరకు నాగబాబుకి క్యాబినెట్ బెర్త్ పెండింగ్లో పెట్టాలని భావిస్తున్నారంట. మరోవైపు దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×