Brahmamudi serial today Episode: రాజ్, కావ్యకు అనుకోకుండా పెళ్లి జరిగిన విషయాన్ని తమకే జరిగినట్టు కళ్యాణ్, అప్పు స్టేజీ మీదకు వెళ్లి చెప్తుంటారు. అదంతా వింటున్న రాజ్‌కు తన పెళ్లి గుర్తుకు వస్తుంది. కళ్యాన్ నెక్ట్స్ ఏం చెప్పబోతాడోనని ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు రాజ్. మరోవైపు రుద్రాణి, రాహుల్ వెళ్లి కరెంట్ ఆపేయాలని చూస్తారు. వాళ్ల వెనకాలే వెళ్లిన యామిని వారిని భుజం మీద చేయి పెట్టగానే రాహుల్, రుద్రాణి ఉలిక్కి పడి తిరిగి చూస్తారు. రుద్రాణి విషయం అర్థమైంది అనగానే.. మీకు నాకు కావాల్సింది ఒకటేనని నాక్కూడా అర్థం అయింది అంటుంది యామిని. ఇంతలో రుద్రాణి శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు అంటుంది.
యామిని మాత్రం మాటలు తర్వాత ముందు పవర్ ఆఫ్ చేయండి అని చెప్తుంది. మరోవైపు కళ్యాణ్ చివరి వరకు మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం.. కానీ..అంటుండగానే పవర్ పోతుంది. వెంటనే రాజ్ కోపంగా మేనేజర్ అంటూ పిలిచి ఈ టైంలో పవర్ పోవడం ఏంటి..? వెంటనే బ్యాక్‌ఆప్ ఆన్ చేయండి అంటాడు. ఇంతలో యామిని అక్కడకు వచ్చి ఏంటి కావ్య నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చూస్తున్నావా..? లేకపోతే ఈ టైంలో పవర్ పోయిందేంటని ఆలోచిస్తున్నావా..? అంటుంది. దీంతో కావ్య పోయింది పవర్ మాత్రమే ప్రాణం కాదు తిరిగి వస్తుంది కదా అంటుంది. దీంతో యామిని పవర్ తెల్లారే వరకు రాదు. ఎందుకంటే అది తీసిందే నేను అని చెప్తుంది. రాజ్ దగ్గరకు వెళ్లి బావ పవర్ పోయాక మనం ఇక్కడ ఉండటమేంటి..? ఇక వెళ్దాం పద అంటుంది. రాజ్ తాను రానని కళ్యాణ్ చెప్పే కథ మొత్తం వినాలని ఉందని చెప్తాడు. అయినా వినకుండా యామిని తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ రాజ్ స్టేజ్ మీదకు వెళ్లి కళ్యాణ్ లవ్ స్టోరీ నేను మొత్తం వినాలనుకుంటున్నాను.. మీకు కూడా వినాలని ఉంటే మీ దగ్గర ఉన్న సెల్‌ఫోన్ లైట్స్ ఆన్ చేయండి ఆ వెలుగుతో మన పార్టీని కంప్లీట్ చేసుకుందాం అని చెప్తాడు.
అందరూ రాజ్ చెప్పినట్టు చేస్తారు. కళ్యాన్, అప్పు కథ కంటిన్యూ చేస్తారు. వాళ్లిద్దరూ స్టోరీ చెప్తుంటే.. రాజ్ ఎమోషన్ అవుతాడు. ఒక్కోక్క సంఘటన చెప్తుంటే.. అదంతా రాజ్ గుర్తు చేసుకుంటూ తల తిరగడంతో కావ్యను గుర్తు పడుతూ కిందపడిపోతాడు. యామిని బావ అనుకుంటూ దగ్గరకు వెళ్లగానే కావ్య కోపంగా ఏయ్ ఆగు తను నా మొగుడు నువ్వు తాకితే ఒప్పుకోను కవి గారు వెంటనే కారు తీసుకురండి అని చెప్పగానే కల్యాణ్ కారు తీసుకురాగానే అందరూ కలిసి రాజ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. హాస్పిటల్ లో డాక్టర్లు రాజ్‌కు ట్రీట్‌మెంట్ చేస్తుంటే.. కావ్య బాధపడుతుంది. ఇంతలో డాక్టర్లు బయటకు వచ్చి అన్ని తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేశారు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి చేశారంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వెళ్లిపోతాడు. కావ్య బాధపడుతుంది. అప్పు ఓదారుస్తుంది.
ఇంతలో అక్కడికి యామిని వస్తుంది. చాలా అద్బుతంగా జరిగింది కదా మీ ప్రయత్నం.. ఏదో పొడిచేస్తా.. అని ఇలా ఐసీయూకి తీసుకొచ్చావు.. ఇప్పటికే కాదు ఎప్పటికైనా రాజ్ నా సొంతం అంటుంది. అప్పు కోపంగా యామినికి వార్నింగ్ ఇస్తుంది. దీంతో యామిని ఇప్పుడు మాత్రమే నేను తన తెలిసిన గతం, భవిష్యత్తు మీరు దగ్గరకు వెళితే ఏం జరుగుతుందో తెలుసా..? అంటూ యామిని ఐసీయూలోకి వెళ్తుంది. స్పృహలోకి వచ్చిన రాజ్ కావ్యను అడుగుతాడు. తాను రాలేదని యామిని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?