BigTV English

winter: మార్నింగ్ వాక్ చేస్తున్నారా..! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

winter: మార్నింగ్ వాక్ చేస్తున్నారా..! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

winter : ఉదయాన్నే చాలా మందికి వాకింగ్ చేయడం అలవాటుగా మారింది. అయితే చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మార్నింగ్ వాకింగ్ చేయడం మంచిదేనా? అనే ప్రశ్న వాకర్స్‌ని వెంటాడుతోంది. చలిలో వాకింగ్ చేయడం వలన ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటన్నంటిని పక్కనబెట్టి మీరు వాకింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!


వాకింగ్ చేయడం చాలా మంచి అలవాటు ఉదయం అయినా, సాయంత్రం అయినా. నడవడం వలన చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చలికాలం వాకింగ్ చేయడం మంచిదేనా? అనే ప్రశ్న వాకర్స్‌ను వెంటాడుతోంది. ఒకవేళ మంచిదే అయితే. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

ఉదయం వాకింగ్ చేయడం మంచిదే అయినప్పటికి. చలిలో ఉదయం నడవటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చలిలో వాకింగ్ చేస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.


చలి కాలంలో వాకింగ్ చేయాలంటే టైట్‌గా ఉండే దుస్తులు కాకుండా.. కాస్త వదులుగా ఉండేవాటిని ధరిస్తే బెటర్. దుస్తులతో మన శరీరం మొత్తం కవర్ చేసుకోవాలి. శరీరానికి వెచ్చదనం ఇచ్చే దుస్తులు అయితే చాలా మంచిది.

చలిలో నడిచేప్పుడు తలకు, చెవుల్లో గాలి చేరకుండా దుస్తులతో కవర్ చేయాలి. నడిచేప్పుడు మొదట వేగంగా నడవాలి. దీంతో బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ తరువాత మెల్లగా నడిచిన పర్వాలేదు.

ఆస్తమా, గుండె సమస్యలు ఉన్నావారు ఉదయం వాకింగ్ చేయకపోవడమే మంచిది. ఉదయం సూర్యరశ్మి భూమిని తాకేటప్పుడు నడిస్తే చాలా మంచిది. చలికాలంలో ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు. తక్కువుగా నడిస్తేనే ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో నడవటం వలన బద్ధకం వదిలి చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×