Women Reservation: మహిళా రిజర్వేషన్ల అమలు అసలు అయ్యే పని కాదు అని కేంద్రానికి తెలిసినా తీసుకొచ్చింది. ఇది రాహుల్ గాంధీ సభలో చెప్పిన మాట. ఓసారి ఆయనేమన్నారో చూడండి.
రైట్ చూశారుగా రాహుల్ కామెంట్స్. అన్నది అన్నట్లు జరిగింది. మరి ఎక్కడ కేంద్రం ఫెయిల్ అయింది? ఇందుకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి రాజ్యాంగ సవరణ బిల్లు తేవాలని ఏ ప్రభుత్వం అనుకున్నా.. అందుకు 2/3 మెజార్టీ అవసరం. ఏదో హడావుడిగా తెచ్చి కథ మార్చాలనుకుంటే అయ్యే పని కాదు. పైగా డీలిమిటేషన్ వంటి సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎందుకంటే దేశ భవిష్యత్ ను మార్చే నిర్ణయం హడావుడిగా పాస్ అవుతుందనుకుంటే పొరపాటే. ఒకవేళ పాస్ చేద్దామని అనుకుంటే విపక్షాల్లోని కొందరు ఎంపీలనైనా తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయాల్సి ఉండేది. మోడీ ప్రభుత్వం అది కూడా చేయలేకపోయింది. రైట్ ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది.. మరి జరగాల్సిందేంటి? ఇప్పుడు అందరిలోనూ ఇదే క్వశ్చన్.
అసలు మహిళా కోటా చుట్టూ ఉన్న చిక్కులేంటో చూద్దాం. నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియం 2023 సెప్టెంబర్ 20న లోక్‌సభలో ఆమోదం పొందింది. అదే ఏడాది సెప్టెంబర్ 21న రాజ్యసభలోనూ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సెప్టెంబర్ 29న రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. అయితే అమలు విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయారు. అధిక మెజారిటీతో పాస్ అయినా అమలు ఆలస్యం చేశారు. ఈ చట్టం అమలును జనగణనకు, డీలిమిటేషన్ కు లింకు పెట్టడంతో సమస్య పెరిగింది. ఆ లెక్కన 2034 నుంచి అమలు చేసేలా నిబంధనలు ఉన్నాయి. కోటా బిల్లు చట్టమైనా అమలు మాత్రం 2034 నుంచే. అయితే కేంద్రం మాత్రం ఎందుకోగానీ ఆల్ ఆఫ్ సడెన్ గా గేర్ మార్చి స్పీడ్ పెంచాలనుకుంది. 2029 ఎన్నికల నుంచే కోటా అమలు కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది.
2023లో ఆమోదం పొందిన 106వ రాజ్యాంగ సవరణలోని అంశాల ప్రకారం 2026 జనాభా లెక్కలు వచ్చాక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. సో కొత్త జనాభా లెక్కల ప్రకారం అదే సమయంలో ఎవరూ నష్టపోకుండా మరో ఫార్ములాను మిక్స్ చేసి సీట్ల సంఖ్య పెంచి కోటా అమలు చేసే అవకాశం ఉంది. అలాగే చేస్తే అప్పుడు అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే డీలిమిటేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టి సాధారణ మెజార్టీతో ఆమోదింపజేయవచ్చు. టూ బై థర్డ్ మెజారిటీ అవసరం లేదు. ఈ విషయంలో ఎన్డీఏ ఈజీగా నెగ్గుతుంది.
బిల్లు నెగ్గితే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2029 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయొచ్చు. ఒక ఆరు నెలల టైంలో ఈ కసరత్తు ఓ కొలిక్కి తేవొచ్చు అన్న పాయింట్ ను చాలా మంది వినిపిస్తున్నారు. పెరిగిన సీట్లలో 33% సీట్లను మహిళలకు రిజర్వు చేయవచ్చని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న సీట్లపై 2001లో విధించిన రూల్ ఈ ఏడాదితో తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు జరగబోయే జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అంతా జనగణన చుట్టే ఆధారపడి ఉంది. 2027 మార్చి 1 లోపు జనగణన పూర్తవుతుంది. అప్పుడే అసలు గేమ్ మొదలు కావొచ్చు.
తాజాగా కేంద్రం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్‌సభ సీట్ల సంఖ్య 543 నుంచి 816కు పెంచాలన్న విషయం కూడా ఉంది. ఇదే వివాదానికి దారి తీసింది. మహిళా కోటాకు బ్రేకులు కూడా వేసింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడంతో దేశంలోని ఎలక్టోరల్ మ్యాప్ లో మార్పులు జరగవు. ప్రతిపాదిత సీట్ల పెంపు, మహిళలకు 273 సీట్ల కేటాయింపు వంటి అంశాలకు బ్రేక్ పడింది. సో 2027 మార్చి నాటికి జనగణన పూర్తయితే ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు సాధారణ మెజారిటీ సరిపోతుంది. వేగంగా డీలిమిటేషన్ చేస్తే 2029 ఎన్నికల్లోనే మహిళా కోటా చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ప్రజలపై, రాజ్యాంగంపై ఎన్డీఏ అటాక్ చేయాలని చూశారని, తాను మాత్రం ప్రభుత్వంపైనే అటాక్ చేస్తున్నానన్నారు రాహుల్ గాంధీ. మహిళా రిజర్వేషన్ల అమలును రాజ్యాంగ సవరణలతో ముడిపెట్టినంత కాలం ఈ చట్టం అమలు ముందడుగు పడదంటున్నారు. ఏదైనా సరే సాధారణ మెజారిటితో సాధించుకునే వ్యూహాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంది. అది మహిళా కోటాకు, డీలిమిటేషన్ లింక్ ఉండొద్దు. ఏ ఫార్ములా వాటికే ఉంటేనే వర్కవుట్ అవుతుందంటున్నారు.
అసలు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి కేంద్రం ఎందుకు ఆల్ ఆఫ్ సడెన్ గా ఉత్సాహం చూపిందో ఇంటర్నల్ విషయాలు, ప్రతిపక్షాల విమర్శల ఆధారంగా డీకోడ్ చేసి చూద్దాం. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా కోటాను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మ్యాజిక్ చేయాలని అనుకుందా అన్న డౌట్లు ఉన్నాయ్. ఇప్పటికే మోడీ సర్కార్ మూడు టర్ములు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో కొద్దిలో గట్టెక్కింది.
ఇప్పుడు జేడీయూ, టీడీపీ ఈ రెండు పార్టీల సపోర్ట్ తోనే ఎన్డీఏ ప్రభుత్వం బండి నడుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల నాటికి మరింత సహజ ప్రజావ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యతిరేకతను కౌంటర్ చేసేందుకు మహిళా కోటా అమలును కేంద్రం ఎత్తుకుందన్న వాదన కూడా ఉంది. డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. మహిళా కోటా విషయంలో ఇతర అంశాలను ఎందుకు కలుపుతున్నారని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. దమ్ముంటే 2023 నాటి మహిళా బిల్లునే మరోసారి పెట్టాలని సవాల్ విసిరారు.
ఇక రెండోది.. ఈ మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. అవి జరగకపోవడంతో వాటిని కూడా 2011 నాటి లెక్కల ప్రకారం పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది కేంద్రం. అయితే అది వర్కవుట్ కాలేదు. దక్షిణాది రాష్ట్రాలను మెప్పించలేకపోయారు. ఓవరాల్ గా చూస్తే 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు మహిళా రిజర్వేషన్ల చాటున డీలిమిటేషన్ బిల్లు తెచ్చి.. ఓట్లు, సీట్లను మార్చేసి మళ్లీ గట్టెక్కే ప్రయత్నం చేశారని, అందుకే కేంద్రం కుట్రను తిప్పికొట్టామని ఖర్గే అన్నారు. ఆయన ఇంకో మాట అన్నారు. అసలు మహిళా కోటాకు వ్యతిరేకం కాదని, 2023లో బిల్లు పెడితే ఉభయసభల్లో మద్దతు ఇచ్చింది తామే అని గుర్తు చేశారు.
డీలిమిటేషన్ కుట్రను తిప్పికొట్టామనడం ద్వారా కేంద్రం తీరును క్వశ్చన్ చేశారాయన. డీమానిటైజేషన్ తరహాలోనే డీలిమిటేషన్ పై దూకుడు ఎందుకు అన్న ప్రశ్నలు విపక్షం నుంచి వచ్చాయి. ఓవరాల్ గా చూస్తే పార్లమెంట్ సమావేశాలు మహిళా సాధికారత కోసం కాదని, ఎవరూ ఒప్పుకోని నియోజకవర్గాల పునర్విభజన ఫార్ములా అజెండాను ముందుకు నెట్టడానికి దీన్ని ఒక ముసుగుగా వాడుకున్నారని ప్రియాంక గాంధీ లాంటి నేతలు విమర్శించారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. తాము మహిళా కోటాకు వ్యతిరేకం కాదని, కేవలం కేంద్రం కుట్రలకే వ్యతిరేకమన్న మాటను వివరిస్తూ వచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు ఆందోళన అవసరం లేదు. మీ ప్రాతినిథ్యాన్ని టచ్ చేసే హక్కు ఎవరికీ లేదు.
మహిళా చట్టం అమలు కోసం హడావుడిగా సవరణ బిల్లు తేవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొన్నే ప్రశ్నించారు. అసలు ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు సజావుగా ఉభయసభల్లో ఆమోదముద్ర పడాలంటే ఏం చేయాలో సీఎం రేవంత్ చాలా క్లారిటీతో సూచనలు ఇచ్చారు. జనగణన కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున అవి పూర్తయ్యే లోగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, అందరి అభిప్రాయాలు తీసుకుని, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ప్రాతిపదికను నిర్ణయించాలని, 2028 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని, అనవసరమైన గందరగోళానికి తెరలేపొద్దన్నారు సీఎం. ఆయన అన్నట్లుగానే రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోయాయి. ఇక కేంద్రం చేయాల్సింది కూడా ఇదే.
మొన్నటికి మొన్న లోక్ సభలో ప్రధాని మోడీ ఓ మాటన్నారు. కోటా చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తే తమకే లాభం జరుగుతుందని, కలిసి వస్తే ఎవరికీ నష్టం జరగదన్నారు. తమకు క్రెడిట్ వద్దని, మహిళా కోటాకు సంబంధించి క్రెడిట్ విపక్షాలే తీసుకోండి అని ప్రధాని మోడీ విపక్షాలకు ఆఫర్ ఇచ్చారు. ఆయనేమన్నారో చూడండి.
అయితే ఇది ఏ ఒక్కరి క్రెడిట్ కు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే దేశ ముఖచిత్రాన్ని, భవిష్యత్ ను మార్చే శక్తి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన అంశం హడావుడిగా తీసుకునే నిర్ణయం కానే కాదు. నిజానికి మహిళా కోటా చట్టం అమలు విషయంలో సవరణ చేస్తూ.. కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 16న అర్ధరాత్రి హడావుడిగా తెచ్చిన ఈ గెజిట్ నోటిఫికేషన్ ను ఓసారి చూడండి. ఏదైనా చట్టానికి సవరణ బిల్లు తెస్తే దాని అమలు తేదీ గురించి నోటిఫికేషన్ ఉండాలి కదా. మహిళా కోటాకు సంబంధించి అమలు తేదీ ఏదీ లేదు. కానీ కేంద్ర న్యాయశాఖ అప్పటికప్పుడు ఏప్రిల్ 16ను అమలు తేదీగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం ముందు చూపు ఎలా లేకుండా పోయింది.. ఎలా సన్నద్ధత లేకుండా పోయిందన్నది ఈ విషయాలు చూస్తే అర్థమవుతుందని కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు క్వశ్చన్ చేశారు కూడా.
1992లో నాడు ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు.. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు తెచ్చారు. వాటికి పార్లమెంటులో ఆమోదం వచ్చేలా కృషి చేశారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లకు రూట్ క్లియర్ అయింది. తర్వాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ చట్టసభల్లోనూ మహిళలకు 33 శాతం కోటా కల్పించాల్సిన అవసరం ఉందని వాదిస్తూ వచ్చాయి. అది 2023 నాటికి చట్టంగా మారినా అమలుకు మాత్రం బ్రేకులు తప్పలేదు.
నిజానికి ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కూడా అంత ఈజీగా సాగలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు దీనిపై వరుస ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తే 2023లో అవి ఫలించాయి. ఇప్పుడు అమలు విషయంలో అలాంటి సంఘర్షణే కంటిన్యూ అవుతోంది. మహిళా రిజర్వేషన్లు అయినా, డీలిమిటేషన్ అయినా ఇవన్నీ సెన్సిటివ్ సబ్జెక్ట్స్. వీటికి రాజ్యాంగ సవరణలు చేయాలంటే మరీ సెన్సిటివ్. అందుకే అందరినీ ఒప్పించి, మెప్పించాకే ముందుకెళ్లాలి. అదే సక్సెస్ ఫార్ములా అంటున్నారు.
ఓవరాల్ గా చూస్తే ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ అయితే నడుస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్ ప్రస్తావన తేకుండా.. మహిళా కోటాను కాంగ్రెస్ అడ్డుకుందని బీజీపీ ఆరోపణలు చేస్తోంది. అంతే కాదు.. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం ఈ వ్యూహం నడిపిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ కోటా అమలు బిల్లును కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కలిసి అడ్డుకున్నాయని జనంలోకి తీసుకెళ్లే ప్రయతనం చేస్తోంది. అదే సమయంలో తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని, 2023 నాటి బిల్లు పెట్టాలని కాంగ్రెస్ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. మరి బెంగాల్, తమిళనాడులో ఎవరిపై ఏ ఎఫెక్ట్ ఉండబోతోందన్నది మే 4న క్లారిటీ రాబోతోంది.
Also Read: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
Story by: Anup, Big Tv