BigTV English

Chittoor Politics: చిత్తూరు వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..

Chittoor Politics: చిత్తూరు వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..

Chittoor Politics: ఓకప్పుడు రాష్ట రాజకీయాలలో చక్రం తిప్పిన వైసీపీ చిత్తూరు జిల్లా నేతలు ఇప్పుడు కేసుల భయంతో కొట్టుమిట్టాడుతున్నారు.. కీలక నేతలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి ఇప్పటికే లీక్కర్ స్కాంలో అరెస్ట్ కావడం, వారిపై మరికొన్ని కేసులలో విచారణ జరుగుతుండటంతో జిల్లాలో పలువురు ఆ పార్టీ నేతలు కేసులు భయంతో కొట్టుమిట్టాడుతున్నారం. ఆ క్రమంలో ఇప్పుడు జిల్లా పార్టీ భాధ్యతలు మొత్తం తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీదా పడ్డాయి..అయనకు సైతం ఎపిక్ కార్డుల తలనొప్పి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లోలోపల భయపడుతూ బయటకు మాత్రం మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంట…


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుసగా అరెస్ట్ అవుతున్న వైసీపీ నేతలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసిపి కీలక నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటూ అరెస్టు అవుతున్నారు..మద్యం స్కాం కేసులో చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు కటకటాల వెనుకకు వెళ్ళారు. అందరికంటే ముందు రాజంపేట ఎంపి మిథున్ రెడ్డిపై కేసు నమొదు అయినప్పటికి చార్జీషీటు దాఖలు తర్వాత అయన్ని అరెస్ట్ చేసారు.. చాల కాలం పాటు అయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు చుట్టు తిరుగుతూ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు అయితే చివరకు రెండు చోట్ల అయనకు అనుకూలంగా తీర్పు రాక పోవడంతో ఎట్టకేలకు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి చివరకు అరెస్ట్ చేసింది.. ప్రస్తుతం అయన రిమాండ్‌లో ఉన్నారు..


తను అరెస్ట్ చేయమని సవాళ్లు విసిరిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

మరో వైపు వైసీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనను అరెస్ట్ చేయండి అంటు సవాళ్లు విసిరి మరీ లిక్కర్ కేసులో కటకటాలపాలయ్యారు. అయన కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలు ఇద్దరు మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు. వారు జగన్‌కి లెప్ట్ అండ్ రైట్ అన్నట్లు వ్యవహరించేవారని వైసీపీ శ్రేణులు అంటుంటాయి. ఆ క్రమంలో లిక్కర్ స్కాంలో చార్జ్ షీటు వేసిన తర్వాత కూడా అదనపు చార్జ్ షీటులు వేస్తామని సిట్ పేర్కొంది.. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎక్సెజ్ శాఖ బాధ్యతలు ఐదు సంవత్సరాల పాటు చూసిన నారాయణస్వామిని కూడా సిట్ విచారించింది. మరోవైపు చిత్తూరుజిల్లాకు చెందిన మరో ఇద్దరు నాయకులు సైతం మద్యం సరఫరా బినామీ పేర్లతో చేసారంట.. వారి చిట్టా సైతం ఇప్పుడు సిట్ వద్ద ఉందంట.. వారికి తోందరలో శ్రీముఖాలు వస్తాయని అంటున్నారు . వారిలో ఒకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు..

ఆడుదాం ఆంధ్రాపై ముగిసిన విజిలెన్స్ విచారణ

తాజా పరిణామాల నేపథ్యంలో అడుదాం అంధ్రా పై విజిలెన్స్ విచారణ ఉమ్మడి జిల్లాలో ముగిసిందంట.. అందులో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించిందంట. ఈ నేపథ్యంలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా పై కూడా ఏసీబీ కేసు నమోదు అవుతుందని అంటున్నారు. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 22 ఎకరాల భూములకు సంబంధించి పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. దానికి సంబంధించ మాజీ ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్‌పై కేసులు పెడతారని అంటున్నారు. అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యేకు సహకరించిన అధికారులు ఇరుక్కు పోయే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఎపిక్ కార్డులపై టెక్నికల్ అధారాలతో కేసు రీఓపెన్ చేయమని ఆదేశం

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, అయన తనయుడు అభినయ్‌రెడ్డిలపై టీడీఅర్ బాండ్స్ ఇష్యూతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాద్దాంతం నేపధ్యంలో ఎపిక్ కార్డుల ఇష్యూలో టెక్నికల్ అధారాలతో కేసు రీఓపెన్ చేయమని ప్రభుత్వం అదేశించిందంట..దాని తర్వాత పరిస్థితి ఏంటనే చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. మొత్తం ఈ వ్యవహరాల్లో కీలక నాయకులు బుక్ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. మరో వైపు చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిపై తుడా నిధుల దుర్వినియోగం కేసు నమోదు అయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. దానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక 90 శాతం కంప్లీట్ అయ్యిందంట. తుది విడత విచారణతో మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇక అటవీభూముల అక్రమణ, మదనపల్లి పైల్స్ దగ్ధం , బుగ్గమఠం భూముల ఇష్యూల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయన సోదరుడైనర ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిలకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోందంట.

పరుష పదజాలంతో విరుచుకుపడుతున్న రోజా

వీటికి తోడు భూ అక్రమణ బాధితులు ఒక్కరొక్కరు బయటకు వస్తూ వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. ఆ కేసుల భయంతోనే వైసిపి ముందుగా ఎదురు దాడి ప్రారంభించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు..అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు విమర్శలు చేసిన మాజీ మంత్రి రోజా ఇప్పుడు తనను, తన కుటుంబాన్ని టిడిపి టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. గతంలో అమె చేసిన విమర్శలతో పాటు ఆమె కుటంబ సభ్యుల అక్రమాల వల్లనే నగరిలో ఏ నాయకుడికి రాని మెజార్టీతో గాలి భాను ప్రకాష్ విజయం సాధించారన్న అభిప్రాయం ఉంది. గతంలో రోజా రెండు సార్లు బోటా బొటీ మెజార్టీతో … అదికూడా 2014 లో విజయ అనే నాయకుడు టిడిపి ఓట్లు చీల్చడంతో మొదటి సారి విజయం సాధించగలిగారు. రెండో సారి గాలి భాను ప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ లోపాయి కారీ గా సహాకారం అందించడంతో గట్టెక్కగలిగారని వైసీపీ వర్గాలే అంటుంటాయి. ఆ విధంగా రెండు సార్లు గెలిచిన అమె ఇప్పుడు గాలి బాను విజయం గాలి విజయం అంటూ పరుషపదజాలంతో విరుచుకపడుతుండటానికి అరెస్ట్ భయమే కారణమంటున్నారు.

జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న భూమన

ప్రస్తుతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత భూమన పార్టీ భాద్యతలు చూస్తున్నారు. ఎదో ఒక రకంగా పార్టీ వాణిని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తేగ హాడావుడి చేసిన మిగతానాయకులు తమ నియోజక వర్గాల్లో అరకొర కార్యక్రమాలు చేస్తూ చుట్టం చూపుగా వచ్చిపోతున్నారంట.మొత్తం మీదా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పార్టీకి ఎకైక దిక్కుగా కరుణాకర్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. .అయితే తాజాగా పెండింగ్ కేసుల తోవిచారణ వేగవంతం అవ్వడంతో మరికొందరు నేతలు కటకటాలవెనుకకు వెళతారని అంటున్నారు..మొత్తం మీదా చూడాలి అసలేం జరుగుతుందో.

Story By Venkatesh, Bigtv

Related News

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×