BigTV English

OTT Movie : ఈ జీన్స్ వేసుకుంటే పోతారు మొత్తం పోతారు… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మావా

OTT Movie : ఈ జీన్స్ వేసుకుంటే పోతారు మొత్తం పోతారు… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మావా

OTT Movie : హారర్-కామెడీ ఇష్టపడేవాళ్లకి ఫన్ రైడ్ ఇచ్చే ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జీన్స్ ప్యాంట్స్ ప్రాణాలు తీస్తుంటాయి. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే చచ్చుడేంది అనుకుంటున్నారా.  అయితే  అవి ఎందుకు అలా చేస్తున్నాయనే విషయం స్టోరీలోకి వెళ్ళి తెలుసుకుందాం ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


షడ్డర్‌ లో స్ట్రీమింగ్

‘Slaxx’ 2020లో విడుదలైన కెనడియన్ హారర్-కామెడీ సినిమా. దీనికి ఎల్జా కెఫార్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో రొమేన్ డెనిస్ (లిబ్బీ), బ్రెట్ డోనాహ్యూ (క్రెయిగ్), సెహర్ భోజానీ (శ్రుతి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 2020లో ఫాంటాసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2021లో షడ్డర్‌ (Shudder) లో స్ట్రీమింగ్ అయింది. ఇది ఒక విచిత్రమైన జీన్స్‌ చుట్టూ తిరుగుతుంది. 77 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.4/10, Rotten Tomatoes: 96% రేటింగ్ ను కలిగి ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ కెనడియన్ కాటన్ క్లాథియర్స్ (CCC) అనే ట్రెండీ ఫ్యాషన్ తో మొదలవుతుంది. లిబ్బీ మెక్‌క్లీన్ ఒక సేల్స్‌క్లర్క్, తన మొదటి రోజు జాబ్‌లో స్టోర్‌లోకి అడుగుపెడుతుంది. స్టోర్ మేనేజర్ క్రెయిగ్, శ్రుతి, హంటర్, జెమ్మా, లార్డ్ వంటి సెల్ఫ్-అబ్జార్బ్డ్ స్టాఫ్‌తో కలిసి “సూపర్ షేపర్స్” జీన్స్ లాంచ్ కోసం రాత్రిపూట లాక్‌డౌన్‌లో పనిచేస్తారు. ఈ జీన్స్ ఏ శరీర ఆకారానికైనా సరిపోతాయని ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సూపర్ షేపర్స్ జీన్స్‌ స్వయంగా కదులుతూ హత్యలు చేయడం మొదలెడుతుంది. జెమ్మా జీన్స్ ధరించగానే అవి ఆమెను నడుము వద్ద చీల్చేస్తాయి. హంటర్ కోట్ హుక్‌పై పడి చనిపోతాడు, లార్డ్‌ని జీన్స్ జిప్పర్ చీల్చి, నోటిలా మారి చంపేస్తుంది. లిబ్బీ ఈ భయంకరమైన మరణాలను గుర్తిస్తుంది. కానీ క్రెయిగ్ ప్రమోషన్ కోసం ప్రతిష్టను కాపాడుకోవాలని, పోలీసులను పిలవకుండా సైలెంట్ గా ఉంటాడు.

ఒక ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ పేటన్ జూల్స్ అనే అమ్మాయి ఫోటో షూట్ కోసం వస్తుంది. ఆమెను కూడా ఈ జీన్స్ గొంతు పిసికి చంపేస్తాయి. లిబ్బీ, శ్రుతి కలిసి ఈ జీన్స్ రక్తం తాగడం, బాలీవుడ్ సాంగ్‌కి డాన్స్ చేయడం గమనిస్తారు. శ్రుతి హిందీలో మాట్లాడితే, జీన్స్ రక్తంతో గోడపై రాస్తుంది. తమను కీరత్ అనే 13 ఏళ్ల భారతీయ చైల్డ్ లేబరర్ ఆత్మ ఆవహించిందని, ఆమె CCC కాటన్ ఫీల్డ్‌లో థ్రెషర్‌తో చనిపోయిందని తెలుస్తుంది. లిబ్బీ, శ్రుతి కీరత్ కథను బయటపెడతామని ఒప్పందం చేస్తారు. కానీ క్రెయిగ్ వాళ్లను అడ్డుకుని, జీన్స్‌పై ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగిస్తాడు. ఇంతలో మరిన్ని జీన్స్ కదులుతూ వచ్చి మనుషులను చంపుతాయి. క్రెయిగ్ శ్రుతిని చంపి, లిబ్బీని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇంతలో ఇంతలో ఈ జీన్స్ క్రెయిగ్‌ని కూడా చంపేస్తాయి. ఇక లాక్‌డౌన్ తెరవడంతో కస్టమర్లు స్టోర్‌లోకి దూసుకొస్తారు. ఆ తరువాత వచ్చే క్లైమాక్స్ భయంకరమైన టర్న్ తీసుకుంటుంది. ఈ జీన్స్ కస్టమర్లను కూడా చంపుతాయా ? లిబ్బీ ప్రాణాలతో బయటపడుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : గస్తీకి వెళ్లి హత్య కేసులో… మాజీ పోలీస్ తీసిన క్రేజీ మలయాళ మూవీ… మీరు ఇంకా చూడలేదా ?

Related News

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల అమ్మాయి… నెవర్ బిఫోర్ మిస్టరీ గేమ్… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : హైబ్రిడ్ అమ్మాయిని లైన్లో పెట్టే రైతు… కానీ కండిషన్స్ అప్లై… స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

OTT Movie : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్

OTT Movie : అన్న పాస్ట్ లవర్ తో తమ్ముడు… అండర్ వరల్డ్ తో శత్రుత్వం… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

AA22 OTT : బన్నీ – అట్లీ మూవీ ఓటీటీ డీల్… ఇండియాలోనే హైయెస్ట్ ధరకు సోల్డ్ అవుట్ ?

OTT Movie : చిన్న పిల్లలపై చెయ్యేస్తే ఈ సైకో చేతిలో మూడినట్టే… ఇలాంటి సైకోలు కూడా ఉంటారా భయ్యా

OTT Movie : అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒక్కడితోనే… లాస్ట్ కి కేక పెట్టించే కిర్రాక్ ట్విస్ట్

OTT Movie : ఊర్లో ఒక్కరిని కూడా వదలని దొర… పెళ్లి కాకుండానే అలాంటి పని… మైండ్ బెండయ్యే ట్విస్టులు

Big Stories

×