Byreddy Siddharth Reddy: కొత్త రీ ఎంట్రీ- కొత్త పదవీ. అదిరందయ్యా బైరెడ్డి. ఇదీ ప్రస్తుతం సీమ జిల్లాల్లో వినిపిస్తున్న కామెంట్. మరి అధినేత తనపై పెట్టిన బరువు బాధ్యతలకు తగిన విధంగా రియాక్టవుతారా? ఆ బాధ్యతలను సిద్ధార్ధ రెడ్డి సక్రమంగానే నెరవేర్చగలరా? ప్రస్తుతం బైరెడ్డి చుట్టూ ఉన్న రాజకీయ స్థితిగతులు ఎలాంటివి? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ లాంటి ఈ సిట్యువేషన్లో.. ఈ యూత్ కమ్ యూట్యూబ్ స్టార్ ఎలాంటి పెర్పామెన్స్ ఇవ్వబోతున్నారు? ఆ డీటైల్స్ ఏంటి?? మీరే చూడండి.
పార్టీలో ఉంటూ ఆ పార్టీ యాంటీ వాయిస్ వినిపంచే బైరెడ్డి
బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి ఎలా రాణిస్తారో అన్న ఉత్కంఠమొన్నటి వరకూ శాప్ చైర్మన్, ఇవాళ వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్. పదవి మారిందేమోగానీ.. మనిషి మాత్రం సేమ్ టూ సేమ్ డిట్టో. పైపెచ్చు జేసీ దివాకర్ రెడ్డిలా.. ఆ పార్టీలో ఉంటూ.. ఆ పార్టీపైనే యాంటీ వాయిస్ వినిపించడంలో ఎంత మాత్రం వెనకడుగు వేయడీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్.
తన కిచ్చిన పాత్రకు, ఆయన న్యాయం చేకూర్చగలరా? అన్న చర్చ
చూశారుగా అదేదో సినిమాలో భానుమతి ఒక్కటే పీస్, హైబ్రిడ్ పిల్ల. అన్నట్టు.. బైరెడ్డి ఒక్కటే పీస్- హైబ్రిడ్ పిల్లాడు. అలాంటి పిల్లాడి చేతికి ఇంత పెద్ద బాధ్యతలా? అన్నది కొందరి డౌట్- అనుమానం. అయితే యూత్ ప్రెసిడెంట్ అంటే యూత్ కి కాక సీనియర్లకయితే ఇవ్వలేరుగా అంటారు మరి కొందరు. ఏది ఏమైనా.. ఈ హైబ్రీడ్ పిల్లాడికైతే.. పెద్ద పదవే కట్టబెట్టేశారు అధినేత జగన్ రెడ్డి. దీంతో బైరెడ్డి NEXT స్టెప్ ఎలా ఉండబోతుంది? తన కిచ్చిన పాత్రకు, ఆయన న్యాయం చేకూర్చగలరా? లేదా?? అన్నదిప్పుడు సీమ సందుగొందుల్లో ఒక చర్చనీయాంశంగా తయారైందని అంటున్నారు.
బైరెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేశాడన్న టాక్
ప్రస్తుతం ఉన్న రాజకీయ పోలికలను అనుసరించి మాట్లాడితే..గతంలో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ ఎలాగో.. సరిగ్గా వైసీపీకి బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి అలాగ అనే రెడ్డి సామాజిక వర్గం వారున్నారు. తమ ఫ్యూచర్ స్టార్ బైరెడ్డే అంటున్న వారు చాలా మందే. కారణం జగన్ కంటూ వారసుల్లేరు. దీంతో బైరెడ్డి లక్కీ ఛాన్స్ కొట్టేశాడన్న మాట కూడా వినిపిస్తోంది.
బైరెడ్డి బ్రాండ్ అంబాసిడర్ తానేనంటోన్న శబరి రెడ్డి
ఇదిలా ఉంటే ఇంత పెద్ద బరువు బాధ్యతలను సిద్ధార్ధరెడ్డి నెరవేర్చగలరా? అన్నది రెండో క్వశ్చిన్ మార్క్. ఆ మాటకొస్తే బైరెడ్డి అనే ఇంటిపేరొక బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ తానే తప్ప సిద్ధార్ధ్ రెడ్డి ఎప్పటికీ కారని అంటారు సోదరి శబరి రెడ్డి. ఏది ఏమైనా.. విజయసాయిరెడ్డి నుంచి మర్రి రాజశేఖర్ వరకూ పార్టీలోని సీనియర్లంతా దాదాపు పక్కకు తప్పుకుంటున్న వేళ.. ఈ రివర్స్ యంగ్ మిస్సైల్ నే గట్టిగా నమ్ముకున్నారట జగన్ మోహన రెడ్డి. గతంలో ఆయన పార్టీకి సోషల్ మీడియాలో తెచ్చిన ఫాలోయింగ్.. లోకల్ ఎమ్మెల్యేని సైతం తనదైన వాగ్దాటితో గెలిపించిన తీరు- తెన్ను. వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్, సిద్ధార్ధ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్టు ఫ్యాన్ పార్టీ సమాచారం.
ఇటు కుటుంబమే కాదు.. అటు కేడర్ లోనూ వ్యతిరేకత గల బైరెడ్డి
అయితే ఇక్కడే అనేక అనుమానాలు. సొంత కుటుంబం నుంచి మొదలు పెడితే.. పార్టీలోని ఇతర కార్యవర్గం వరకూ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మీద ఎంతో వ్యతిరేకత ఉందంటారు. సిద్ధార్ధ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయిన పరిస్థితి. అంతేనా తన సోదరి శబరిరెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు. ఆమె సాక్షాత్ చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమైన దుస్థితి వెరసీ. ఇటు గోడ దెబ్బ- అటు చెంపదెబ్బలాంటి సిట్యువేషన్. అందుకే ఆయన ఇన్నాళ్ల పాటు.. గప్ చుప్ అయినట్టు సొంత పార్టీలోనే మాట్లాడుకుంటున్నారట. సిద్ధార్ఢ రెడ్డికి కూడా శ్రీకృష్ణజన్మస్థానం తప్పదనే భావిస్తున్నారట. దానికి తోడు సోదరి శబరి సైతం సిద్ధార్ధ రెడ్డి ఇంటిపేరుతో సహా ఊడబెరికి ఊచల్లెక్కించడం ఖాయంగా చెబుతుండటంతో.. ఇదంతా నిజం కావచ్చని పార్టీలో గుసగుసలాడుతున్నారట.
బైరెడ్డిపై కార్యకర్తలను పట్టించుకోడనే ఆరోపణ
కొందరు చెప్పే మాటలను బట్టీ చూస్తే.. అధికారం పోగానే దాక్కున్న బైరెడ్డికి ధైర్యం చెప్పి.. కనీసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడైనా కనిపించమని ఎవరో వెనకుండి ఎగదోసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఫీజు పోరులో ఆయన పాల్గొని ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. అయితే బైరెడ్డి.. తనకంటూ ఒక ధైర్యం, పార్టీ నుంచి భరోసా అవసరం అనడంతో.. ఈ పదవి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో బైరెడ్డి తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్టు చెబుతున్నారు.
యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి న్యాయం చేయగలరా అన్న డౌట్
దానికి తోడు బైరెడ్డి మీదున్న మరో కామెంట్ ఏంటంటే.. కార్యకర్తలను ఎంత మాత్రం పట్టించుకోడని అంటారు. అంతా నా ఇష్టం అనే తలపొగరు ప్రదర్శిస్తారన్న పేరుంది. వీటన్నిటిని బట్టీ చూస్తే బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి.. తన కిచ్చిన యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తగిన న్యాయం చేయగలరా? అన్న అనుమానం ఇటు ప్రత్యర్ధి పార్టీలకే కాదు.. అటు సొంత పార్టీ లీడర్లలోనూ ఉందని అంటారు.
ఇంటిపేరుకున్న ఇమేజిని చూసే ఈ పదవి?
అయితే ఇదంతా సిద్ధార్ధ రెడ్డి, ఆయన నాయకత్వ నాయకత్వానికి సంబంధించిన వ్యవహారం కానే కాదంటారు మరికొందరు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే శేషశయనా రెడ్డి కాలం నాటి నుంచి ఇంతింతై అన్నట్టు పెరుగుతూ వచ్చిందా ఇంటిపేరు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధినేత జగన్, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టారనే మాట వినిపిస్తోంది. ఈ విషయం ముందుగా గమనించిన సోదరి బైరెడ్డి శబరి రెడ్డి.. ఆ ఇంటి పేరుకు, సిద్ధార్ధరెడ్డికి.. ఎలాంటి సంబంధం లేదంటూ పుష్ప సినిమాలో హీరోని ర్యాగింగ్ చేసినట్టు చేస్తున్నారనీ అంటారు. దీంతో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నాయకత్వ పటిమపై ఇటు అభిమానులు, అటు కార్యకర్తల్లో అనుమానాలు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం.
నందికొట్కూరు నుంచి బైరెడ్డిని బరిలోకి దింపే ఛాన్స్
ఇందులో మరో స్ట్రాటజీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే డీలిమిటేషన్లో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ నుంచి జనరల్ కేటగిరిలోకి మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ నుంచి బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిని బరిలోకి దింపనున్నారనీ అంటారు. అందుకే ఈ జూనియర్ బైరెడ్డికి- బూస్టింగ్ ఇవ్వడంలో భాగంగా ఈ పదవిని బిస్కెట్ వేశారన్న టాక్ ఒకింత ఓపెన్ గానే వినిపిస్తోంది.
పార్టీ పవరు పోయిన వెంటనే అజ్ఞాతంలోకి బైరెడ్డి
దానికి తోడు సిద్ధార్ధ రెడ్డికి ఇటు యూత్ స్టార్ గా మాత్రమే కాకుండా అటు యూట్యూబ్ స్టార్ గానూ పేరుంది కాబట్టి.. పార్టీ పై ఆయనెంత నెగిటివ్ కామెంట్లు చేసినా.. కార్యకర్తలను ఎంత దగ్గరకు చేర్చకున్నా సరే.. ఆ క్రేజ్ ని ఎలాగైనా సరే క్యాష్ చేసుకోవాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అందువల్లే యూత్ వింగ్ పోస్టు ఇచ్చినట్టుగానూ చెప్పుకుంటున్నారు.
అలాంటి వారికి పదవి కట్టబెట్టడంలో అర్ధమేంటన్న చర్చ
ఇటీవల పెద్ద పెద్ద లీడర్లే.. కూటమి ప్రభుత్వానికి భయపడి అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోతుంటే.. బైరెడ్డి లాంటి యంగ్ అండ్ డైనమిక్ అవసరం పెద్ద ఎత్తున ఏర్పడిందన్న మాట వినిపిస్తోందోపక్క. దీన్ని బట్టీ ఆయనకీ పదవి కట్టబెట్టారని అంటారు. మరలాంటపుడు పార్టీ పవరు పోయిన వెంటనే సిద్ధార్ధ రెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లలేదా? అలాంటి వారికి- ఇలాంటి పదవి ఇవ్వడంలో అర్ధమేంటన్న కామెంట్లు సైతం పేలుతున్నాయట. అయితే అధిష్టానం మాత్రం యువనేతను ఎలాగైనా సరే యాక్టివ్ చేయాలన్న ఆలోచన చేస్తోందట. అందుకే ఈ పదవినిచ్చారట.
ఈ యువనేత స్థాయికి మించి జాక్ పాట్ కొట్టేశాడనే టాక్
ఇటు పోసాని నుంచి అటు బైరెడ్డి వరకూ గత వైసీపీ హయాంలో ఫాలో అయిన ఒకే ఒక్క మాట. ప్రత్యర్ధి టీడీపీని తిట్టు- పసందైన పదవిని చేపట్టు. అధికారం కోల్పోయాక.. కొందరు పార్టీని వీడగా.. మరి కొందరు జైలు పాలవడంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడింది వైపీసీ. ఉన్నవాళ్లకే మంచి పదవులిచ్చి.. వారి ద్వారా తిరిగి ఫ్యాన్ పార్టీని ఫామ్ లోకి తీసుకురావాలని స్కెచ్ వేసిందనీ అంచనా. అందులో భాగంగానే ఈ యువనేత తన స్థాయికి మించి జాక్ పాట్ కొట్టేశారనీ అంటున్నారు.
అత్యంత త్వరలోనే జనంలోకి జగన్ మోహన రెడ్డి
ఎట్టకేలకు అధికారం కోల్పోయి ఏడాది కాలం కావస్తున్న ఈ తరుణంలో.. పార్టీలో కొందరికి కీలక పదవులు కట్టబెట్టడంలో భాగంగా యువరాజ పట్టాభిషేకం జరిగిందనీ చెబుతున్నారు. గ్రౌండ్ లెవల్లో పార్టీకి మంచి ఆదరణ లభించాలంటే ఇలాంటి వారే కరెక్టని జగన్ భావించారనీ అంటున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసి ఉంటుందనీ అంచనా వేస్తున్నారు. అలాగని కేవలం బైరెడ్డికి మాత్రమే ఇచ్చినట్టు కనిపించకుండా ఆయనతో పాటు మరికొందరికి మరికొన్ని పదవులు కట్టబెట్టారట. వీటితో పాటు.. మరింత నమ్మబలికేలా.. కొత్త క్రమశిక్షణ కమిటీని సైతం ప్రకటించారట.
ఆడుదాం ఆంధ్రపై పలు చోట్లు ఫిర్యాదులు..
ఇవన్నీ ఇలా ఉంటే.. అసెంబ్లీకి వెళ్లడానికి ససేమిరా అంటోన్న జగన్ రెడ్డి.. జనంలోకి రాబోతున్నారట. అందుకంటూ ఒక ముహుర్తం ఖరారు చేశారట. ఈ పరిస్థితుల్లో కొన్ని పదవులు భర్తీ చేస్తే ఆ ఊపే వేరన్న కోణంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బూస్టింగ్- ఫార్ములా ఎంత మేరకు వర్కవుట్ అవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం తేలాల్సి ఉంది.
ఈ సిట్యువేషన్లో బైరెడ్డి అంత యాక్టివ్ గా ఉండగలరా?
ఇదిలా ఉంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరిట వంద కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డట్టు పలు చోట్ల కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అప్పట్లో శాప్ చైర్మన్ గా పని చేసిన సిద్ధార్ధ రెడ్డి సైతం ఈ కేసుల్లో అరెస్టయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు కొందరు. ఈ భయాందోళనల నడుమ.. యువజన విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండగలరా? సొంత సోదరి నుంచి కూడా థ్రెట్ ఎదుర్కుంటున్న ఈ సిద్ధార్ధుడు.. ఎలాంటి తడబాటు లేకుండా ఈ బాద్యతలను నిర్వహించగలరా? అన్నది అనుమానమేనంటారు ఇంకొందరు.
బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి ఎలా రాణిస్తారో అన్న ఉత్కంఠ
అరెస్టయినా కాకున్నా.. తనకిచ్చిన పదవికి బైరెడ్డీ జూనియర్ తగిన న్యాయం చేస్తారన్న ధైర్యంతోనే పార్టీ పదవినిచ్చిందనీ అంటారు కొందరు. దీంతో సిద్ధార్ధ రెడ్డి ఖచ్చితంగా తన టాలెంట్ చూపించాల్సి ఉంటుందనీ అంచనా వేస్తున్నారు. ముందు నుయ్యి- వెనక గొయ్యిగా ఉన్న ఈ సిట్యువేషన్లో ఈ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ యూట్యూబ్ స్టార్ ఎలా రాణిస్తారో తేలాల్సి ఉందంటున్నారు పలువురు. మరి చూడాలి. ఈ కష్టకాలం నుంచి తాను బయట పడి, పార్టీకి ఎలాంటి సేవలందిస్తారో తేలాల్సి ఉందన్న కామెంట్లు చేస్తున్నారు సగటు వైసీపీ అభిమానులు.