Telangana Ugadi panchagam: తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందన్నారు పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి. వ్యాపారులకు మంచి రోజులు వస్తున్నట్లు వివరించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇబ్బంది పెడతాయని, నిధుల కోసం ప్రభుత్వం కృషి చేసి సాధించుకుంటుందన్నారు.
ఆదివారం ఉదయం ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత రెడ్డితోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. విద్యం, వైద్యానికి ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
తెలుగు రాష్ట్రాలు సీఎంలు పోటీ పడి పరిపాలన కొనసాగిస్తారని వెల్లడించారు. నీళ్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయన్నది ఆయన మాట. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎలాంటి ఇబందులు లేకుండా పరిపాలన సాగుతుందన్నారు. గతం కంటే మెరుగ్గా ఈసారి పాలన కొనసాగిస్తుందన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు.
ఆదివారం తెలంగాణ ప్రజలు చుక్క, ముక్క ముట్టకపోతే, తెలంగాణ ప్రజలకు అంత మంచి జరుగుతుందన్నారు. అలాగే ఆరోగ్యంగా ఉంటారని వెల్లడించారు. తెలంగాణా వర్షాలు బాగా పడతాయిని, పంటలు కాపాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి తెలివితో ధన ధాన్యాలకు లోటు ఉండదన్నారు.
ALSO READ: హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స మార్పు.. చివరి ట్రైన ఎప్పుడంటే
కాకపోతే సోషల్ మీడియా ప్రజలను భయపెడుతుందన్నారు. ఈ విషయంలో ఆచి తూచి అడుగు వెయ్యాలని అన్నారు పండితులు సంతోష్ కుమార్ శాస్త్రి. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించాలని అన్నారు. సంక్షేమం-అభివృద్ధి సమపాళ్లల్లో ఉండాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆర్థికమంత్రి భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితంగా ఉందన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. జీవితంలో పెట్టుకున్న సంకల్పం ఇంతవరకు ఎప్పుడూ ఫెయిల్ కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుందన్నారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వం సంకల్ప బలంలో దోషం లేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలబెడతామన్నారు. అందుకే రైజింగ్ 2050 అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు చె్పారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ విధానమన్నారు.
తెలంగాణ రైజింగ్ అంటూ దేశంలో తెలంగాణ ఒక వెలుగు వెలగాలన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్నారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలని, అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు. ఫ్యూచర్ సిటీ పెట్టుబడుల నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
దేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు పేదలకు సన్న బియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచిందన్నారు.
రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నామని, ఆదాయం పెంచి దాన్ని పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానమన్నారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని, ఇది అభివృద్ధి చేసే సందర్భమన్నారు. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉందన్నారు.