BigTV English

TDP VS YSRCP: ఆర్కేతో జగన్ ప్లాన్.. అమరావతి ప్రజలు నమ్ముతారా?

TDP VS YSRCP: ఆర్కేతో జగన్ ప్లాన్.. అమరావతి ప్రజలు నమ్ముతారా?

TDP VS YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయ్. అన్ని రకాల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తోంది కూటమి సర్కార్. ఈ పరిణామం ఆంధ్రా రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారింది. అమరావతి పనులు మొదలయ్యాక.. రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశానికి పొలిటికల్‌గా మంచి మైలేజ్ వచ్చింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో.. క్యాపిటల్ ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంది. ఇప్పుడు.. తాడికొండలో టీడీపీ ఉన్నంత బలంగా వైసీపీ లేదనే చర్చ జరుగుతోంది. దీనికి చెక్ పెట్టాలంటే.. తప్పకుండా కొత్త అడుగులు వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే చర్చ మొదలైంది. తెలుగుదేశాన్ని వీక్ చేసేందుకు.. మళ్లీ పొలిటికల్ లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు వైసీపీ చేస్తున్న ఆలోచనేంటి?
మార్పు కావాలి! ఆర్కే రావాలి!


రాజధాని నిర్మాణాలపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా.. ఇప్పుడు అమరావతి గురించే మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి.. తాత్కాలిక నిర్మాణాలతో పాటు పర్మినెంట్ నిర్మాణాలపై దృష్టిపెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ ఏపీకి రావడం, అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో పాల్గొనడంతో.. రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో.. రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో విధ్వంసం జరిగిందని.. వాటన్నింటిని సరిచేస్తూ.. అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ అడుగులు వేస్తోందని చెబుతున్నారు. అమరావతి పనుల సంగతి పక్కనబెడితే.. ఇదే ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కీలకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయ్.


తాడికొండలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన

రాజధాని నిర్మాణాలతో పాటు అమరావతి అంశాలపైనా టీడీపీ దృష్టి పెడుతున్న పరిస్థితులున్నాయ్. గతానికి భిన్నంగా పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచన.. తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఇటీవలే తాడికొండ నియోజకవర్గం కార్యకర్తలతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ సమావేశంలో తాడికొండ సెగ్మెంట్.. టీడీపీకి కీలకంగా ఉండాలనే విధంగా దిశానిర్దేశం చేశారట. దాంతో.. ఈ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండాలనే ఆలోచనలో పసుపు పార్టీ అధిష్టానం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా.. అమరావతి ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కావడంతో.. తాడికొండపై టీడీపీ కాస్త ఎక్కువే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.

మంగళగిరిలో టీడీపీ పటిష్టంగా ఉండేలా లోకేశ్ ఫోకస్

మరోవైపు.. మంగళగిరిలోనూ నారా లోకేశ్ పార్టీ పటిష్టంగా ఉండేవిధంగా ఆలోచనలో చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పర్మినెంట్‌గా గెలిచేలా పరిస్థితుల్ని మార్చేయాలని చూస్తున్నారట. ప్రతికూల పరిస్థితులన్నింటిని.. టీడీపీకి అనుకూలంగా మార్చేలా.. లోకేశ్ దృష్టిపెడుతున్నారట. రాజధాని ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు, మండలాలు.. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయ్. అత్యంత కీలకంగా ఉన్న ప్రాంతాలు.. మంగళరిగి నుంచే ప్రారంభమవుతుండటంతో.. రాజధాని ప్రాంతానికి మంగళగిరితో కీలక సంబంధాలు ఉంటాయ్. కాబట్టి.. ఈ నియోజకవర్గంలో పర్మినెంట్‌గా టీడీపీ జెండానే ఎగరాలనే విధంగా.. నారా లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.

రాజకీయంగా బలపడేందుకు వైసీపీ కీలక నిర్ణయాలు

రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం దూకుడుగా ముందుకు వెళుతుండటంతో.. వైసీపీ కూడా రాజకీయంగా బలపడేందుకు కీలక నిర్ణయాలు తీసుకబోతోందని అంతర్గతంగా చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో.. మంగళగిరిని, తాడికొండని టార్గెట్ చేస్తూ.. కీలకంగా ముందుకు వెళ్లాలని, పార్టీని పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే బాగుంటుందని.. అధిష్టానం దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీలో ఇప్పుడున్న నేతలు కూడా దూకుడుగా వ్యవహరించకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనకపోవడం కొంత మైనస్‌గా మారిందట. దాంతో.. గతంలో ఉన్న పరిస్థితుల్ని.. మళ్లీ వైసీపీ వైపు తీసుకొచ్చేందుకు.. పాత నేతలను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నాయకత్వం ఉందట.

ఆర్కేని యాక్టివేట్ చేసే ఆలోచనలో వైసీపీ

ఇందులో భాగంగానే.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్‌ మీదకు తీసుకురావాలనే ఆలోచన వైసీపీ చేస్తోందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాడికొండ, మంగళగిరిలో.. వైసీపీ పటిష్టంగా ఉండాలంటే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి సరైన నాయకుడని.. పార్టీ నేతలు చెబుతున్నారట. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆర్కే.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చారు. ప్రస్తుతానికి రాజకీయంగా సైలెంట్ అయిన ఆర్కేని.. మళ్లీ యాక్టివేట్ చేసే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also Read: పీసీసీ కొత్త కార్యవర్గం లిస్ట్ ఇదేనా?

ఇప్పటికే 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు

ఇక.. అమరావతి విషయంలో ఇంకా రైతుల్లో అసంతృప్తి ఉందని వైసీపీ భావిస్తోందట. ఇప్పటికే 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా.. మరో 40 వేల ఎకరాల భూముల సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందంటున్నారు. ఇది.. అమరావతి రైతులకు నచ్చడం లేదనేది వైసీపీ ఆలోచన. మరోవైపు.. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని, భద్రతాపరంగా ఇబ్బందులొస్తాయని విమర్శిస్తున్నారు. ఇలా.. అమరావతి విషయంలో పైకి కనిపించే అంశాలే కాకుండా.. లూప్ హోల్స్‌ని పట్టుకొని స్థానికంగా వైసీపీ నాయకత్వాన్ని బలపరిచేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో ఆర్కేకు టికెట్ ఇవ్వని వైసీపీ

అయితే.. ఆర్కే మాత్రం పాలిటిక్స్ పట్ల అంత ఇంట్రస్టింగ్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా ఓటమిపాలయ్యారు. రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయ్. దాంతో.. ఎందుకొచ్చిన రాజకీయమంటూ.. తన పని తాను చేసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆయనకే మళ్లీ మంగళగిరి వైసీపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించి.. ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేది వైసీపీ ప్లాన్ అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇది.. ఏ మేరకు వర్కవుట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×