CM Revanth Reddy: లిస్ట్ రెడీపోయిందట. అందులో ట్విస్టులే.. ఏ రేంజులో ఉంటాయో.. ఎవ్వరికీ తెలియట్లేదు. కొత్త పీసీసీ కార్యవర్గంపై కసరత్తు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యత ఉండేలా.. కార్యవర్గం జాబితా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ నుంచి రాగానే.. కీలక ప్రకటన రాబోతోందనే చర్చ పార్టీలో జోరందుకుంది. ఇప్పటికే.. ఆయన కూడా ఇదే నెలలో కమిటీల ఏర్పాటు ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి.. కార్యవర్గంలో ఎర్త్ ఎవరికి? బెర్త్ ఎవరికి?
పీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటనకు కౌంట్‌డౌన్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇంకొన్ని రోజుల్లోనే.. పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. దాంతో.. పీసీసీ నూతన కార్యవర్గంపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే నెలలో.. ఢిల్లీ నుంచి లిస్ట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో.. గతంలో మాదిరిగా జంబో ప్యాక్ కాకుండా.. తక్కువ మంది నాయకులతో.. వారికి తగిన ప్రాధాన్యతలతో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. అన్ని సామాజికవర్గాలకు తగినట్లుగా.. ప్రాధాన్యత లిస్ట్ రూపొందుతున్నట్లు సమాచారం. గత పీసీసీ కార్యవర్గంలో ఐదుగరు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఉండేవారు.
కొత్త కార్యవర్గంలో నలుగురే వర్కింగ్ ప్రెసిడెంట్‌లు!
కానీ.. కొత్త కార్యవర్గంలో నలుగురు సభ్యులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ల కోసం పోటీపడుతున్న వారిలో.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు.. ఎస్సీ సామాజికవర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటా నుంచి నాంపల్లిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్, మహిళా కోటా నుంచి గద్వాల్ నేత సరిత తిరుపతయ్య పేర్లు చర్చకు వస్తున్నాయ్.
గత కార్యవర్గంలో 90 మంది ప్రధాన కార్యదర్శులు
ఇక.. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి.. గత కార్యవర్గంలో జంబో ప్యాక్ మాదిరిగా.. సుమారు 90 మంది సభ్యులు ఉండేవారు. ఈసారి ఆ సంఖ్యను కుదించబోతున్నారనే చర్చ సాగుతోంది. కొత్త కార్యవర్గంలో జిల్లాకు ఇద్దరిచొప్పున.. పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేసేవారికి అవకాశం కల్పించనున్నట్లు.. గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. వీటితో పాటు పీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల విషయంోలనూ.. ఆచితూచి లిస్ట్ తయారవుతున్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి పోస్టులపైనా పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: విజయనగరం జిల్లాలోజనసేనకు దిక్కెవరు?
అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టులు ఆధారంగా పోస్టులు
ప్రధానంగా.. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. పీసీసీ తీసుకోబోయే నిర్ణయం ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికే.. పీసీసీ అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాలవారీగా.. నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టులతో.. పోస్టులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నూతన పీసీసీ కార్యవర్గం కమిటీ.. ఇంకొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కమిటీ.. లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానే ఉపయోగపడుతుందనే చర్చ కూడా మొదలైంది. వీలైనంత త్వరగా.. పార్టీ పదవులు అప్పజెబితే బెటరని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.