KA Paul: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కాస్త శాంతించారు. కోట్లాది మందిని మోసం చేసిన ఆ ఎయిర్‌లైన్స్‌పై న్యాయస్థానం తలుపు తడతానని అంటున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం వదిలేది లేదని కుండబద్దలు కొట్టేశారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆయన కూల్‌గా మాట్లాడుతూ కనిపించారు.
శాంతి దూత కేఏ పాల్ గురించి చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా అమెరికాలో ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. ఆ మధ్య రాజకీయ పార్టీ పెట్టి నేతలు తన మాటల బాణాలతో హడలెత్తిస్తున్నారని ఆయన మద్దతుదారులు తరచూ చెబుతుంటారు. ట్రెండ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంతో ఆయన సిద్ధహస్తుడు.
ఏ విషయమైనా తెలిసిందంటే వెంటనే అక్కడ వాలిపోతారు కూడా. జిల్లా.. రాష్ట్రమా? దేశమా ఏదైనా కావచ్చు. ఏమైనా అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనోడంటూ ఒకటే డప్పు కొడుతుంటారు. ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవుతారో అర్థకాక చాలామంది ఇబ్బందిపడిన సందర్భాలు లేకపోలేదు.
రాజకీయ పార్టీ పెట్టిన ఆయన, ఎన్నికల సమయంలో ప్రజల మధ్య కనిపిస్తారు. ఆ తర్వాత షరా మూమాలే. నిత్యం టీవీల్లో కనిపించేందుకు ఊబలాటపడతారు. ఆదివారం ముంబై ఎయిర్‌పోర్టులో ఆయనను ఇండిగో అధికారులు కాసేపు ఆపారు. అప్ కోర్సు.. కారణాలు ఏమైనా కావచ్చు. లేకపోతే ఏమైనా పేపర్స్ మరిచిపోయారో తెలీదు. ఎయిర్‌పోర్టులో అధికారులపై రుసరుసలాడారు. తనను ఎందుకు ఆపాలరో చెప్పాలని కోరారు.
ALSO READ: విడదల రజినీకి కోలుకోలేని దెబ్బ
ఆ తర్వాత ఆయన టర్కీ వెళ్లి వచ్చిన తర్వాత కూల్‌గా మాట్లాడుతూ కనిపించారు. బాయ్‌కాట్ ఇండిగో అంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు కేఏ పాల్. భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు, శిఖరాగ్ర సమావేశానికి వెళ్లకుండా ఇండిగో అధికారులు తనను అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. 18 ఏళ్లుగా ఆ ఎయిర్ లైన్స్ సంస్థ తనమాదిరిగా కోట్లాది మందిని మోసం చేసిందని వాపోయారు. ఆ ఎయిర్ లైన్స్‌పై కోర్టుకు వెళ్తానని, ఏ మాత్రం వదిలే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు.
తన దగ్గరు పాస్‌పోర్టు, గ్రీన్ కార్డు ఉందని, టర్కీ వీసా ఉందన్నారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో అధికారులకు అన్నీ తెలుసన్నారు. డాక్యుమెంట్లు లేవని చెప్పి తనను ఆపారని మనసులోని మాట బయటపెట్టారు. ఇండియా, పాకిస్తాన్ నేతలతోపాటు ముఖ్యంగా అమెరికా నేతలతో మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
టర్కీ ఇచ్చిన మిస్సైళ్లతో పాకిస్తాన్ తమపై ప్రయోగించిందన్నారు. టర్కీ నుంచి తాను పాకిస్తాన్ కు వెళ్తానని తెలిసి తనను ఎయిర్‌పోర్టులో ఆపారని తెలిపారు. తానంటే అధ్యక్షులకు, ప్రధాని భయం ఎందుకని అన్నారు. తనను ఎయిర్‌పోర్టులో ఆపడం ఆ వ్యవహారం అంతర్జాతీయ సమస్యగా మారిందని వెల్లడించారు. మరి కేఏపాల్ నెక్ట్స్ అడుగులు ఎటో చూడాలి.
బాయ్ కాట్ ఇండిగో అంటూ ఎక్స్ లో కే.ఏ.పాల్ పోస్ట్..
భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు, శిఖరాగ్ర సమావేశానికి వెళ్లకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ అడ్డుకుంది
18 ఏళ్లుగా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఇండిగో కోట్లాది మందిని మోసం చేసింది
ఇండిగో ఎయిర్ లైన్స్ పై కోర్టుకు వెళ్తాను.. వదిలే ప్రసక్తే లేదు… pic.twitter.com/yP5wR6YdaH
— BIG TV Breaking News (@bigtvtelugu) May 12, 2025