BigTV English

AP Politics: కమ్మ వర్సెస్ రెడ్డి.. ఏపీలో రాజకీయ పోరు

AP Politics: కమ్మ వర్సెస్ రెడ్డి.. ఏపీలో రాజకీయ పోరు

AP Politics Caste Equations: ఉన్నట్టుండి జగన్‌ ఓ సామాజిక వర్గానికి భుజానికి ఎత్తుకోవడం ఎంటనే చర్చ ఏపీలో జోరుగా నడుస్తోందట. వైసీపీ కమ్మ నాయకులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న పరిస్ధితి. రాజకీయ వ్యూహంలో భాగంగానే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక మరేదైనా కారణముందా? అన్నది సస్పెన్స్‌గా మారింది.


APలో కమ్మ, రెడ్డి మధ్య రాజకీయ పోరు

అధికారంలో ఉండగా YCP కమ్మవారిని పట్టించుకోలేదు- టీడీపీరాజకీయాలు కులప్రాతిపదికనే నడుస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఏపీలో రాజకీయాలను బలమైన సామాజిక వర్గాలే శాసించే పరిస్ధితి. ఉమ్మడి ఏపీలోను రెండు సామాజిక వర్గాల అధిపత్యమే నడిచింది. విభజనాంధ్రలోనూ ఈ రెండు సామాజిక వర్గాల అధిపత్యమే నడుస్తోంది. అవే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు.. ఈ రెండు వర్గాలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అధికారం కోసం పోటీ కూడా ఈ రెండు వర్గాల మధ్యే ఉంటూ వస్తుంది. అయితే ఎంత పోటీ ఉన్నా టీడీపీలోనూ రెడ్లు ఉన్నారు. వారు మంచి పదవులు అందుకుంటూ వచ్చారు. అయితే జగన్‌ తాజాగా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


వైసీపీలోని కమ్మవారిని కావాలనే టార్గెట్ చేస్తున్నారు- జగన్

కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, జైళ్లలో వేస్తోందని విమర్శించారు జగన్. వైసీపీలో కమ్మ నాయకులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, ఎంవీవీ సత్యనారాయణ, అబ్బయ చౌదరి, బ్రహ్మ నాయుడు, పోసాని కృష్ణమురళి, ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కమ్మ వాళ్లు వైసీపీలో ఉంటే అభ్యంతరమా? కమ్మ సామాజిక వర్గం ఊడిగం చేయడానికే పుట్టిందా? అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. జగన్‌ లెవనెత్తిన అంశాలపై ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీసింది. టీడీపీ నాయకులు జగన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జగన్ కుల రాజకీయాలను రెచ్చగొడుతూ, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ సామాజిక వర్గం మద్ధతు కంపల్సరీ

గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లు సాధించడంలో కమ్మ సామాజికవర్గం మద్దతు తప్పనిసరి. ఇక 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. అమరావతి రాజధానిని వ్యతిరేకించేలా మూడు రాజధానులు నినాదం అందుకోవడంతో.. ఆ సామాజిక వర్గంలోనూ వ్యతిరేకత మొదలైంది. అంతే కాదు కమ్మ వారికి మొదటి సారి కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి.. రెండోసారి విస్తరణలో అసలు మంత్రి పదవి లేకుండా వైసీపీ వ్యవహారించింది. రాజకీయ నాయకులే కాదు ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారుల పోస్టింగ్‌ల విషయంలోను దూరం పాటించింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన అధికారులకు ముఖ్యమైన పోస్టింగ్‌ల నుంచి తొలగించి.. వారికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పెట్టుకుని రాజకీయంగా వైసీపీ నష్టపోయింది అన్నది విశ్లేషకుల మాట.

ఓదార్పు యాత్రల పేరిట కమ్మ వారిని ఆకట్టుకునే యత్నం?

ప్రస్తుం జగన్ చేసిన ఈ కమ్మ కామెంట్లు ఏపీలో వాడీ వేడీ చర్చకు తెరలేపాయి. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల గడువు ఉండగానే ఏపీలో ఓట్ బ్యాంక్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయనే చర్చ స్టార్ట్ అయింది. అందుకు జగన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అన్న మాట వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. పార్టీ తిరిగి బలపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఓ వైపు పరామర్శల పేరిట జిల్లాలకు వెళ్లుతున్న జగన్.. కమ్మ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 2029లో అధికారం దక్కించుకోవాలని వైసీపీ ఇప్పుటి నుంచి పావులు కదుపుతోందని అంటున్నారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, అధికారులను పట్టించుకోలేదని టీడీపీ వాదన.

అధికారంలో ఉండగా YCP కమ్మవారిని పట్టించుకోలేదు- టీడీపీ

ఏది ఏమైనా జగన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాసటగా నిలుస్తూ చేసిన ప్రకటన మాత్రం వైసీపీకి మేలు చేస్తుందా.. లేదా అనేది భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంది.

Story By Adinarayana, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×