Gundeninda GudiGantalu Today episode june 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని రవి, శృతిని ఇక్కడే ఉండేలా చెయ్యాలి అని అంటుంది శోభా.. అదేంటి నీ పిచ్చి గానీ ఆ రవి పేరెంట్స్ ను వదిలి ఉండడు కదా అని సురేంద్ర అంటాడు. బాలు ఉంటే గొడవలు జరుగుతాయి. వాడిని లేకుండా చేసి రెచ్చగోడితే గొడవ పెద్దది అవుతుంది. ఇక రవి, శృతిలు శాశ్వతంగా ఇక్కడే ఉంటారు. నేను అదంతా చూసుకుంటాను అని అంటారు.. ఏం చేస్తావో ఏమో అని సురేంద్ర అంటాడు. బాలు మీనా కారు కొణించిందనే ఆనందంతో మీనా తో సరదాగా గడపాలని అనుకుంటాడు. కానీ మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అని మల్లెపూలు మీనాక్షిస్తాడు. మీనా నా చేతికి ఇవ్వడం ఎందుకు మీరే పెట్టొచ్చుగా అని అంటుంది. హల్వా మనోజ్ తినడంతో ఫీల్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి శృతి తో కలిసి బిర్యానీ తిని రాత్రంతా ఇబ్బందులు పడుతుంది. కడుపు ఉబ్బరం సంగతి ఏమోగానీ సత్యం మాత్రం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇస్తాడు. శృతితో పోటీ పడి మరితిన్న బిర్యానీ అరగక అవస్థతో ప్రభావతి హాల్లోకి వస్తుంది. అప్పుడే మూడ్‌లోకి వచ్చిన బాలు ప్రభావతి విజిల్ కొట్టుకుంటూ రావడంతో ఆగిపోతాడు. హాల్లో ప్రభావతి నడుస్తూ ఉంటుంది. దాంతో మొత్తానికి బాలు మీనా ఫస్ట్ నైట్ ప్లాన్ చెడిపోతుంది. ప్రభావతి అటు ఇటు నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. బాలు ఏమైందో చెప్పు అని అడుగుతాడు. ప్రభావతి మండిపడుతుంది ఇక పరిస్థితిని అర్థం చేసుకున్నా మీనా వేడి నీళ్లు జిలకర ఇవ్వడానికి వంట గదిలోకి వెళుతుంది.
రాత్రంతా అజీర్తి సమస్యతో ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే అందరూ ప్రభావతి చుట్టూ చేరి గ్యాస్ సమస్యను ఎలా పోగొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు నా సమస్యకు పరిష్కారం చూసేవారే లేరని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. సందులో సడేమియా అని కామాక్షి వైద్యం పేరుతో ప్రభావతిని పిడుగుతులు గుద్దుతుంది.. ఇక చివరికి బాలు రోకలి వైద్యం చేస్తాడు. రోకల్ తీసుకుని పరిగెత్తుకుంటూ ప్రభావతి మీదకు రావడంతో ప్రభావతి ఒక్క ఎగురుతో టేబుల్ పైన ఎక్కుతుంది.
నాకు గ్యాస్ సమస్య పోయింది ఇప్పుడు ఆకలేస్తుంది అని అంటుంది. బాలు మాత్రం ప్రభావతి మీద లెగ్ పీస్ సెటైర్లు వేస్తూ ఉంటాడు. నీకు ఆ తర్వాత ప్రభావతి కిందకు వస్తుంటే శోభన ఇంట్లోకి వస్తుంది. ఇంటికి వచ్చి శ్రుతికి నల్లపూసల కార్యక్రమం చేయాలనుకుంటున్నట్లు చెబుతుంది. శృతికి పెళ్లి అయి ఇంతకాలం అయినా మీరైన నల్ల పూసలు గుచ్చి పుస్తెలతాడు వేయలేదు. ఆ నల్లపూసలు గుచ్చే వేడుకనే గ్రాండ్‌గా అందరిని పిలిచి చేయాలని అనుకుంటున్నాం అని శోభన చెబుతుంది. శృతి, రోహిణి నల్లపూసలు గుచ్చి ఇస్తే బాగుంటుందేమో అని ప్రభావతి అంటుంది. ఇద్దరికి ఒకేసారి ఆ వేడుక జరిపించేద్దాం అని శోభన అంటుంది. శృతితో పాటుగా రోహిణికి కూడా తల్లిలా శోభన నల్లపూసల వేడుక చేయిస్తానని చెబుతుంది. అనంతరం మరోసారి ఇంటికి వచ్చిన శోభన బాలు ఈ ఫంక్షన్‌కు రాకూడదు అని చెబుతుంది.. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే ఈ ఫంక్షన్ జరుగుతుందని శోభా అంటుంది.
ఇక బాలు ఉంటే ఎక్కడ గొడవలు జరుగుతాయని ప్రభావతి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఈ విషయాన్ని బాలు తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. శృతి వాళ్ళ అమ్మ నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయాలని అనుకుంటుందండి అని ఉంటుందండి అని ప్రభావతి సత్యంతో అంటుంది. వాడు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. అందుకే రాకపోవడమే మంచిది అని అంటుంది.
Also Read: పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. ఆ ఒక్కటి వెరీ కాస్ట్లీ..!
వాడు ఫంక్షన్ లో ఉంటే ఎంత గొడవ జరుగుతుందో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు అందుకే పని వద్దని చెప్పారు అని ప్రభావతి అంటుంది. తన ఇంటి పరువుని ఎందుకు బాలు తీస్తాడు నువ్వెందుకు వేరేలా ఆలోచిస్తున్నావు అని సత్యం క్లాస్ పీకుతాడు.. ప్రభావతి ఎంత చెప్పినా కూడా సత్యం మాత్రం ప్రభావతి మాట వినడు.. ఇక ప్రభావతి చేసేది ఏమీ లేక నిల్చుని ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..