BigTV English

OTT Movie : మనుషుల మాంసంతో పండగ చేసుకునే ఊరు… ఒక్క పొరపాటుతో బుక్కయ్యే ఫ్యామిలీ… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : మనుషుల మాంసంతో పండగ చేసుకునే ఊరు… ఒక్క పొరపాటుతో బుక్కయ్యే ఫ్యామిలీ… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే హాలీవుడ్ సినిమాలకి అదే రేంజ్ లో అభిమానులు కూడా ఉన్నారు. భాష అర్థం కాకపోయినా, ఈ సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా స్టోరీ ఒక దీవిలో జరుగుతుంది. కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా, ఊహించని ట్విస్టులతో ఓటీటీలో అదరగొడుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో 

ఈ బ్రిటిష్ కామెడీ హారర్ మూవీ పేరు ‘గెట్ అవే’ (Get Away). 2024 లో వచ్చిన ఈ సినిమాకి స్టెఫెన్ హార్స్ దర్శకత్వం వహించారు. ఇందులో నిక్ ఫ్రాస్ట్ (రిచర్డ్ స్మిత్), ఐస్లింగ్ బీ (సుసాన్ స్మిత్), సెబాస్టియన్ క్రాఫ్ట్ (సామ్ స్మిత్), మైసీ ఆయర్స్ (జెస్సీ స్మిత్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 6న యునైటెడ్ స్టేట్స్, కెనడా థియేటర్లలో విడుదలైంది. 1 గంట 26 నిమిషాల రన్‌ టైమ్‌తో, IMDbలో 5.3/10 రేటింగ్‌ కలిగి ఉంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

రిచర్డ్, సుసాన్ అనే జంట, వారి టీనేజ్ పిల్లలు సామ్, జెస్సీ తో కలసి ఇంగ్లండ్ లో నివసిస్తుంటారు. ఒక సారి స్వీడన్‌లోని ఒక ఐలాండ్ కు వెకేషన్‌కు వెళ్తారు. వీళ్ళు కరంటాన్ అనే స్థానికులు జరుపుకునే ఫెస్టివల్ సమయంలో అక్కడికి చేరుకుంటారు. ఇది రెండు శతాబ్దాల క్రితం జరిగిన ఒక భయాంకరమైన సంఘటన జరిగిన తరువాత నుంచి జరుపుకుంటూ ఉంటారు. స్థానికులైన మాట్స్ , ఇంగెమార్ వీళ్ళని ఈ వేడుకకు ఆహ్వానిస్తారు. అక్కడ వింత రిచ్యువల్స్ ఈ కుటుంబాన్ని అస్వస్థతకు గురి చేస్తాయి. రిచర్డ్ , సుసాన్ ఒకరినొకరు “మమ్మీ”, “డాడీ” అని పిలుచుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తారు. అలాగే వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే సామ్, జెస్సీ స్థానికుల ప్రవర్తనను సస్పెక్ట్ చేస్తారు.

మాట్స్, జెస్సీపై ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తుంటాడు. ఒక సీన్‌లో ఆమె బెడ్‌రూమ్‌లో ఒక వన్-వే మిర్రర్ ద్వారా ఆమెను చూస్తూ, అద్దంపై లిక్ చేస్తాడు. స్థానికులు ఒక ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కుటుంబాన్ని పాయిజన్డ్ కుకీస్‌తో చంపడం ద్వారా కరంటాన్ రిచ్యువల్‌ను “క్లోజ్” చేయడానికి కుస్తుంటారు. ఈ రిచ్యువల్ ఐలాండ్ చీకటి హిస్టరీ అయిన కానిబలిజం తో సంబంధం ఉంటుంది. ఇంగెమార్ వంటి కొందరు యంగ్ లోకల్స్ ఈ ప్లాన్ కేవలం భయపెట్టడానికి మాత్రమే అని భావిస్తారు, కానీ ఓల్డర్ విలేజర్స్ డెడ్లీ ఇంటెంట్ కలిగి ఉంటారు.

ఇక సినిమా మధ్యలో ఒక మేజర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ కుటుంబం సాధారణ టూరిస్టులు కాదు. ఒక సైకోపాతిక్ సీరియల్ కిల్లర్స్ గ్రూప్. వీళ్ళు వెకేషన్ కోసం కాకుండా, తమ హత్యల థ్రిల్‌ను కొనసాగించడానికి వచ్చారు. స్థానికులు వారిని చంపడానికి ప్లాన్ చేసినప్పుడు, ఈ ఫ్యామిలీ రివర్స్ అటాక్ చేసి ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్తుంది. ఈ సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. చివరికి స్థానికుల చేతిలో ఈ కుటుంబం ఏమవుతుంది ? స్థానికులను ఈ సైకో కుటుంబం నాశనం చేస్తుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కోర్టు రూమ్ లోనే హత్య… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు… ఐఎండీబీలో 8.9 రేటింగ్

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×