BigTV English

YS Jagan: జగన్ ఇంటికి వాస్తు దోషం! సంక్రాంతి లోపే లీడర్స్ ఖాళీ?

YS Jagan: జగన్ ఇంటికి వాస్తు దోషం! సంక్రాంతి లోపే లీడర్స్ ఖాళీ?

YS Jagan: ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాజయం తర్వాత ఏదీ కలిసి రావడం లేదా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారో తెలియడం లేదు. నమ్మిన వారే గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలో రెండో రౌండ్ వలసలు మొదలయ్యాయి. కారణాలు తెలియవు. ఆపే ప్రయత్నాలూ జరగడం లేదు. ఇంకోవైపు వరుస కేసులు, క్యాడర్ లో నిరాశ. ఈ సమయంలో జగన్ వాస్తు మార్పులనే నమ్ముకుంటున్నారన్న చర్చ పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ మారింది.


ఏది ముట్టుకున్నా జగన్ కు రివర్స్ అవుతోందా?

వైసీపీకి ఇప్పుడు ఒక్కటి కాదు చాలా సవాళ్లు చుట్టు ముట్టాయి. వాటి నుంచి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే లడ్డూ వ్యవహారం నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల దాకా జగన్ కు చాలా సవాళ్లు చుట్టుకున్నాయి. ఏది చేసినా రివర్స్ అవుతోంది. ఏది ముట్టుకున్నా భగ్గుమంటోంది. పోనీ సైలెంట్ గా ఉందామన్నా ఉండనివ్వని పరిస్థితి. కాలం కలిసిరాకపోతే ఏది ముట్టుకున్నా వర్కవుట్ కాదంటారు కదా. ఇప్పుడు జగన్ కు కూడా అదే ఫేజ్ నడుస్తోంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నా అనుకున్న వాళ్లే గుడ్ బై చెప్పేసి వెళ్తున్నారు. చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ నుంచి సెకండ్ ఫేజ్ వలసలు కొనసాగుతున్నాయి. వెళ్లే వారిని ఆపే ప్రయత్నం కూడా హైకమాండ్ చేయట్లేదు. ఎందుకంటే ఆపినా ఆగరని తెలుసు. అడిగి, బుజ్జగించడం ఎందుకు అనుకుంటున్నారో ఏమోగానీ హ్యాండ్సప్ చేసేస్తున్నారు.


చాలా సెగ్మెంట్లలో వైసీపీలో గ్రూప్ వార్

ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. తమ హయాంలో చేసిన పనులపై ఎంక్వైరీలు నడుస్తుంటాయి. పార్టీ నేతలు వీడుతుంటారు. కేసులు చుట్టుముడుతాయి. క్యాడర్ నిరాశలో ఉంటుంది. యాక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోతుంటాయి. అయితే వైసీపీకి మాత్రం ఈ డోస్ కాస్త గట్టిగానే తగులుతోంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ నడుస్తోంది. నేతల మధ్య పొసగడం లేదు. ఇదే సమయంలో ఎదిగేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సొంత క్యాడర్ ను పెంచుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే వైసీపీకి ఇద్దరు కీలక నేతలు రిజైన్ చేశారు. ఒకరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. మరొకరు గ్రంధి శ్రీనివాస్. ఒకే రోజు రెండు ఝలక్ లు తగలడం అంటే మాటలు కాదు.

లేటెస్ట్ గా అవంతి, గ్రంధి వైసీపీకి గుడ్ బై

రాజీనామా చేస్తూ అవంతి పెద్దగా విమర్శల జోలికి వెళ్లలేదు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఏడాదైనా సమయం ఇవ్వకుండానే ధర్నాలు, నిరసనలు అంటే ఎలా అని మనసులో మాట చెప్పకనే చెప్పారు. తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని చెప్పిన అవంతి.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ద్వారా షార్ట్ గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆరు నెలల నుంచే ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారన్నారు. వైసీపీ హయాంలో సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని జగన్ కు సింపుల్ గా గుర్తు చేశారు. అంతా వాలంటీర్‌లే నడిపించారని తన మనసులో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. అంతే కాదు బ్రిటిషర్లు అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా, అక్కడ నిర్ణయాలు తీసుకుని ఇక్కడ ధర్నాలు చేయమనడం సమంజసం కాదన్నారు.

ఏడాది కాకుండానే నిరసనలేంటని అవంతి రుసరుస

అటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా లేఖను జగన్కు పంపించారు. పార్టీ కార్యక్రమాలకు గ్రంధి కొన్ని నెలలుగా దూరంగా ఉంటున్నారు. దీంతో.. ఆయన వైసీపీని వీడుతారన్న సిగ్నల్స్ ను హైకమాండ్ పసిగట్టింది. వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా గ్రంధి హాజరుకాలేదు. దీంతో భీమవరం వైసీపీలో గడబిడ ఏంటో బయటికొచ్చింది. అయితే ఆయన్ను బుజ్జగించేందుకు పేర్ని నానిని, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును జగన్ రాయబారానికి పంపారు. ఈ ఇద్దరు సర్ది చెప్పినా గ్రంధి తన నిర్ణయం మార్చుకోలేదు. అయితే పార్టీలో ఉక్కపోత పెరగడంతోనే గ్రంధి బయటికొచ్చారంటున్నారు. ఆయనకు పోటీగా భీమవరం వైసీపీలో మరో వర్గం ఎమర్జ్ అవడాన్ని తట్టుకోలేకే గుడ్ బై చెప్పారంటున్నారు.

తమ దారి తాము చూసుకుంటున్న వైసీపీ నేతలు

జగన్ ఏరి కోరి పార్టీలోకి తీసుకువచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తుండడం ఇక్కడ హైలెట్ అయ్యే పాయింట్. ఇందుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎగ్జాంపుల్. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. వైసీపీకి ఇప్పటికి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారని.. మూడు కూటమి పార్టీల్లో ఎక్కడ చాన్స్ వచ్చినా, ఎక్కడి నుంచి పిలుపు వచ్చినా చేరిపోయేందుకు రెడీ అంటున్నారట. చాలా మంది పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. కాబట్టి వారి కథేంటో ఈజీగానే తెలిసిపోతోంది.

లడ్డూ కల్తీ దగ్గర్నుంచి అదానీ డీల్ దాకా సమస్యలు

మరో వైపు వైసీపీ హైకమాండ్ చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీ నేతల్ని బుజ్జగించే పరిస్థితి లేదు. లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల వరకూ అనేక అంశాలు సవాల్ గా మారుతున్నాయి. అయితే వెళ్లి పోయే వారి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీలో చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీని వీడుతున్న వారికి కూటమి నేతల నుంచి సవాళ్లు కూడా రెడీగా ఉంటున్నాయి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో బుద్దా వెంకన్న లాంటి నేతలు ఫైర్ అవుతున్నారు. అవంతి లాంటి వాళ్ల సానుభూతి తమ ప్రభుత్వానికి అక్కర్లేదంటూ ఘాటుగానే ట్వీట్లు చేస్తున్నారు. సో పార్టీ మారిన వారి రాజకీయ భవిష్యత్ పైనా డైలమా కంటిన్యూ అవుతోంది.

ఇంటికి వాస్తు దోష నివారణ చేయిస్తున్న వైనం

రాజకీయంగా, కుటుంబ పరంగానూ చీకాకులు, సమస్యలకు వాస్తు దోషాలు కూడా కారణమని భావిస్తున్న జగన్ తన నివాసంలో వాస్తు దోషాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు పనులు చేపట్టి తాజాగా ఈశాన్యం వైపు కూడా మార్పులు చేయించారంటున్నారు. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదన్న వాస్తు పండితుల సూచనల మేరకే జగన్ ఇంటి వాస్తు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్‌ ఇంటికి ఇలా వాస్తు మార్పులు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజలెందుకు తిరస్కరించారో విశ్లేషించుకోకుండా ఆయన సాకులు వెతుక్కుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే ఇంట్లో ఉండగా 2019లో జగన్ అధికారంలోకి రాలేదా.. అప్పుడు ముద్దు, ఇప్పుడు చేదు అయిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు

జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు, అక్కడే నిద్ర చేసేలా రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేయబోతున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావిస్తారంటున్నారు. అందుకే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కూర్చుంటే కుదరదని, జనంలోకి వెళ్లాల్సిందే అని డిసైడ్ అయ్యారు. గత కొంతకాలంగా జగన్ జనానికి.. పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న అభిప్రాయాలు పెరిగాయి. దీంతో జనంలోనే ఉండాలని డిసైడ్ అవడం కీలకంగా మారింది.

నిజానికి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం జగన్ పార్టీకి జనంలో పెద్ద మైనస్ గా మారిందంటున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలపై అధికారికంగా నిలదీసే వేదిక అసెంబ్లీ. అక్కడికే వెళ్లకుండా మొత్తంగా దూరంగా ఉండడం అంటే ప్రతిపక్ష పార్టీగా విఫలమైనట్లే లెక్క అన్నది తెరపైకి వస్తోంది. ప్రజా సమస్యలపై ఇదేం చిత్తశుద్ధి అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. అసలైన చోట నిలదీయకుండా విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. సంబంధం లేని కారణాలు చెప్పి సభకు దూరంగా ఉండడం మైనస్ అవుతుందంటున్నారు.

అసెంబ్లీకి వెళ్లకుండా పెద్ద తప్పు చేశారా?

నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. అప్పుడే ఎదురుదాడి వర్కవుట్ అవుతుందా అన్న ఆలోచన వైసీపీ చేయలేకపోతోందా అన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఎందుకంటే గత ఐదేళ్లలో చేసిన అప్పులు, జరగని అభివృద్ధి నుంచి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వెంటనే కోలుకోవడం వీలు అవుతుందా అన్నది ఆలోచించకపోవడంపై జనంలోనూ చర్చ జరుగుతుంది. నిజానికి ఇంకా నాలుగున్నరేళ్ల తర్వాతే ఎన్నికలు వస్తాయి. మధ్యలో జమిలి ఉంటే మాత్రం ముందస్తుగా జరుగుతాయి. ఇదే ఆలోచనతో జగన్‌ ఇప్పటినుంచే సమరం మొదలు పెట్టాలని అనుకున్నా.. పార్టీలో పరిస్థితులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×