Credit War: తమ హయాంలో కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ.. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాల్లో వాటా కోసం ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం భూమి పూజచేసింది. అనంతపురం ఆర్డీటీ సేవలను అతరాయం లేకుండా కొనసాగించేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. అంతకు ముందు వైజాగ్‌లో ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి స్పష్టంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు క్రెడిట్ వార్ మొదలుపెడుతున్నారు. ప్రభుత్వ విజయాలన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వారు అంతలా తాపత్రయపడుతుండటం చూస్తూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక సంక్షేమ, అభివృద్ది పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజామన్ననలు పొందడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వైసీసీ హయాంలో పూర్తిగా మూలనపడ్డ రాజధాని అమరావతి పనులు కేంద్ర సహకారంతో పరుగులు పెడుతున్నాయి. ప్రజల మౌళిక వసతులు, రోడ్ల అభివృద్ధి పనులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వంటి అభివృద్ది శరవేగంతో సాగుతోంది. ఇక తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్‌కు భూమి పూజ, వైజాగ్‌లో ప్రారంభమైన ఇనార్బిట్ మాల్, అనంతపురం ఆర్డీటీ సేవలు పునరుద్ధించడం వంటి రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలు చకచకా జరిగిపోతున్నాయి.
జగన్ హయాంలో బటన్ పాలిటిక్స్.. అంటే నవరత్నాల పేరుతో పేదల ఖాతాల్లోకి నగదు చేయడమే అభివృద్ధని భావించారని, అదే తమను తిరిగి అధికారంలోకి తెస్తుందన్న నమ్మకంతో ఉన్నారన్న అభిప్రాయం ఉండేదంటారు. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్.. అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు తన వెంటే ఉన్నారని ధీమా పోయారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన.. ఆ ఓట్లన్నీ ఏమైపోయాయని బేల ముఖంతో ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం,
ఎన్నికల ప్రచారంలో తాము చేసిన బటన్ పాలిటిక్స్ గురించి తప్ప .. అభివృద్ధి పరంగా వైసీపీ ఎలాంటి ప్రచారం చేసుకో లేకపోయిందన్న ఆరోపణలున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ది పనులు శరవేగంతో పురుగులు పెడుతున్నాయి. ఇటీవల విశాఖలో ఇన్ఆర్బిట్ పాల్ ప్రారంభోత్త్సం జరిగింది. దానికి అనుమతులిచ్చింది జగనే అని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నారు. వాస్తవానికి అలాంటి కమర్షియల్ కాంప్లెక్స్‌కు సంబంధించి ప్రభుత్వ ప్రమేమీ ఏమీ ఉండదు. అయినా అప్పట్లో అది పూర్తి కాలేదు. కాని తాము మొదలు పెట్టిన ఇన్ఆర్బిట్ మాల్ క్రెడిట్ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్‌కు భూమి పూజ జరిగింది. సీఎం చంద్రబాబు సహా, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యలు లోకేశ్ వంటి వారు, కేంద్ర మంత్రులు అందులో పాల్గొని చంద్రబాబు పాలనా దక్షతని కొనియాడారు. అయితేఅర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి రావడానికి ప్రధాన కారణం జగన్ అని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ్ అమర్‌నాథ్ చెప్తున్నారు. దావోస్లో ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఆదిత్య మిట్టల్ తో అప్పటి సీఎం జగన్ సంప్రదింపులు జరిపారంట. గ్రీన్ కో ప్రాజెక్ట్ తో పాటు స్టీల్ ప్లాంట్ ను రాష్ట్రంలో పెట్టాలని జగన్ కోరారని గుడివాడ బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
ఇన్నార్ బిట్ మాల్, బల్క్ డ్రగ్ పార్క్‌ను అప్పటి సీఎం జగనే తీసుకొచ్చారని అమర్‌నాథ్ ఘంటా పథంగా చెప్తున్నారు. జగన్ తెచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందంట. దాంతో 35 వేల మందికి ఉపాధి కల్పించే బల్క్ డ్రగ్ పార్క్ అయోమయం లో పడిందని అమర్ విమర్శిస్తున్నారు. అదే ఫోలోలో షర్మిల తన అవసరాల కోసం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని అమర్‌నాథ్ మండిపడుతున్నారు. ఇక జగన్ తమ నోటిని కట్టడి చేస్తున్నారని, మీరు హద్దు మీరితే జగన్ చెప్పినా వినే పరిస్థితి ఉండదని కూటమి పెద్దలకు వార్నింగులు ఇస్తున్నారు..
మొత్తానికి అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి రావడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్ అంటుంది వైసీపీ. అయితే మంత్రి నారా లోకేష్ చోరవతో ఇది సాకారం అయిందని అంటున్నారు కూటమి నేతలు. ఇక ఆర్డీటీ సేవల పునరుద్దరణ విషయంలోను ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. అనంతపురం ప్రజల గుండెచప్పుడు ఆర్డీటీకి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు అవిశ్రాంత పోరాటంతో లైన్ క్లియర్ అయ్యిందని వైసీపీ నేతలు అంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రస్తావించని వైసీపీ నేతలు.. ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. వారి వాదనే నిజమైతే అవన్నీ ముందే ఎందుకు చెప్పుకోలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమ గడ్డపై సేవ అనే పదానికి మారుపేరు ఆర్డీటీ సంస్థ. గత 50 ఏళ్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఈ సంస్థ ఒక ఆపద్బాంధవిలా నిలుస్తోందని బీసీ సంక్షేమం, చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత అంటన్నారు. స్పెయిన్ నుంచి వచ్చిన విన్సెంట్ ఫెర్రర్, ఆన్ ఫెర్రర్ దంపతులు ఇక్కడి వెనుకబడిన ప్రాంతాలను చూసి చలించి, మన ప్రజల కోసం విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాల్లో వారు అనేక సేవలు చేశారని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఆర్డీటీ వంటి సేవా సంస్థను కూడా రాజకీయ కక్షతో వేధించిందని విమర్శలు గుప్పించారు. విదేశీ నిధుల రెన్యూవల్ విషయంలో కావాలని ఇబ్బందులు పెట్టి, సంస్థ సేవలు ఆగిపోయేలా కుట్రలు చేసింది. ఆ సంస్థకు ఉన్న భూములను కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ జాతర.. ఏప్రిల్‌లోనే పదవుల పండగ!
Story by: Apparao, Big Tv