BigTV English

OTT Movie : రాత్రికి రాత్రే ఇంటిని ఏలియన్స్ చుట్టుముడితే… కిరాక్ సైన్స్ ఫిక్షన్ మూవీ

OTT Movie : రాత్రికి రాత్రే ఇంటిని ఏలియన్స్ చుట్టుముడితే… కిరాక్ సైన్స్ ఫిక్షన్ మూవీ

OTT Movie : ఎంగేజింగ్ గా ఉండే సినిమాల్లో హర్రర్ సినిమాలే కాదు సైన్స్ ఫిక్షన్ కేటగిరి కూడా ఉంటుంది. ఇలాంటి సినిమాలను చూడడానికి లాంగ్వేజ్ తో పాటు జానర్ కూడా సంబంధం లేదు. కంటెంట్ ఉంటే చాలు అనుకుంటారు మూవీ  లవర్స్. ఇక సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చెవి కోసుకునే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. ఓటిటిలో హారర్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఎంత ఆదరణ ఉంటుందో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏలియన్స్ గురించి. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ కథ ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో..

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పాపులర్ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. కానీ తెలుగు మూవీ లవర్స్ కి ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే ఈ సినిమా తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. ఒకవేళ లాంగ్వేజ్ అనేది అసలు అడ్డు కాదు అనుకునేవారు ఈ సినిమాను హ్యాపీగా ఈ వీకెండ్ హాట్ స్టార్ లో చూసేయొచ్చు.


కథలోకి వెళ్తే…

సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్నకి ఆల్రెడీ కొడుకు, కూతురు ఉంటారు. అతనితో పాటు తమ్ముడు కూడా జీవిస్తూ ఉంటాడు. ఈ ఫ్యామిలీ మొత్తం సిటీకి దూరంగా ఉండే ఓ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతారు. ఒకప్పుడు చర్చ్ ఫాదర్ గా ఉండే హీరో తన భార్య చనిపోవడంతో మొత్తానికే నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడిని నమ్మడం మానేసి, పిల్లలతో కలిసి అందరికీ దూరంగా ఉంటూ, పొలం పనులతో బిజీ అవుతాడు. ఇలా పొలం పనులు చేసుకుంటున్న సమయంలోనే ఒక రోజు పక్క పొలంలో పిల్లల అరుపులు వినిపిస్తాయి. నిజానికి ఆ చుట్టుపక్కల అసలు ఎవరూ ఉండరు. అలాంటిది పిల్లల శబ్దాలు వినిపించడం ఏంటో అర్థం కాదు హీరోకి. దీంతో అక్కడ ఎవరున్నారో చూద్దామని తన కూతురితో కలిసి వెళ్తాడు. తీరా అక్కడ మొక్కలన్ని విరిగిపోయి, పెద్ద పెద్ద విచిత్రమైన ఆకారాలు ఎవరో కావాలని క్రియేట్ చేసినట్టు వింత వింతగా కనిపించడంతో షాక్ అవుతాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్తాడు. క్షణంలోని ఆ వార్త వైరల్ అవుతుంది. అదే టైంలో అక్కడ ఉండే జంతువులన్నీ వింతగా ప్రవర్తిస్తాయి. ఓ రోజు రాత్రి సడన్ గా ఇంటిపై ఓ పెద్ద ఆకారం ఉండడం హీరోని భయపెడుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? గతంలో హీరో ఏం ఫేస్ చేశాడు? ఆ ఏలియన్స్ హీరో ఇంటి చుట్టూ ఎందుకు ఉన్నాయి? వాటి నుంచి ఈ ఫ్యామిలీ మొత్తం బయటపడిందా? అనే విషయం తెలియాలంటే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘సైన్స్’ ను చూడాల్సిందే.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×