BigTV English

Bigg Boss: విన్నర్ గా నిఖిల్.. విధ్వంసం సృష్టించిన గౌతమ్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే..?

Bigg Boss: విన్నర్ గా నిఖిల్.. విధ్వంసం సృష్టించిన గౌతమ్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే..?

Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss). నిన్నటితో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇకపోతే సీజన్ ముగిసిన ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవను అభిమానులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత ఏడవ సీజన్ లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్లను అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అభిమానులు ఆ సీజన్ రన్నర్ గా నిలిచిన అమర్దీప్ (Amardeep) కారుపై దాడి చేశారు. అంతేకాదు వెనుక వస్తున్న మిగిలిన కంటెస్టెంట్స్ పై కూడా దాడి చేయడం జరిగింది. దీనికి తోడు గలాటా గీతూ కారు అద్దాలు కూడా పగలగొట్టారు. అంతేకాదు ప్రభుత్వ వాహనాలపై కూడా రాళ్లు రువ్వారు. ఫ్యాన్స్ ఇంత విధ్వంసం సృష్టించడంతో ఆఖరికి పల్లవి ప్రశాంత్ జైలు పాలయ్యారు.


ఇకపోతే ఈ సీజన్లో కూడా పోలీసులు ముందుగానే జాగ్రత్త పడకపోయి ఉండి ఉంటే, కచ్చితంగా అలాంటి సంఘటనలే జరిగేవి. ఇక భద్రతలో భాగంగా ముందస్తుగానే ఏకంగా 53 సీసీ కెమెరాలను అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ అమర్చారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ ఎనిమిదవ సీజన్ టైటిల్ విన్నర్ గా నిఖిల్ (Nikhil), రన్నర్ గా గౌతమ్ (Goutham)నిలిచారు. ఎంతో ఉత్కంఠ మధ్య ఈ టైటిల్ విజేతను ప్రకటించడం జరిగింది. చాలామంది జనాలు సోషల్ మీడియాలో జరిగిన పోలింగ్ ను బట్టి గౌతమ్ కృష్ణ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. దీంతో ఆయన అభిమానులు పూర్తిస్థాయిలో హర్ట్ అయ్యారు. ఫినాలే ముందు రోజు కూడా గౌతమ్ అభిమానులు నిఖిల్ కారుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది బిగ్ బాస్ టీం వరకు చేరడంతో అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ మూడు అంచుల సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు.

ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే గౌతమ్ అభిమానులు మాత్రం తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ గెలవలేదని, రాజకీయం చేశారని, అన్యాయం చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు వాళ్లపై లాఠీ ఛార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంగణం కాస్త ఉద్రిక్తత వాతావరణంలోకి వెళ్లిపోయింది. ఇకపోతే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయడం వల్లే అక్కడ ఇబ్బందులు కాస్త తొలగిపోయాయని సమాచారం.


ఇకపోతే పోలీసులు కనుక ముందస్తు జాగ్రత్త వహించకపోయి ఉండి ఉంటే, గత సీజన్లో పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లినట్టు, ఈ సీజన్లో గౌతమ్ కూడా జైలుకు వెళ్లే వాడేమో. ఏది ఏమైనా అభిమానులు ఆవేశంగా చేసే పనులకు కంటెస్టెంట్స్ శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు రావడం బాధాకరమని చెప్పాలి.. ఈ సీజన్ గౌతమ్ గెలుస్తారనుకున్న అభిమానులకు నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×