Srikakulam Sherlockholmes Trailer: మొదటి సినిమానే తమ ఇంటిపేరుగా మార్చుకున్న నటుల్లో వెన్నెల కిషోర్ ఒకడు. వెన్నెల సినిమాతో కిషోర్ అనే కమెడియన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒకప్పుడు కమెడియన్స్ అంటే బ్రహ్మానందం, వేణు మాధవ్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని టకటకా చెప్పుకొస్తారు. జనరేషన్ మారకా.. వీరిని రీప్లేస్ చేసే కమెడియన్స్ రాలేదు. ఆ సమయంలోనే వెన్నెల కిషోర్ వచ్చాడు. తనదైన కామెడీతో స్టార్ కమెడియన్ గా మారాడు.
అయితే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ గా కొనసాగే సమయంలోనే హీరోలుగా మారారు. కానీ, కమెడియన్ నుంచి హీరోగా మారిన వారెవ్వరూ హిట్స్ అందుకున్నది లేదు. సునీల్ కూడా ఒకటి రెండు హిట్స్ అందుకున్నా హీరోగా కొనసాగలేకపోయాడు. ఇక వెన్నెల కిషోర్ ఈ మధ్యనే హీరోగా మారాడు. ఈ ఏడాది చారీ 111 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెన్నెల కిషోర్ అంతగా మెప్పించలేకపోయాడు. తాజాగా ఆయన హీరోగా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు.
Manchu Manoj: జనసేనలోకి మంచు మనోజ్.. ఇదుగో క్లారిటీ
వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయి తాలూకా అనేది ట్యాగ్ లైన్. మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, శియా గౌతం, రవితేజ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఒక ఊరిలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. అందులో మొదట మేరీ అనే యువతిని బీచ్ ఒడ్డున చంపేస్తారు. పోలీసులు ఆ హంతకుడుని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమవుతారు. ఈలోపు ఇంకో రెండు హత్యలు జరుగుతాయి. దీంతో ఈ కేసును ఛేదించలేని పోలీసులు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టుకుంటారు. అలా ఆ హత్యల కేసు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చేతికి వస్తుంది. మనిషి చూడడానికి డిటెక్టివ్ గా లేకపోయినా.. ఈ కేసును ఛేదించడానికి రెడీ అవుతాడు వెన్నెల కిషోర్. ఈ హత్యల వెనుక 7 గురి హస్తం ఉందని, వారిని ఇంటరాగేట్ చేస్తుంటాడు.
Amritha Aiyer: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హనుమాన్ బ్యూటీ.. ఇండస్ట్రీ వ్యక్తిని మాత్రం కాదట..
అసలు మేరీని ఎందుకు.. ? ఎవరు ..? చంపారు.. ? ఆ 7 గురిలో ఉన్న హంతకుడును శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ పట్టుకున్నాడా.. ? ఈ హత్యలకు అనన్య,రవితేజ లకు సంబంధం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలా ప్లాట్ ను బట్టి ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయలానే ఉంది. హత్యలను ఛేదించే డిటెక్టీవ్ గా వెన్నెల కిషోర్ బాగానే నవ్వించేలా ఉన్నాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ శ్రీకాకుళం యాస ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ కానుంది. గతంలో కూడా వెన్నెల కిషోర్ సినిమా అయితే చేశాడు కానీ, ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదు. అందువలనే అసలు ఆ సినిమా వచ్చిందన్న విషయం కూడా ఎవరికీ తెలియలేదు. మరి ఇప్పుడు ఈ సినిమాకు ఈ కమేడియన్ కమ్ హీరో ప్రమోషన్స్ చేసి మంచి హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.