Naga Chaitanya Thandel : ప్రస్తుతం తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. చాలామంది యంగ్ హీరోస్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ హీరో పాన్ ఇండియా సినిమా చేయలేదు. మొదటిసారి అక్కినేని నాగచైతన్య తండేల్ అనే పనుండియా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన చందు, అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు. తన దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి సరిగ్గా థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ నార్త్ లో ఆడియన్స్ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్ తో ఆ సినిమా మంచి సక్సెస్ సాధించి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు చందు. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్నో డిస్కషన్ చేసి గీత ఆర్ట్స్ లో తండేల్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాను ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. నాగచైతన్య ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను మాట్లాడబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమైంది. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : Srikakulam Sherlockholmes Trailer: బీచ్ ఒడ్డున మేరీని చంపింది ఎవరు.. ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జి తల్లి అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. దాదాపు పది మిలియన్స్ కు పైగా ఈ పాటకు వ్యూస్ వచ్చాయి. ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను ఈనెల 22 లేదా 23న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ శివుడి సాంగ్ చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) రీసెంట్ టైమ్స్ లో తన టాలెంట్ ఏంటో మరోసారి చూపించారు. ఇక మొదటి సింగిల్ హిట్ అయింది కాబట్టి రెండో సింగిల్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. అంతేకాకుండా ఈ పాట చాలా బాగా వచ్చింది అని విశ్వసినీయవర్గాల సమాచారం.కార్తికేయ సినిమాతో నిఖిల్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఇచ్చిన చందు. ఈ తండేల్ సినిమాతో నాగచైతన్యకు ఏ రేంజ్ పాన్ ఇండియా హిట్ ఇస్తాడు అని అక్కినేని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read : Virinchi Varma: మెగా హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసిన విరించి వర్మ