Bigg Boss 8 Telugu : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 ప్రసారం అవుతుంది. ఎన్నో ట్విస్టులు, టర్నులతో ముందుకు సాగుతూ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది. ప్రారంభంలో పూర్తిగా గాడి తప్పి డిజాస్టర్ వైపు దూసుకుపోతున్న ఈ సీజన్ ని, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తో మళ్ళీ గాడిలో పడింది. ఈ షో దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. 14 వ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతుంది. 13 వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు మేకర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పారు.. ఈ షో ఈ రెండు వారాల పాటు ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు అందుకు కారణమేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మాలో కొత్త సీరియల్స్ కు కొదవలేదు.. డైలీ సీరియల్స్ కోసం కొన్ని షోలను మధ్యాహ్నంకు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సీరియల్ ప్రమోషన్స్ నుంచి టైమింగ్స్ వరకూ ప్రతి దాన్ని చాలా పక్కాగా ప్లాన్ చేస్తుంది స్టార్ మా టీమ్. కానీ వచ్చిన సమస్యల్లా ఏంటంటే వచ్చే ప్రతి సీరియల్ కొద్ది రోజులకి పాతదే అవుతుంది. తాజాగా బిగ్ బాస్ పరిస్థితి అలానే అయ్యింది. కొత్త సీరియల్ కోసం బిగ్ బాస్ వెనక్కి వెళ్ళిపోయిందని ఓ వార్త వినిపిస్తుంది. ఇప్పుడే తొమ్మిది గంటలకు వస్తుంది. ఇక బిగ్‌బాస్ షో టీవీలో ఎప్పుడొస్తుంది? అరెరే ఇదీ ఓ ప్రశ్ననే అనుకుంటున్నారా? అంతేలా అలవాటు పడిపోయిన ఇది చేదు వార్తనే. సోమవారం నుంచి శుక్రవారం వరకూ స్టార్ మా ఛానల్‌లో ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకి వస్తుంది. అదే వీకెండ్‌లో అంటే శని-ఆదివారాల్లో అరగంట ముందే అంటే 9 ఇంటికే ప్రసారం అవుతుందని బిగ్ బాస్ లో చెప్పేసారు.
నేటి నుంచే అంటే సోమవారం నుంచి అంటే డిసెంబర్ 2 నుంచి బిగ్‌బాస్ షో రాత్రి 10 గంటలకి ప్రసారం కానుంది. అంటే సోమవారం- శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకి స్టార్ మాలో వస్తుందన్న మాట. అయితే వీకెండ్ మాత్రం ఎప్పటిలానే రాత్రి 9 గంటలకే ప్రసారం అవుతుంది. ఇంతకీ బిగ్‌బాస్ షోకి ఇంత అర్జెంట్‌గా టైమ్ మార్చింది దేనికిరా అంటే కొత్త సీరియల్ కోసం.. కొత్తగా వచ్చేవాటికి ఈ షోను లేట్ గా ప్రసారం చెయ్యాలా అని ఆడియన్స్ స్టార్ మా పై కోపడుతున్నారు. స్టార్ మా ఇలా చెయ్యడం కొత్తేమీ కాదు.. గతంలో గుప్పెడంత మనసు, మొన్న బ్రహ్మముడి ధారావాహిక పరిస్థితి ఇదే అయింది. కొత్త సీరియల్‌ని ఆడియన్స్‌కి అలవాటు చేయడానికి ఉన్న సీరియల్‌ని, హిట్ సీరియల్‌ని మాటిమాటికి మార్చేసి ఆడియన్స్‌కి చూడాలన్న కోరిక కూడా పోయేలా చేస్తుంది… బిగ్ బాస్ విషయంలో స్టార్ మా తప్పు చేసిందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఈ వార్తల పై స్టార్ మా స్పందిస్తుందేమో చూడాలి..