Drugs Party: గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలు తెలిసి కూడా మళ్లీ అదే పనులు చేస్తూ ఇంకొంతమంది యంగ్ సెలబ్రెటీలు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ఆశ్చర్యంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ (Puri Jagannath)ను మొదలుకొని యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) వరకు చాలామంది ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లే .అయితే ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ కొరియోగ్రాఫర్..
హైదరాబాదులోని మాదాపూర్ లో ఒక హోటల్లోని ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు హోటల్ పై రైడ్ చేపట్టారు. అక్కడ మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్టు చేశారు. అలా పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ కి చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి (Kanha mohanty) కూడా ఉండడం గమనార్హం. కన్హ మహంతితో పాటు ప్రముఖ ఆర్కిటెక్టర్ కూడా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిసింది. ఈ పార్టీ ఆమే ఇచ్చినట్లు సమాచారం.
ఢీ షోతో భారీ పాపులారిటీ..
కన్హా మహంతి టీవీ షో లలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా దూసుకుపోతున్న ఢీ(Dhee) షోలో కూడా పనిచేశారు. దాంతోపాటు ప్రముఖ డాన్స్ షోలో పాల్గొని విజేతగా కూడా నిలిచారు. ఇకపోతే హైదరాబాదులో డ్రగ్స్ కొనుగోలు చేస్తే అనుమానం వస్తుందని భావించిన వీరు.. బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అక్కడి నుండి కొంతమంది సప్లయర్స్ ద్వారా హైదరాబాద్ తెప్పించి పార్టీ చేసుకున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆధారాలతో సహా రైడ్ చేసిన పోలీసులు వీరిని అరెస్టు చేయడం జరిగింది. ముఖ్యంగా కొరియోగ్రాఫర్ కన్హా మహంతి ఆర్కిటెక్టర్ ప్రియాంక రెడ్డి తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇకపోతే ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.. ఇక నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు అసలు ఈ డ్రగ్స్ ని బెంగళూరు నుండి హైదరాబాద్ కి ఎవరు తెప్పించారు? ఎలా తెప్పించారు? వీరి వద్దకు ఎలా చేరింది? అసలు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? వీరికి డ్రగ్స్ అందించడంలో సహాయం చేసింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్హా మహంతి ఒక్కసారిగా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో వైరల్ అయిపోయారు. ఇకపోతే ఢీ షోలో పాల్గొన్నప్పుడు తన లవ్ స్టోరీని కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరచగా.. అప్పుడు ఇతడి పై అందరిలో పాజిటివ్ బాగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు సడన్ గా డ్రగ్స్ తీసుకొని పట్టుబడడంతో అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై కన్హ మహంతి ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.