BigTV English

Bigg Boss 8 Telugu : హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ .. ఏడో వారం ఇద్దరు అవుట్ ?

Bigg Boss 8 Telugu : హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ .. ఏడో వారం ఇద్దరు అవుట్ ?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు టాప్ రియాలిటీ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ ఎంత సందడిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వారం మొత్తం టాస్క్ లతో గొడవలు జరిగినా శని , ఆది వారాల్లో నాగార్జున ఇచ్చే క్లాసులు , పేల్చే జోకులకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ రెండు రోజులు షో టీఆర్పీ రేటింగ్ హైరేంజులో ఉంటుంది. ఆరు వారాల్లో ఏడుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం తొమ్మిది మంది ఈ వారం నామినేషన్ ఉన్నారు. వారిలోంచి ఎవరు బయటకు వెళ్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుంది. మరి ఈ వారం ఎవరికీ తక్కువ ఓటింగ్ పడిందో.. హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తున్నారో చూడాలి ..


సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. ముఖ్యాంగా అప్పటివరకూ కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్లు కూడా దుకాణం సర్దేస్తున్నారు. గత వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న 9 మందిలో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. ఐదోవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. హౌస్ నుంచి ఆదిత్య ఓం , నైనికా బయటకు వెళ్లారు. ఇక అదే పరిస్థితి ఏడో వారంలో కూడా జరుగితుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నామినేషన్‌కి వచ్చిన ప్రతిసారి సేవ్ అయిన మణికంఠ ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఈ విషయం బయటికొచ్చింది. మొదట పృథ్వీ పేరు వినిపించింది . అయితే విష్ణు ప్రియతో లవ్ ట్రాక్ కట్ అవుతుందని బిగ్ బాస్ మణికంఠను బయటకు పంపించింది సమాచారం..

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న పృథ్వీ, నిఖిల్, మణికంఠ, నబీల్, యష్మీ, ప్రేరణ, గౌతమ్, తేజ, హరితేజల్లో ఓటింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉన్న కంటెస్టెంట్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్, నబీల్, ప్రేరణలకి ఓటింగ్ చాలా స్ట్రాంగ్‌గా పడింది. ఇక మిగిలిన వాళ్లలో తేజ, హరితేజ, పృథ్వీల ఓటింగ్ విషయానికొస్తే చాలా టైట్‌గా జరిగినట్లు తెలిసింది.. మిగిలిన అందరు బాగానే ఆడారు. అయితే మణికంఠ గత వారం చూపించిన ఎఫర్ట్ ఈ వారం కనిపించలేదని టాక్ నెట్టింట నడుస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఎలిమినేషన్ జరిగేముందు మణికంఠ కాస్త ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. నా మైండ్, హార్ట్ ఏం బాలేదు అంటూ మణికంఠ చెప్పాడట. ఇక ఎలిమినేషన్ రౌండ్‌కి మణికంఠతో పాటు చీఫ్ గౌతమ్ కూడా వచ్చాడట. చివరకు మణికంఠ బయటకు వచ్చాడని సమాచారం.. మరి మణికంఠను అవినాష్ ఒక్కడే నామినేట్ చేసాడు. ఇక మణికంఠ ఆరోగ్య సమస్యల కారణంగానే బయటకు వస్తున్నాడా లేదా అన్నది ఈ ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. ఇక ఈ వారం హౌస్ లోకి సినిమా టీమ్ ప్రమోషన్స్ కోసం రాబోతుందని టాక్..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×