BigTV English

AP Liquor Sales: తెగ తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇంత ఆదాయమా.. మద్యం ప్రియులా మజాకా..

AP Liquor Sales: తెగ తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇంత ఆదాయమా.. మద్యం ప్రియులా మజాకా..

AP Liquor Sales: ఏపీలో మద్యం ప్రియులు వారి తడాఖా చూపించారు. తాము తలచుకుంటే చాలు, ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదని నిరూపించారు మద్యం ప్రియులు. ముచ్చటగా నూతన మద్యం విధానం అమలైన మూడు రోజులకు కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెట్టారు మందుబాబులు..


ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఇటీవల నూతన మద్యం విధానంను రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చారు. ఇటీవల నూతన మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్దతి ద్వారా షాపుల యాజమానులను ప్రకటించారు. ఇక ఈనెల 16వతేదీ నుండి నూతన మద్యం విధానంతో మద్యం షాపులు తెరుచుకున్నాయి. గతం కంటే భిన్నంగా బ్రాండెడ్ మద్యంను మందు బాబుల కోసం అందుబాటులోకి తీసుకురాగా, మద్యం ప్రియులు అదే రీతిలో తమ సత్తా చాటారు.

అయితే మొదటగా రూ.99 లకే క్వార్టర్ బాటిల్ అందజేస్తామన్న కూటమి హామీ నెరవేర్చలేదన్న డిమాండ్స్ వినిపించాయి. అయితే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఖచ్చితంగా రూ.99 లకే క్వార్టర్ బాటిల్ అందజేస్తామని ప్రకటించి, మద్యం ప్రియులకు అందుబాటులోకి తీసుకురాగా.. వారి ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే కాబోలు మూడు రోజుల్లో మద్యం ప్రియులు తమ పవర్ చూపించారు ప్రభుత్వానికి.


కేవలం మూడే మూడు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్‌ అమ్మకం, 1,94,261 బీర్ల అమ్మకం జరగగా, లైసెన్స్ దారుల ఆనందానికి అవధుల్లేవు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం మద్యం ప్రియుల కోసం నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడంతో.. మందుబాబుల్లో కూడా హుషారు వచ్చిందని ఈ లెక్కలని బట్టి చెప్పవచ్చు.

Also Read: OTT Movie : భార్యను ముట్టుకోకుండా పడుకునే భర్త… పని మనిషితో పని కానిచ్చే భార్య

అలాగే గతంలో క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఆన్ లైన్ విధానం అమల్లోకి రావడంతో చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని మద్యం ప్రియులు తెలుపుతున్నారు. కాగా పలుచోట్ల గృహ సముదాయాల వద్ద మద్యం షాపులు వద్దని ప్రజలు నిరసన కూడా తెలిపారు. అయితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, లైసెన్స్ దారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఏదిఏమైనా ఏపీలో తెరుచుకున్న మద్యం షాపులు మాత్రం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కళకళలాడుతున్నాయని చెప్పవచ్చు. అందుకే కాబోలు మూడురోజుల్లో అంత ఆదాయం వచ్చిందన్న మాట.

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×