BigTV English

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియా కోసం ఆ విద్య నేర్చుకుంటానన్న పృథ్వి.. పెళ్లికి ఓకే చెప్పినట్టేనా?

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియా కోసం ఆ విద్య నేర్చుకుంటానన్న పృథ్వి.. పెళ్లికి ఓకే చెప్పినట్టేనా?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ మధ్య ప్రత్యేకంగా లవ్ ట్రాక్ అనేది ఏమీ లేదు. సోనియా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అటు నిఖిల్‌తో, ఇటు పృథ్వితో క్లోజ్‌గా ఉండేది. అలా ఆ ముగ్గురి మధ్య ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ సోనియా వెళ్లిపోయిన తర్వాత పృథ్వికి విష్ణుప్రియా చాలా క్లోజ్ అయ్యింది. పృథ్వితో తన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని ఎవ్వరు చెప్పినా కూడా తను అస్సలు ఆలోచించకుండా పృథ్వి వెంటపడుతూనే ఉంది. తాజాగా తనకు ఎలాంటివాడు కావాలో బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్‌పై చెప్పింది విష్ణు. దానికి పృథ్వి ఇచ్చిన ఇన్‌డైరెక్ట్ సమాధానం వింటుంటే తనకు కూడా విష్ణు అంటే ఇష్టం ఉందేమో అని అనుమానం కలిగేలా చేస్తోంది.


ఫైనల్స్‌లో ఇద్దరూ

బిగ్ బాస్ 8లోకి కంటెస్టెంట్‌గా వచ్చిన కొత్తలో విష్ణుప్రియా గేమ్ పరవాలేదు అనిపించేలా ఉండేది. కానీ కొన్ని వారాల తర్వాత పృథ్వికి తను క్లోజ్ అవ్వడం మొదలుపెట్టింది. తనను క్రష్ అని కూడా ఓపెన్‌గానే చెప్పేసింది. అలా పృథ్వి వల్ల విష్ణు గేమ్, విష్ణు వల్ల పృథ్వి గేమ్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. పృథ్వి ఎంత కోప్పడినా, వద్దని దూరంగా వెళ్లిపోయినా విష్ణు మాత్రం వదల్లేదు. అన్నింటిలో తనకే సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫైనల్స్‌ను డైరెక్ట్‌గా చూడడానికి పాత కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. అందులో విష్ణుప్రియాతో పాటు పృథ్వి కూడా ఉన్నాడు. అప్పుడే స్పెషల్ గెస్ట్‌గా రామ్ చరణ్ రాగా తనను అందరు కంటెస్టెంట్స్‌కు పరిచయం చేశారు నాగ్.


Also Read: మీ ఇంటివాడినే అని నిరూపించారు.. తెలుగు ప్రేక్షకులపై బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కామెంట్స్

రంగస్థలంపైకి స్వాగతం

బిగ్ బాస్ 8లోని ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా రామ్ చరణ్‌కు పరిచయం చేశారు. ముందుగా మెహబూబ్‌ను పరిచయం చేయగానే తను మంచి డ్యాన్సర్ అని, తనకు తెలుసని అన్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత గంగవ్వ, రోహిణిని చూసి తనతో పాటు ‘గేమ్ ఛేంజర్’లో కలిసి నటించారని బయటపెట్టారు. టేస్టీ తేజ మొదటి వీడియో అల్లు శిరీష్‌తో చేశాడన్న విషయం తనకు తెలుసని చెప్పి కంటెస్టెంట్‌ను ఎమోషనల్ చేశాడు రామ్ చరణ్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా రామ్ చరణ్‌పై తమకు ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. విష్ణుప్రియా కూడా తన స్టైల్‌లో రామ్ చరణ్‌ను బిగ్ బాస్ రంగస్థలంపైకి వెల్‌కమ్ చెప్పింది. ఆ తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది.

సెట్ అయిపోయిందా.?

రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ చూస్తే ఇన్‌స్పిరేషన్‌లాగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది విష్ణుప్రియా. రామ్ చరణ్‌లాగానే తనను కూడా ఎవరైనా గుర్రం మీద వచ్చి పెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టింది. తను కూడా ఉపాసనలాగానే మంచి భార్యలాగా నడుచుకుంటానని చెప్పింది. ఆ పక్కనే పృథ్వి ఉండడంతో నీకు గుర్రపు స్వారీ వచ్చా అని తనను అడిగారు నాగార్జున. రాకపోయినా నేర్చుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు పృథ్వి. దీంతో పృథ్వి దగ్గర నుండి ఇంత పాజిటివ్ రియాక్షన్ రావడంతో వీరి లవ్ సెట్ అయిపోయినట్టేనా అని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×