BigTV English

Bigg Boss 8 Telugu Winner: మొదట్లో కన్నడ బ్యాచ్ అంటూ ట్రోల్స్, ఇప్పుడు నిఖిలే విన్నర్.. ఇదెలా సాధ్యం.?

Bigg Boss 8 Telugu Winner: మొదట్లో కన్నడ బ్యాచ్ అంటూ ట్రోల్స్, ఇప్పుడు నిఖిలే విన్నర్.. ఇదెలా సాధ్యం.?

Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచాడు నిఖిల్ మలియక్కల్. తెలుగు బుల్లితెరపై ఎంతోమంది కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక సీరియల్‌లో చాలావరకు కన్నడ నటీనటులే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాంటి ఆర్టిస్టులలో నిఖిల్ కూడా ఒకడు. స్టార్ మాలోని ఒక సీరియల్‌తోనే తను హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సీరియల్ హీరోగానే తనకు ఎంతో పాపులారిటీ లభించింది. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత నిఖిల్ పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన మొదట్లో నిఖిల్‌తో పాటు మరికొందరు కంటెస్టెంట్స్‌పై చాలా నెగిటివిటీ వచ్చింది. కానీ ఫైనల్‌గా నిఖిలే విన్నర్ అయ్యాడు. ఇదెలా సాధ్యమయ్యింది.?


తప్పు తెలుసుకున్నాడు

బిగ్ బాస్ సీజన్ 8లో తెలుగు కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో.. దాదాపు దానికి సమానంగా కన్నడ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అయితే బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన కొత్తలో ఈ కన్నడ కంటెస్టెంట్స్ అంతా విచక్షణ లేకుండా ఆడి తెలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యేలా చేస్తున్నారని సోషల్ మీడియాలో చిన్న చర్చ మొదలయ్యింది. ఆ చిన్న చర్చ కాస్త పెద్దగా మారింది. దీంతో బిగ్ బాస్ 8లో తెలుగు వర్సెస్ కన్నడ బ్యాచ్ అనే వ్యత్యాసం మొదలయ్యింది. నిఖిల్ కూడా ఆ కన్నడ బ్యాచ్‌లోనే చేరాడు. అలా తనకు కూడా నెగిటివిటీ ఏర్పడింది. కానీ తాను చేస్తున్న తప్పేంటో నిఖిల్ త్వరగా తెలుసుకున్నాడు. ఎవరి వల్ల తన గేమ్ డౌన్ అయిపోతుందో వారికి దూరమయ్యాడు.


Also Read: విష్ణుప్రియా కోసం ఆ విద్య నేర్చుకుంటానన్న పృథ్వి.. పెళ్లికి ఓకే చెప్పినట్టేనా?

అమ్మ సలహాలు, సూచనలతో

పృథ్వి, యష్మీ కూడా ఆ కన్నడ బ్యాచ్‌కు చెందినవారే. కానీ వారు ఎలిమినేట్ అయినా నిఖిల్ మాత్రం టాప్ 5 వరకు వెళ్లి అక్కడ విన్నర్ కూడా అయ్యాడు. బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా నిఖిల్ తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అప్పుడు అమ్మాయిలకు దూరంగా ఉండమని ఆమె సలహా ఇచ్చారు. అలా ఆమె చెప్పిన మరికొన్ని పాయింట్స్‌ను నిఖిల్ మైండ్‌లో పెట్టుకొని తన గేమ్‌ను మార్చుకున్నాడు. ఫైనల్స్ దగ్గర పడుతున్నకొద్దీ తన ఆట మరింత మారింది. చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. గొడవలకు దూరంగా ఉన్నాడు. అవతలి కంటెస్టెంట్స్ రెచ్చిపోయినా.. తనను రెచ్చగొట్టినా తను మాత్రం కంట్రోల్‌లోనే ఉన్నాడు.

గట్టి సపోర్ట్

బిగ్ బాస్ సీజన్ 8కు నిఖిల్ విన్నర్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం తనకు బుల్లితెర నటీనటుల నుండి ఉన్న సపోర్ట్. బుల్లితెరపై నిఖిల్ హీరోగా చాలా ఫేమస్ అయ్యాడు. ఫేమ్ సంపాదించుకున్నాడు. అదే క్రమంలో ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. అలా చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు నిఖిల్‌ను గెలిపించమని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. అలా తనకు భారీ సపోర్ట్ లభించింది. హౌస్ నుండి వెళ్లిపోయిన చాలామంది కంటెస్టెంట్స్ సపోర్ట్ కూడా నిఖిల్‌కే దక్కింది. యష్మీ, పృథ్వి హౌస్ నుండి వెళ్లిపోయిన తర్వాత కన్నడ బ్యాచ్ అనే ట్యాగ్‌ను ప్రేక్షకులు పూర్తిగా మర్చిపోయారు. అక్కడి నుండి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ ఫైనల్స్‌కు వచ్చి విన్నర్ కూడా అయ్యాడు నిఖిల్.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×