BigTV English

Bigg Boss 8 Telugu Winner: మీ ఇంటివాడినే అని నిరూపించారు.. తెలుగు ప్రేక్షకులపై బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కామెంట్స్

Bigg Boss 8 Telugu Winner: మీ ఇంటివాడినే అని నిరూపించారు.. తెలుగు ప్రేక్షకులపై బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కామెంట్స్

Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిలిచాడు నిఖిల్. ఒక సీరియల్ ఆర్టిస్ట్‌గా నిఖిల్ చాలాకాలం నుండే ప్రేక్షకులకు పరిచయం. అలా ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వచ్చి అందరికీ మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ 8లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కంటెస్టెంట్‌గా నిఖిల్ నిలిచాడు. ఈసారి బిగ్ బాస్‌లో ప్రతీవారం కెప్టెన్స్ అనేవారు ఉండరని, చీఫ్స్ అనేవారు మాత్రమే ఉంటారని ముందే నాగార్జున స్పష్టం చేశారు. అలా చీఫ్ అనే పదవి మొదలయినప్పుడే మొదటి చీఫ్ అయ్యి తన సత్తా ఏంటో చాటాడు నిఖిల్. అలా వరుసగా నాలుగు వారాల పాటు తానే చీఫ్‌గా ఉన్నాడు. ఇప్పటికీ చీఫ్‌గా నిఖిల్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఇప్పుడు బిగ్ బాస్ 8 విన్నర్‌గా నిలిచి మరొక రికార్డ్ బ్రేక్ చేశాడు నిఖిల్.


ఫ్యాన్స్ హ్యాపీ

ఇప్పటివరకు తెలుగులో 7 బిగ్ బాస్ సీజన్స్ పూర్తయ్యాయి. ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే దక్కింది. కానీ ఈసారి విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీ ఇంకాస్త పెరిగింది. బిగ్ బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్.. రూ.55 లక్షల ప్రైజ్ మనీతో ఇంటికి వెళ్తున్నాడు. దాంతో పాటు ట్రోఫీ కూడా దక్కించుకున్నాడు. ఇక ప్రతీ సీజన్ బిగ్ బాస్ విన్నర్‌కు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. అలా ఈ సీజన్‌లో నిఖిల్‌కు కార్ గిఫ్ట్‌గా వచ్చింది. ప్రైజ్ మనీ, ట్రోఫీ, కార్.. ఇవన్నీ స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన రామ్ చరణ్ చేతుల మీదుగా అందుకున్నాడు నిఖిల్. తానే విన్నర్ అని తెలిసిన తర్వాత నిఖిల్ మొహంలో చిరునవ్వు చూసి తనకు ఓట్లు వేసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


Also Read: బిగ్ బాస్ ఫినాలే ఇప్పుడు లేనట్టే.. మరో రెండు వారాలు హౌస్‌లోనే..

అమ్మకే అంకితం

బిగ్ బాస్ సీజన్ 8కు విన్నర్ నిఖిల్ అయితే గౌతమ్ రన్నర్‌గా నిలిచాడు. అయితే తాను రన్నర్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నాడో గౌతమ్‌ను చెప్పమన్నారు నాగార్జున. తాను రన్నర్‌గా నిలిచినందుకు తనకేమీ బాధ లేదని, తన తల్లిదండ్రులను కూడా బాధపడొద్దని చెప్పాడు. తన జీవితంలో ప్రతీ అడుగు తల్లిదండ్రులను గర్వపడేలా చేయడానికే వేస్తానని తెలిపాడు గౌతమ్. ఇతర కంటెస్టెంట్స్ కూడా గౌతమ్ రన్నర్ అయినందుకు తనకు కంగ్రాట్స్ తెలిపారు. ఇక విన్నర్‌గా నిలిచిన నిఖిల్‌కు తన సంతోషం వ్యక్తం చేసే ఛాన్స్ వచ్చింది. ముందుగా బిగ్ బాస్ 8 ట్రోఫీని, ఆ విజయాన్ని తన తల్లికి, తన తమ్ముడికి అంకితం చేస్తానని అన్నాడు నిఖిల్.

అందరినీ కలుస్తాను

పాత కంటెస్టెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన నిఖిల్.. వారితో ఈ బిగ్ బాస్ ప్రయాణం చాలా సంతోషంగా గడిచిందని చెప్పుకొచ్చింది. అందరితో కలిసి నవ్వానని, ఏడ్చానని, గొడవలు పడ్డానని గుర్తుచేసుకున్నాడు. ఎప్పటికైనా తాను కూడా అందరిలో ఒకడిని అని అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత అందరినీ ప్రత్యేకంగా కలుస్తానని మాటిచ్చాడు. చివరిగా ఈ గెలుపుతో నేను మీ ఇంటివాడినే అని నిరూపించారంటూ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు నిఖిల్. బిగ్ బాస్ 8 వల్ల నిఖిల్‌పై ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతకంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ కూడా దక్కింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×