BigTV English

Allu Arjun: కిరణ్ అబ్బవరంకు సారీ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా.. ?

Allu Arjun: కిరణ్ అబ్బవరంకు సారీ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా.. ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  గురించి ఇండస్ట్రీలో అందరికీ తెల్సిందే.  హీరో అంటే ఫ్యాన్స్ ఉంటారు.. యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు.  ఎంత పాజిటివిటీ అయితే ఉంటుందో.. దానికి మించిన నెగెటివిటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం బన్నీ ఆ రెండింటిని సమానంగా ఎదుర్కుంటున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. చిన్న సినిమాలకు కానీ, చిన్న హీరోలకు కానీ, అల్లు అర్జున్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు. చిన్న సినిమాల పోస్టర్స్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ గా ఆహ్వానిస్తే నిర్మొహమాటంగా వెళ్లి.. ఆ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తాడు.


అంతేనా ఒక సినిమా  హిట్ అయ్యింది అంటే.. అది ఏ సినిమా.. హీరో ఎవరు.. ? డబ్బింగ్ నా.. ? రీమేక్ నా.. ?   ఇలాంటివేమీ ఆలోచించకుండా సినిమా వెళ్లి చూసి.. చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ చెప్తూ ఉంటాడు. అందుకే బన్నీ అంటే.. చాలామందికి అంత ఇష్టం.  ఎంత ఐకాన్ స్టార్ అయినా  కూడా  కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడు అండగా ఉంటాడు.   తాజాగా  అల్లు అర్జున్..  యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు సారీ చెప్పాడు. ఏం మాట్లాడుతున్నారు.. కిరణ్ కు బన్నీ ఎందుకు సారీ చెప్పాడు అనేగా.. తెలుసుకుందాం.

Nayanthara: Beyond the Fairy Tale: నయన్ ను శింబు అంత వేధించాడా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నాగార్జున


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నిన్న పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ తరువాత సినిమాపై  అంచనాలు ఆకాశాన్ని తాకాయి.  అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని ట్రైలర్ ను బట్టి అర్థమైపోతుంది.  ఇక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పుష్ప 2 ట్రైలర్ పై తమ రివ్యూలు ఇస్తున్నారు.

కిరణ్ సైతం పుష్ప 2 ట్రైలర్ చూసి.. వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కు అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. ” థాంక్యూ మై బ్రదర్.. మరియు నీ ‘క’ సినిమా హిట్ అయ్యినందుకు శుభాకాంక్షలు. బిజీ టైమ్ వలన నీ సినిమాను నేను చూడలేకపోయాను.. క్షమించు. కచ్చితంగా సినిమా చూసి నీకు కాల్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా చూడనందుకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, బన్నీ చెప్పాడు.. అది  ఐకాన్ స్టార్ అంటే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి బన్నీ.. పుష్ప 2 తో ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×