Bigg Boss Telugu 9 Latest Promo: బిగ్బాస్ 9 తెలుగు త్వరలో గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది. ఈసారి హౌజ్లోకి సామాన్యులకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏకంగా హోస్ట్ నాగార్జున ప్రకటన ఇచ్చారు. ఇటీవల ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి సాధారణ ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇచ్చారు. దీంతో బిగ్బాస్ ఛాన్స్ కొట్టేసేందుకు సామాన్యుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుందట. వేలల్లో అప్లికేషన్స్ వచ్చినట్టు బిగ్బాస్ టీం తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. తాజాగా ప్రొమో విడుదల చేస్తూ సామాన్యులకు ఇక అగ్ని పరీక్ష అంటూ ప్రొమో విడుదల చేశారు.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రొమో
తాజాగా హోస్ట్ నాగార్జున ఉన్న ప్రొమోని బిగ్బాస్ టీం విడుదల చేసింది. ఇందులో ఆయన సామాన్యుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చినట్టు చెప్పారు. “థ్యాంక్యూ ఫర్ ఫెంటాస్టిక్, అవుట్ స్టాండిక్ రెస్పాన్స్. ఎంతోమంది నుంచి 40 మందిని ఎంపిక చేశాం. ఇప్పుడు మొదలవుతుంది అసలైన పరీక్ష.. ‘అగ్ని పరీక్ష‘. దాన్ని దాటుకుని ఎవరూ హౌజ్లోకి వెళతారో చూద్దాం. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే” అంటూ బజ్ పెంచారు. ఈ వీడియోతో ఈ సీజన్ మరింత హైప్ పెరిగింది. ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లో హై ఒల్టేజ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందంటూ ముందు హోస్ట్ నాగ్ హైప్ పెంచుతున్నారు. ఈ తాజా ప్రొమో మరింత బజ్ క్రియేట్ అయ్యింది.
కాగా ఎంపికైన సామాన్యులకు అగ్ని పరీక్ష పేరుతో పోటీ నిర్వహిస్తోంది బిగ్బాస్ టీం. ఇందులో గెలిచిన వారిని ఫైనల్ కంటెస్టెంట్స్‌గా హౌజ్లోకి పంపనున్నారు. అలాగే కామనర్స్తో పాటు సినీ, టీవీ సెలబ్రిటీలు కూడా ఉండబోతున్నారు. ఈసారి సామాన్యులకు ఎంట్రీ అంటే.. బిగ్ బాస్ గ్రూపిజం ఉండబోతుందని అర్థమైపోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలంటూ రెండు గ్రూప్స్ మధ్య వార్ ఉండబోతుందేమో అని అంటున్నారు. దీంతో ఈసారి బిగ్బాస్ ప్లాన్ మామూలుగా లేదని, సీజన్9ను భారీగానే ప్లాన్ చేశారంటున్నారు. ఇక ఈ అగ్ని పరీక్ష పోటీ ఈవెంట్కి యాంకర్ శ్రీముఖీ హోస్ట్గా వ్యవహరించనుందని టాక్. ఈ సీజన్ సెప్టెంబర్ 7న గ్రాండ్గా లాంచ్ కాబోతుందని సమాచారం. త్వరలోనే దీనిపై బిగ్బాస్ టీం నుంచి అధికారిక ప్రకటన రానుందట.
కంటెస్టెంట్స్ లిస్ట్
సీరియల్ నటి, అమర్ దీప్ భార్య తేజస్వీని గౌడ,కాంట్రవర్సల్ బ్యూటీ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్, గుప్పెడంత మనసు ఫేం ముఖేష్ గౌడ, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, స్వామి, నటుడు సాయి కిరణ్‌లు కన్‌ఫాం కంటెస్టెంట్స్ అంటున్నారు. అలాగే నటి కల్పిక గణేష్ కూడా బిగ్బాస్ టీం అప్రోచ్ అయ్యిందట. ఆమె కూడా కన్ఫాం కంటెస్టెంట్స్ అంటున్నారు. తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కల్పిక.. ఇక బిగ్బాస్ హౌజ్లోకి వస్తే.. వివాదాలకు, గొడవలకు కొదువే ఉండదు. ఇక ఫ్యాన్స్కి పండగే పండగ అని చెప్పాలి. సామాన్యులు, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్స్.. శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, దేబ్‌జానీ, రితూ చౌదరి, దీపిక, సీతకాంత్, హరీక, ఎక్‌నాథ్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ రేఖా భోజ్‌లు సెలక్ట్ అయినట్టు తెలుస్తోంది.
Also Read: Bigg Boss 9 telugu: బిగ్బాస్ 9 తెలుగు షో లాంచ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే ప్రారంభం