Bigg Boss Telugu 9 Grand Launch on This Date: బిగ్ బాస్.. బుల్లితెరపై ఈ రియాలిటీ షో ఎంతో ఆదరణ పొందింది. ఈ మొదలైందంటే అభిమానులకు పండగే. మూడు నెలల పాటు బుల్లితెరపై ప్రేక్షకులను టీవీలకే కట్టిపడేస్తోంది. హౌజ్లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వాగ్వాదాలు, లవ్ ట్రాక్స్.. టాస్క్తో ఆకట్టుకుంటోంది. అన్ని భాషల్లోనూ ఈ షో మంచి విజయం సాధించింది. ఇక తెలుగులో త్వరలోనే కొత్త సీజన్ రాబోతోంది.
ఆ రోజే గ్రాండ్ లాంచ్
ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే తొమ్మిదవ సీజన్ను మొదలు కానుంది. ఇప్పటికే దీనిపై అప్డేట్ కూడా ఇచ్చారు. ఈసారి సామాన్యులకు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతోన్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ను ప్రకటించారు. ఇక త్వరలోనే గ్రాండ్ లాంచ్కి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేశారట. సెప్టెంబర్ 7న బిగ్ బస్ తెలుగు 9 ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే పలువురు టీవీ, సినీ సెలబ్రిటీలను బిగ్ బాస్ టీం సంప్రదించింది.
అందులో కొందరు కన్ఫాం అయ్యారని సమాచారం. ఇక సామాన్యులను ‘అగ్ని పరీక్ష‘ పేరుతో వారికి పోటీ నిర్వహించిన గెలిచిన వారిని ఎంపిక చేయనున్నారు. ఆగష్టు 2 నుంచి ఈ అగ్ని పరీక్ష కార్యక్రమం జరగనుందట. దీనికి శ్రీముఖీ హోస్ట్గా వ్యవహరించనుందని సమాచారం. ఇదంత ఒకే అయ్యాక.. సెప్టెంబర్ 7న షోని గ్రాండ్ గా లాంచ్ చేయాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. ఈసారి కూడా నాగార్జున అక్కినేని షోకి హోస్ట్గా వ్యవహరించనున్నారు.
హౌజ్ లోకి కల్పిక గణేష్?
సీరియల్ నటి, అమర్ దీప్ భార్య తేజస్వీని గౌడ,కాంట్రవర్సల్ బ్యూటీ అలేఖ్యా చిట్టిపిక్కిల్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, స్వామి, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, ముఖేష్ గౌడ, నటుడు సాయి కిరణ్‌లు కన్‌ఫాం కంటెస్టెంట్స్ అంటున్నారు. అలాగే వివాదస్పద నటి కల్పిక గణేష్ కూడా బిగ్బాస్ టీం అప్రోచ్ అయ్యిందట. ఆమె కూడా కన్ఫాం కంటెస్టెంట్స్ అంటున్నారు. తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కల్పిక.. ఇక బిగ్బాస్ హౌజ్‌లోకి వస్తే.. వివాదాలకు, గొడవలకు కొదువే ఉండదు. ఇక ఫ్యాన్స్కి పండగే పండగ అని చెప్పాలి. సామాన్యులు, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్స్.. శ్రావణి వర్మ, ఆర్జే రాజ్, దేబ్‌జానీ, రితూ చౌదరి, దీపిక, సీతకాంత్, హరీక, ఎక్‌నాథ్, సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ రేఖా భోజ్‌లు హౌజ్ లోకి వచ్చే అవకాశం ఉందట. దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చేది వీరే అంటూ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే షో లాంచ్ డేట్ వరకు వేచి చూడాల్సిందే.