New Vande Bharat Train: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఏపీ, తెలంగాణ నుంచి రాకపోకలు కొనసాగించే అన్ని రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో కొత్త వందేభారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు వరకు వెళ్లే వందేభారత్ రైలు ఇండియన్ రైల్వే ఆమోదం తెలిపింది. కేవలం 4 గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతి చేరుకునే అవకాశం లభించనుంది. అటు నర్సాపురం నుంచి అరుణాచలం వెళ్లే రైలుకు రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా నుంచి అరుణాచలంకు వందేభారత్ రైలు నడపాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ అంశంపై రైల్వే అధికారులు పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది.
నరసాపురం – తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైలు
ఆంధ్రా నుంచి అరుణాచలం వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు మరింత పెరిగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మంత్రి భూపతిరాజు రిక్వెస్ట్ తో నరసాపురం – తిరువణ్ణామలై ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వేశాఖ.ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి, గురువారం ఉదయం 5 గంటలకు తిరువణ్ణామలైకు చేరుకుంటుంది. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువణ్ణామలైలో బయల్దేరి శుక్రవారం ఉదయం నరసాపురం చేరుకుంటుంది. ప్రయాణీకుల రద్దీని బట్టి ఈ రైలును పర్మినెంట్ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. .
విజయవాడ నుంచి అరుణాచలంకు వందేభారత్!
ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైలు అందుబాటులో ఉంది. ఈ రైల్లో సుమారు 7 గంటల్లో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లొచ్చు. చెన్నైలో ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయల్దేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. మార్గ మధ్యలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. మళ్లీ అదే రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ వందేభారత్ రైలుని తిరువణ్ణామలై వరకు లింక్ చేయాలనే అంశంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఇండియాలో ఈ రైళ్లు ఎక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలి.. ఒక్క టికెట్ ధర ఎంతో తెలుసా?
మూడు వందేభారత్ రైళ్ల అధికారుల ఆరా
ఏపీలో వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆయా అంశాలను పరిశీలిస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలును నడిపేందుకు రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంకా ప్రారంభం కాలేదు. అటు నర్సాపురం నుంచి చెన్నైకు వందేభారత్ రైలు కోసం ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లే వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగించాలానే డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ- తిరువణ్ణామలై వరకు వందేభారత్ ను నడిపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
Read Also: ముందు చక్రం లేని సైకిల్‌పై సాహస యాత్ర.. ఘాట్ రోడ్డులో అతడి అడ్వేంచర్ చూస్తే షాకే!