తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. ఎప్పటికప్పుడు మంచి వినోదాన్ని పంచుతోంది బిగ్గెస్ట్ వరల్డ్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తిచేసుకుని, ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 11వ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీస్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈవారం హౌస్ మొత్తం కన్నీటి భాష్పాలు, భావోద్వేగాలు, సంతోషాల మధ్య సాగుతోంది.
ఇకపోతే మొదట నబీల్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చి అందరికీ శుభాకాంక్షలు చెప్పగా.. ఇప్పుడు యష్మికి సర్ప్రైజ్ ఇస్తూ యష్మీ వాళ్ళ నాన్న హౌస్ లోకి వచ్చారు. హౌస్ లో అందరూ ఒక్కసారిగా ఫ్రీజ్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పగా. చిన్నపిల్లల కాగితాల ఎయిర్ ప్లేన్ తో ఆడుకుంటున్న యష్మీ కూడా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. ఇక ఆమె చూస్తుండగానే ఆమె నాన్న హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇక తండ్రి వచ్చాడన్న ఆనందాన్ని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ బిగ్ బాస్ ఇచ్చిన కండీషన్ ని మాత్రం ఆమె తప్పలేదు. ఇక తన నాన్న దగ్గరగా రావడంతో నాన్న బిగ్ బాస్ ఫ్రీజ్ లో ఉండమని చెప్పాడు. మళ్ళీ రిలీజ్ చేస్తాడు ఒక్క నిమిషం ఆగు అని చెప్పగానే బిగ్ బాస్ యష్మీ ని రిలీజ్ చేశాడు.
ఇక తండ్రిని చూసిన ఆనందంలో యష్మీ కన్నీటి పర్యంతం అయిపోయింది. గట్టిగా తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది. ఇక తర్వాత హౌస్ లో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా రిలీజ్ చేశారు బిగ్ బాస్. వారందరితో కూడా యష్మి తండ్రి సరదాగా మాట్లాడుతూ.. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక తర్వాత కూతురితో మాట్లాడుతూ..” నిన్ను అందరూ బయట చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు” ఇకనైనా అందరితో కలిసి మంచిగా గేమ్ ఆడు” అంటూ ఆమెకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఇక బయటకు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరితో కూడా..” మా కూతురు మీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే.. ఆమె తరఫున నేను సారి చెబుతున్నాను.. దయచేసి క్షమించండి” అంటూ కంటెస్టెంట్స్ ని కోరారు. అవినాష్ ఆయనను హత్తుకుని అలాంటిది అంతా ఏమీ లేదు. ఇది గేమ్ వరకు మాత్రమే అంటూ ఆమె తండ్రిని సంతోషపరిచారు. ఇకపోతే తాజాగా ఈ ప్రోమో వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. ఇప్పటికే హౌస్ లో , బయటా యష్మీ పై నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. ఇక తెలుగు ఆడియన్స్ నాడీ పట్టుకున్న యష్మీ తండ్రి అక్కడ అందరికీ క్షమాపణలు చెబుతూ.. కూతురిపై హైప్ పెంచేశారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరి కొంతమంది యష్మి తండ్రి చాలా స్వీట్.. ఆయన చాలా మంచివారిలా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూతురి కోసం ఒక తండ్రి పడే ఆరాటం హౌస్ లో చాలా స్పష్టంగా కనిపించింది అని చెప్పవచ్చు.