Kandy And Ella Train: ప్రతి దేశంలో పర్యటకులను అత్యంత ఆకట్టుకునే రైలు ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణం. ఇది శ్రీలంకలో ఉంది. కాండీ నుంచి ఎల్లా వరకు మొత్తం 85 మైళ్ల వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ప్రకృతి అందాల నడుమ సుమారు 6 నుంచి 10 గంటల పాటు ప్రయాణీకులు ఎంతో ఉల్లాసంగా జర్నీ చేస్తారు. కాండీ నుంచి ఎల్లా వరకు వెళ్లే రైలు అందమైన టీ తోటలు, అడవులు, పర్వతాలు, లోయల మీదుగా ప్రయాణిస్తూ టూరిస్టులకు థ్రిల్ కలిగిస్తుంది. జలపాతాలు, పచ్చిక బయళ్లు కనువిందు చేస్తాయి.
కాండీ నుంచి ఎల్లా రైలు ప్రయాణం
కాండీ నుంచి ఎల్లా మధ్య 85 మైళ్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణానికి సుమారు 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ప్రేక్షకులు ప్రకృతి అందాలను చూసేందుకు రైలును నెమ్మదిగా తీసుకెళ్తారు. అందుకే ఎక్కువ సమయం పడుతుంది.
పొద్దున్నే వెళ్లడం మంచిది
కాండీ నుంచి ఎల్లాకు ఉదయం రైలు ప్రయాణం చేయడం మంచిది. లేలేత భానుడి కిరణాలు పడుతుంతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. రైలు డోర్ల దగ్గర నిలబడి ఎంజాయ్ చెయ్యవచ్చు. వీకెండ్ లో ఈ జర్నీకి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది.
దారిలో పలు స్టాఫ్ లు
ఈ రైలు నువారా ఎలియా, హపుటలే లాంటి అందమైన కొండ ప్రాంతాల్లో ఆగుతుంది. అక్కడ ప్రసిద్ధ తేయాకు తోటలను చూసే అవకాశం ఉంటుంది. ఎత్తైన ప్రాంతాలు, తేమతో కూడిన వాతావరణం టూరిస్టులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
రైలులో ఏవైపు వెళ్లడం మంచిదంటే?
ఈ రైలులో ప్రయాణం చేస్తూ అద్భుతమైన ఫోటోలను పొందాలంటే నువారా ఎలియా వరకు రైలు కుడి వైపు ఉండాలి. మిగిలిన ట్రిప్ కోసం ఎడమ వైపుకు వెళ్లాలి.
స్థానిక వంటలు రుచి చూడండి
కాండీ నుంచి ఎల్లా రైలు ప్రయాణంలో పలు స్టేషన్లలో స్థానిక తినుబండారాలు లభిస్తాయి. స్పైసీ స్నాక్స్, ఉప్పుగా ఉండే వేరు శెనగలు, తాజా పండ్లు లభిస్తాయి.
మూడు క్లాసుల ప్రయాణం
సాధారణంగా ఏ రైలులోనైనా ఫస్ట్-క్లాస్ టిక్కెట్లు బెస్ట్ ఆప్షన్. కాండీ-ఎల్లా రైలు దీనికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఎయిర్ కండిషన్ చేయబడింది. ఫోటోలు తీయడానికి కిటికీ, తలుపులు తెరవలేరు. రెండో తరగతిని సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. తలుపుల దగ్గర బయటకు వేలాడే అవకాశం ఉంటుంది. థర్డ్ క్లాస్ చాలా అసౌకర్యంగా ఉంటుంది. స్థానికులు తమ ఉత్పత్తులను ఇందులో తీసుకెళ్తారు.
కాండీ నుంచి ఎల్లా టికెట్ ధరలు
కాండీ నుంచి ఎల్లా వరకు రోజు మూడు ట్రిప్పులు ఉంటాయ. ఏ క్లాస్ టికెట తీసుకుంటారే దాన్ని బట్టి ధర ఉంటుంది. దాదాపు రూ. 250 నుంచి రూ. 850 వరకు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ట్రావెల్ ఏజెన్సీలు, కాండీ రైల్వే స్టేషన్ లో టికెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం, పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ ట్రైన్!