BB Telugu 8 Promo:తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15వ తేదీన చాలా గ్రాండ్ గా ఫినాలే జరగబోతోందని సమాచారం. ఇకపోతే టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి మొదటి ఫైనలిస్టుగా స్థానం సంపాదించుకున్నారు వైల్డ్ కార్డు ఎంట్రీ అవినాష్(Avinash). ఇకపోతే ఈ వారం 13వ వారం డబుల్ ఎలిమినేషన్ తో కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). అందులో భాగంగానే నిన్న కొంతమందికి గోల్డెన్ టికెట్స్, మరి కొంతమందికి బ్లాక్ టికెట్స్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న టేస్టీ తేజ(Tasty Teja)తన తెలివితేటలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. కానీ అనూహ్యంగా నిన్నటి ఎపిసోడ్లో ఎలిమినేట్ అయ్యారు.
ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా మెగా చీఫ్ రోహిణి మినహా.. ముక్కు అవినాష్, ప్రేరణ, నబీల్, టేస్టీ తేజ, నిఖిల్, పృథ్వీ, విష్ణు ప్రియ, గౌతమ్ నామినేషన్స్ లోకి రాగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈరోజు పృథ్వీ ఎలిమినేట్ కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా సండే కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. ఇందులో ఈ సండే ని కాస్త మరింత ఫన్ గా మార్చి కంటెస్టెంట్స్ మొత్తం సందడి చేశారు. ఇక ఈవారం హోస్ట్ నాగార్జున మరింత స్మార్ట్ లుక్ లో కనిపించి అందరిని మెస్మరైజ్ చేశారు.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఇకపోతే ఉన్న ఎనిమిది మందిని రెండు టీములుగా విడగొట్టారు హోస్ట్ నాగార్జున. అందులో ఒకటి టీం ప్రేరణ, పృథ్వి, విష్ణు ప్రియ, నిఖిల్ కాగా, రెండవ టీం నబీల్, అవినాష్, గౌతమ్ రోహిణి. గెస్ ద సాంగ్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు హోస్ట్ నాగార్జున. అక్కడున్న ఫిష్ బౌల్లో ఒక స్లిప్పు తీసి అందులో ఉన్న పాటను డాన్స్ రూపంలో చూపించాలి.. మిగతావారు ఆ పాట ఏంటో గెస్ చేయాలి అంటూ తెలిపారు. ఇక అలా మొదట రోహిణి “కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్” అనే పాటకు హుక్ స్టెప్ వేసి రోహిణి చూపించగా.. గౌతమ్ ఆ పాటను గెస్ చేశారు. ఆ తర్వాత అవినాష్ తో ఈ పాట ఏ సినిమాలోది అని అడగ్గా.. నాగచైతన్య అని పేరు చెప్పగానే ,వున్న పాయింట్ కాస్త పోయింది అంటూ చెప్పాడు హోస్ట్ నాగార్జున.
ఇక తర్వాత విష్ణు ప్రియ “పైసా వసూల్” అనే పాటకు హుక్ స్టెప్పు వేయగా ఆమె టీం గెస్ చేసి డాన్స్ వేశారు. ఇక తర్వాత నబీల్ హుక్ స్టెప్ వేయగా.. టీం గెస్ చేయలేక పోతారు. ఆ తర్వాత విష్ణు ప్రియా టీం పాయింట్ గెలిచేసింది. ఆ తర్వాత హుక్ స్టెప్ వేస్తూ పాట ఐడెంటిఫై చేయలేక వారు వేసిన వేషాలు అందరికీ నవ్వు తెప్పించాయి.