BigTV English

BB Telugu 8: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అఖిల్.. టెన్షన్ లో కంటెస్టెంట్స్..!

BB Telugu 8: చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అఖిల్.. టెన్షన్ లో కంటెస్టెంట్స్..!

BB Telugu 8:ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే 12 వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఈ షో. ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకున్న యష్మీ (Yashmi) టాప్ ఫైవ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ విష్ణుప్రియ(Vishnu Priya)తో ఆమె పడిన గొడవ వల్లే ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి, ఓట్లు కూడా కోల్పోయింది. దీంతో 12వ వారం ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకపోతే 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఇందులో 9 మంది హౌస్ మేట్స్ ఉండగా.. మెగా చీఫ్ రోహిణి(Rohini)మినహా మిగతా ఇంటి సభ్యులంతా నామినేషన్స్ లోకి వచ్చేసారు. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, నబీల్, టేస్టీ తేజ, విష్ణు ప్రియ, అవినాష్, గౌతమ్ కృష్ణ.. ఇలా మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు.


నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే ఓటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఓటింగ్ లో గౌతమ్ కృష్ణ(Gautham Krishna)మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ‘టికెట్ టు ఫినాలే’ కి నేరుగా స్థానం సంపాదించుకోవడానికి కంటెస్టెంట్స్ మధ్య టఫ్ టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్స్ లో సరికొత్త ఉత్కంఠ రేక్కిత్తిస్తున్నారు బిగ్ బాస్. ఇదిలా ఉండగా తాజాగా ఉదయం విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అఖిల్ (Akhil), హారిక(Harika)హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక వీరు ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ టికెట్ టు ఫినాలే రేస్ కి పోటీ పడాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలుపగా.. వీరు టేస్టీ తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియ లను సెలెక్ట్ చేశారు. ఇక వీరు తమ వంతు ప్రయత్నం చేయగా చివరికి రోహిణి టాస్క్ గెలిచింది.

ఇక ఇప్పుడు రెండవ ప్రోమోని విడుదల చేయగా ఇందులో తులాభారం అంటూ ఒక ఛాలెంజ్ నిర్వహించారు. అయితే చివర్లో అఖిల్ ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ అందరిలో ఉత్కంఠ రేకెత్తింది. ఇక తాజా ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ మాట్లాడుతూ.. “టికెట్ టు ఫినాలే రేస్ లో మీ బ్యాలెన్సింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి ఛాలెంజ్ తులాభారం” అంటూ టాస్క్ గురించి వివరించారు. రోహిణి తో మాట్లాడుతూ.. “రోహిణి మీరు ఎనిమిది బాక్సులు తీసుకొని మీ తులాభారంలో వేలాడదీయండి” అంటూ తెలిపారు బిగ్ బాస్. ఇక అలా మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. టేస్టీ తేజ, విష్ణు ప్రియ, గౌతమ్ కృష్ణ, రోహిణి.


ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ.. “పోటీదారులు మీకు కావలసిన తదుపరి బాక్స్ లను తీసుకొని మీ తులాభారం లో వేలాడదీయండి” అంటూ టాస్క్ ప్రారంభించగానే నలుగురు కంటెస్టెంట్స్ కూడా పోటీపడ్డారు. ఇక సరిగ్గా తులాభారం చూసుకునేలోపే గంట మోగించండి అంటూ గెస్ట్లు అరవగా.. వెంటనే గౌతమ్ వచ్చి గంట మోగించి, టాస్క్ గెలిచారు. ఇక చివర్లో అఖిల్, హారిక ఈరోజు జరిగిన రెండు ఛాలెంజ్లను బట్టి బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికి ఇచ్చి, టికెట్ టు ఫినాలే రేసు నుంచి తప్పిద్దాం అనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అడిగారు. అఖిల్ మాట్లాడుతూ.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారంటే ,ఇక టికెట్ టు ఫినాలే రేస్ కు సంబంధించి ఎటువంటి టాస్క్ లలో పాల్గొనకూడదు అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఎవరికి బ్లాక్ బ్యాడ్జ్ రాబోతోంది అనే ఉత్కంఠ కంటెస్టెంట్స్ లో నెలకొంది. ఇకపోతే ఈ బ్యాడ్జ్ టేస్టీ తేజకిచ్చే అవకాశం ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×