Train Travel Vs Flight Travel: చాలా మంది విమాన ప్రయాణం చాలా లగ్జరీగా ఉంటుంది అనుకుంటారు. కానీ, విమాన ప్రయాణంతో పోల్చితే రైలు ప్రయాణం చాలా జాయ్ ఫుల్ గా ఉంటుందంటారు ట్రావెలర్స్. విమాన ప్రయాణం చేయాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. రైలు ప్రయాణంలో చాలా తక్కువగా ఉంటాయి. విమాన ప్రయాణంతో పోల్చితే రైలు ప్రయాణం ఎందుకు బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ సెక్యూరిటీ చిక్కులు లేవు
విమానాశ్రయంలోకి ఎంటర్ కావాలంటే బోలెడు చెక్ పాయింట్లు ఉంటాయి. అవసరం అయితే, దుస్తులు విప్పి చెక్ చేస్తారు. కానీ, రైల్లో ప్రయాణం చేయాలంటే ఒకే ఒక్క చెక్ పాయింట్ ఉంటుంది. ఎయిర్ పోర్టుతో పోల్చితే రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ టెన్షన్ అస్సలు ఉండదు.
⦿ ప్రకృతి అందాలు చూస్తూ
విమానంలో నుంచి ఎటు చూసినా మేఘాలే కనిపిస్తాయి. కానీ, విమాన ప్రయణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. జర్నీలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం ఉంటుంది. పట్టణాలు, గ్రామాలు చూడముచ్చటగా ఉంటాయి. లాంగ్ ట్రైన్ జర్నీ ప్రయాణీకులలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
⦿ ఎకో ఫ్రెండ్లీ ప్రయాణం
విమానం కలిగించే పొల్యూషన్ తో పోల్చితే రైలు పొల్యూషన్ చాలా తక్కకువగా ఉంటుంది. యూరప్, జపాన్‌లలోని హైస్పీడ్ రైళ్లు కూడా విమానాల మాదిరిగా దూసుకెళ్తాయి. అదీ కాలుష్యం లేకుండా.
⦿ అదనపు ఛార్జీలు ఉండవు
విమాన సంస్థలు టికెట్ ధర కాకుండా బోలెడు అదనపు ఛార్జీలను వసూళు చేస్తాయి. లగేజీ ఛార్జీ, సీటు సెలెక్షన్, స్నాక్స్ అంటూ అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తాయి. రైళ్లలో లగేజీ అలవెన్సులు, సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటాయి. హిడెన్ ఛార్జీలు ఉండవు.
⦿ ప్రయాణానికి అనుకూలం
రైల్వే స్టేషన్లు సాధారణంగా పట్టణాల మధ్యలో ఉంటాయి. తక్కువ సమయంలో రైల్వే స్టేషన్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ, విమానాశ్రయాలు నగరాలకు దూరంగా ఉంటాయి. అక్కడికి వెళ్లాలంటే అదనపు ఖర్చులు అవుతాయి.
⦿ ఫ్లెక్సిబుల్ లగేజ్ పాలసీలు
విమానాలతో పోల్చితే రైల్లో లగేజీ ఛార్జీలు అంతగా ఉండవు. విమానయాన సంస్థల కంటే రైల్వే సంస్థలు ఉదారంగా లగేజీ అలవెన్సులను అందిస్తాయి.
Read Also: బాబోయ్.. అన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారా? అసలు విషయం చెప్పిన రైల్వేమంత్రి!
⦿ నచ్చినట్లుగా ప్రయాణించే అవకాశం
విమానంలో నచ్చినట్లుగా ఉండేందుకు అవకాశం లేదు. కానీ, రైల్లో కూర్చోవడం బోర్ కొడితే అలా బోగీలో నడుచుకుంటూ వెళ్లొచ్చు. రైల్వే స్టేషన్లలో అవసరమైన కూల్ డ్రింక్స్, తినుబండారాలు కొనుగోలు చెయ్యొచ్చు. కానీ, విమానంలో సిబ్బంది పెట్టిన ఫుడ్ తినాల్సి ఉంటుంది.
⦿ రాత్రిపూట చక్కగా పడుకోవచ్చు
రాత్రిపూట రైలు ప్రయాణం కదిలే హోటల్ లా ఉంటుంది. స్లీపర్ కార్ల ప్రైవేట్ క్యాబిన్లలో హాయిగా నిద్రపోవచ్చు. ఎవరూ ఎలాంటి అంతరాయం కలిగించరు. తక్కువ ధరలో ఆహ్లాదకరంగా ప్రయాణం చేయవచ్చు. డబ్బు ఆదాకు రైలు ప్రయాణం ఎంపిక అనేది చాలా మంచి నిర్ణయం.
సో.. ఇంకెందుకు ఆలస్యం, ఇకపై మీరు కూడా విమాన ప్రయాణం కంటే రైలు ప్రయాణం చేయడం బెస్ట్. తక్కువ ధరలో రైల్లో ఆహ్లాదకర ప్రయాణం చేయండి!
Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!