BigTV English

Uttarandhra heavy rains: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్

Uttarandhra heavy rains: ఉత్తరాంధ్రలో వర్షాలు, పొంగుతున్న కాలువలు.. పోలీసుల వార్నింగ్

Uttarandhra heavy rains: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి వాంగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గతవారం విజయవాడ, గుంటూరు జిల్లాలను వర్షాలు వణికించాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వంతైంది. తాజాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ALSO READ: జగన్.. ఇంతకు నువ్వు ఒక్క పులిహోర ప్యాకెటైనా పంపిణీ చేశావా..?: అనిత


తాజాగా ఉమ్మడి విశాఖ ఏజెన్సీలోని కొత్తపల్లి జలపాతానికి వరద పోటెత్తింది.  ఆయా ప్రాంతాలకు స్థానికులు, పర్యాటకులు రావడం మొదలుకావడంతో పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతానికి పర్యాటకులు సందర్శనకు రావద్దని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామన్నారు.

భారీ వర్షాలకు నర్సీపట్నం సమీపంలో ఉన్న తాండవ జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో రహదారులపైకి వరద పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. రెండు గేట్లను ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరోవైపు నర్సీపట్నం-తుని మధ్య వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఇదిలావుండగా నర్సీపట్నం-చోడవరం ప్రాంతాల మధ్యనున్న కల్యాపులోపులోవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేసింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇక విశాఖ ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా వట్టిగెడ్డ జలాశయం కాలువ ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల మీదుగా రాకపోకలను నిలిచిపోయాయి.

అటు విజయనగరం, శ్రీకాకుళాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు ఏజెన్సీల్లోని పలు ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

విశాఖ సిటీలో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో సమీపంలోని ప్రజలు భయం గుప్పిట్లో వున్నారు. సమాచారం తెలియగానే ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విశాఖ ఏజెన్సీ-ఒడిషాకు మధ్యలో జోలాఫుట్ జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. ఈ డ్యామ్ సమీపంలోని విద్యుత్ కేంద్రాలకు నీటిని అందిస్తుంది. ప్రస్తుతం ఈ జలాశయం నుంచి 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ తరహా వర్షాలు తాము ఎప్పుడూ చూడలేని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు.

విజయనగరం జిల్లా భోగాపురం-పూసపాటి రేగ నేషనల్ హైవే -16 జలమయం అయ్యింది. కొద్ది గంటలపాటు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గుర్ల మండలం జమ్ముపేట రైల్వే పైవంతెన నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. అధికారులు కష్టాలుపడి చివరకు బస్సును బయటకు తీశారు.

ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర వాయవ్యం దిశగా పయనించింది. ప్రస్తుతం ఒడిషాలోని గోపాల్ పూర్ కు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. సోమవారం మధ్యాహ్నానానికి ఒడిషాలోని పూరి, బెంగాల్ లోని డిఘా మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం చెబుతున్నమాట.

 

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×